breaking news
marred woman died
-
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
చివ్వెంల(సూర్యాపేట) : అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని జి.తిర్మలగిరిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఆత్మకూర్(ఎస్) మండల పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన ఉప్పుల బుచ్చిమల్లు కుమార్తె కొమ్ము సునీత(28)కు చివ్వెంల మండల పరిధి జి.తిర్మలగిరి గ్రామానికి చెందిన కొమ్ము వెంకన్నతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కాగా మంగళవారం ఉదయం సునీత తీవ్ర అస్వస్థతకు గురకావడంతో చికిత్స నిమిత్తం సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఎస్ఐ బి.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మృతురాలి తండ్రి బుచ్చిమల్లు ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన సూర్యాపేట క్రైం : వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సునీత మృతిచెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. గాయపడిన సునీతను ఆస్పత్రిలో చేర్పిం చగా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి చికిత్స అందించకపోవడంతోనే మృతిచెందిందని ఆరోపించారు. మరో ఆస్పత్రికి వెళ్తామని చెప్పినా తామే వైద్యం చేస్తామని నిర్లక్ష్యం చేసి నిండు ప్రాణాన్ని బలిగొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీ సులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనను విరమింపజేశారు. -
కుటుంబ కలహాలతోనే..
మండలంలోని వల్లభాపురానికి చెందిన లక్ష్మికి రేగులగడ్డతండాకు చెందిన గంగరాజుతో 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు ప్రశాంత్(12), కూతురు యమున జన్మించారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారం రోజులుగా గొడవలు గంగరాజు, లక్ష్మి దంపతుల మధ్య వారం రోజలుగా గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది. గంగరాజుకు గ్రామంలోనే మరో మహిళతో వివాహేత సంబంధం ఉన్న సంగతిని తెలుసుకుని లక్ష్మి నిలదీయడంతో గొడవలు జరుగుతున్నాయి. దీంతో కోపోద్రిక్తుడైన భర్త గంగరాజు లక్ష్మిని తీవ్రంగా కొట్టినట్టు ఆమె ఒంటిపై కనిపిస్తున్న దెబ్బలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దీంతో లక్ష్మి ఇక తాను బలకనని గ్రామస్తులతో సైతం చెప్పినట్టు పేర్కొన్నారు. ఈలోగా అన్నంత పని చేసింది. తాను చనిపోతానంది కాని పిల్లలను చంపుకుంటుందని భావించలేదని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. అన్నం తినిపించి.. ఆపై.. కుటుంబ తగాదాలకు విసిగి వేసారిన లక్ష్మి ఎలాగైనా పిల్లలు, తాను తనువు చాలించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం లక్ష్మి తన కుమారుడు ప్రశాంత్, కూతురు యమునకు కడుపునిండా అన్నం తినిపించినట్టు స్థానికులు పేర్కొన్నారు. ఆపై వారికి ఏం చెప్పిందో తెలియదుకానీ ఇద్దరినీ తీసుకుని గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని వాపోతున్నారు. పచ్చని సంసారంలో అనుమానం చిచ్చురేపింది..తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే వదంతులను ఆమె జీర్ణించుకోలేకపోయింది.. కుటుంబంలో తగాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మానసిక వేదనకు గురైన ఆ ఇల్లాలు తనువుచాలించాలనుకుంది... తాను చనిపోతే ఇద్దరు పిల్లలు ఆలనాపాలనా పట్టించుకోరని, వారిని కడతేర్చిన తరువాతే తానూ చనిపోవాలనుకుంది.. ఇదీ.. నిడమనూరు మండలం రేగులగడ్డ తండాలో శక్రవారం ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి తాను పురుగులమందు తాగడానికి వెనుక ఉన్న కారణాలు. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. - నిడమనూరు అశ్రునయనాల మధ్య చిన్నారుల అంత్యక్రియలు తల్లి చేతిలో తనువుచాలించిన ప్రశాంత్, యమునల మృతదేహాలకు ఆదివారం రాత్రి రేగులగడ్డతండాలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం సాయంత్రం మృతదేహాలను రేగులగడ్డకు తీసుకొవచ్చారు. చిన్నారుల మృతదేహాలను చూసి బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎందుకే తల్లి ఇలా చేశావ్, నువ్వు పోయి బిడ్డలు బతికినా మేమన్నా చూసుకుందువుము కదా అంటూ బంధువులు వాపోయారు. తండ్రి మీద కోపంతో పిల్లలను బలితీసుకుందని అందరూ అనుకుంటున్నారు. పిల్లలు ఊపిరొదిలాకనే.. గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లగానే లక్ష్మి తొలుత తన ఇద్దరు పిల్లలను తోసేసింది. ఆపై వారు ఊపిరి వదిలారని తెలుసుకున్న తరువాతే తాను బావిలోకి దూకింది. అయితే ఈత రావడంతో చనీపోవడం వీలుకాక తడిబట్టలతోనే ఇంటికొచ్చి పురుగులమందు తాగినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో కోలుకుంటున్నట్టు గ్రామస్తులు తెలిపారు.