ఏసీబీకి దొరికిన ఇరిగేషన్ అధికారి | Irrigation officer was caught by ACB | Sakshi
Sakshi News home page

ఏసీబీకి దొరికిన ఇరిగేషన్ అధికారి

Feb 10 2016 11:15 AM | Updated on Aug 17 2018 12:56 PM

భారీగా లంచం తీసుకుంటూ.. ఓ ఇరిగేషన్ అధికారి ఏసీబీకి రెండ్ హాండెండ్ గా దొరికి పోయాడు.

భారీగా లంచం తీసుకుంటూ.. ఓ ఇరిగేషన్ అధికారి ఏసీబీకి రెండ్ హాండెండ్ గా దొరికి పోయాడు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా గుర్రం పాడు డివిజన్ ఏఎంఆర్ ప్రాజెక్టుకు సంబంధించి రూ. 32లక్షల బిల్లు ప్రాసెస్ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ ఎం మానిక్ ప్రభు.. రూ.1,37,500 లంచం ఇవ్వాల్సిందిగా.. కాంట్రాక్టర్ను డిమాండ్ చేశాడు.

దీంతో పి. జైపాల్ రెడ్డి డిప్యూటీ ఈఈపై ఏసీబీకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ ఏసీబీ రేంజ్ డీఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వలపన్నిన అధికారులు...సైదాబాద్ లోని ఎస్ బీ హెచ్ పార్కు వద్ద  పట్టుకున్నారు. మానిక్ ప్రభు  పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement