breaking news
Manik Prabhu
-
మాణిక్‌ప్రభు ఇంటిపై మళ్లీ ఏసీబీ దాడులు
హైదరాబాద్ : నల్గొండ జిల్లా గుర్రంపాడు డివిజన్ ఇరిగేషన్ డీఈ మాణిక్ ప్రభు నివాసంపై ఏసీబీ అధికారులు మరోసారి దాడి చేశారు. శుక్రవారం హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ ఎస్బీహెచ్ కాలనీలో నివాసం ఉంటున్న మాణిక్ ప్రభు నివాసంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఫిబ్రవరి 10వ తేదీన సైదాబాద్ తన ఇంటి సమీపంలో ఓ కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ. 1.37 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతడిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు రిమాండ్‌కు తరలించారు. తిరిగి మాణిక్ ప్రభు గురువారం బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు అతడి నివాసంపై మరోసారి దాడి చేశారు. హయత్‌నగర్, ఉప్పల్‌లో ప్లాట్లు, మూడు బ్యాంకుల్లో రూ. 73 లక్షలతోపాటు ఇంట్లో మరో రూ. 3 లక్షల నగదుతోపాటు 700 గ్రాముల బంగారం, కారు రెండు మోటారు సైకిళ్లు కూడా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. -
ఏసీబీకి దొరికిన ఇరిగేషన్ అధికారి
భారీగా లంచం తీసుకుంటూ.. ఓ ఇరిగేషన్ అధికారి ఏసీబీకి రెండ్ హాండెండ్ గా దొరికి పోయాడు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా గుర్రం పాడు డివిజన్ ఏఎంఆర్ ప్రాజెక్టుకు సంబంధించి రూ. 32లక్షల బిల్లు ప్రాసెస్ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ ఎం మానిక్ ప్రభు.. రూ.1,37,500 లంచం ఇవ్వాల్సిందిగా.. కాంట్రాక్టర్‌ను డిమాండ్ చేశాడు. దీంతో పి. జైపాల్ రెడ్డి డిప్యూటీ ఈఈపై ఏసీబీకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ ఏసీబీ రేంజ్ డీఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వలపన్నిన అధికారులు...సైదాబాద్ లోని ఎస్ బీ హెచ్ పార్కు వద్ద పట్టుకున్నారు. మానిక్ ప్రభు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.