breaking news
Malayalam film actor
-
విజయ్‌కు త్రిష.. నాకేమో నవ్వు!
సాక్షి సినిమా : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిష కృష్ణన్ బంధంపై తరచూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. మలయాళ నటుడు ధ్యాన్ శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. తన తాజా చిత్రం 'విజిటర్' ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడిన ధ్యాన్.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకను పరోక్షంగా ప్రస్తావిస్తూ వేసిన సరదా పంచ్‌లు ప్రేక్షకులను నవ్వించాయి. అయితే ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారడంతో పాటు విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్ ఈవెంట్లో తన సహనటి నవ్యా నాయర్‌ను ఉద్దేశించి ధ్యాన్ మాట్లాడుతూ.. "చాలా రోజుల తర్వాత మనిద్దరం కలిసి సినిమా చేస్తున్నాం. నవ్యాకు పెళ్లై, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయినా నేను ఒకరోజు కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే.. నువ్వు తెల్లచీర కట్టుకుని ముందు వరుసలో కూర్చొని, కళ్లలో నీళ్లతో నన్ను చూస్తూ ఉండాలి" అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ మాటలతో సభలో నవ్వులు పూశాయి.Trisha emotions were on high during Vijay oath ceremony. An emotional moment ❤️ pic.twitter.com/GrJcW88bwg— Devanshu Mani Tripathi (@devanshu_mani) May 10, 2026ఆ తర్వాత మైక్ అందుకున్న నవ్యా నాయర్ కూడా అదే స్థాయిలో స్పందించింది. "నువ్వు సీఎం అయితే.. నువ్వు చెప్పినట్టే తెల్లచీరకు ఆకుపచ్చ అంచు, డైమండ్ నెక్లెస్ వేసుకుని ముందు వరుసలో కూర్చుంటా. కళ్లలో ఆనందబాష్పాలతో నీకు జైకొడతా. కానీ ముందు వరుసలో నాకు సీటు మాత్రం రిజర్వ్ చేయాలి" అంటూ చమత్కరించింది. దీంతో సభలో మరోసారి నవ్వుల వెల్లువ ఎగిసింది.ఇదంతా సరదా సంభాషణలా అయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం తప్పు బడుతున్నారు. ఈ వ్యాఖ్యలను విజయ్ ప్రమాణ స్వీకార వేడుకతో పోలుస్తున్నారు. వాళ్లిద్దరిపైనా మండిపడుతున్నారు. The day I take the oath as CM... I think Navya will be there in the front row wearing a saree...!!- Dhyan Sreenivasan 😂 pic.twitter.com/UT5GvyK8Fq— Trollywood 𝕏 (@TrollywoodX) July 16, 2026 తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు త్రిష.. ఆయన తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభతో కలిసి ముందు వరుసలో కూర్చోవడం, విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆమె భావోద్వేగానికి గురికావడం అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ ఘటననే ధ్యాన్ తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా ప్రస్తావించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఈ కార్యక్రమంలో ధ్యాన్ మరో సరదా వ్యాఖ్య కూడా చేశాడు. విజయ్ ముఖ్యమంత్రి అయినట్లే.. తానూ రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ల తర్వాత కేరళ ముఖ్యమంత్రి అవుతానని జోక్ చేశాడు. అలాగే తన స్నేహితుడు, నటుడు అజు వర్గీస్‌ను ఈ సంభాషణలోకి లాగుతూ.. తనకి గవర్నర్ పదవి బాగుంటుందని నవ్వించాడు. వెంటనే అజు వర్గీస్ మీ అమ్మగారికి రాష్ట్రపతి పదవి దక్కుతుందని జోక్ చేశాడు.అయితే ఈ ఎపిసోడ్ ఎటు దారి తీస్తుందని అనుకున్నాడో ఏమో.. అజు వర్గీస్ వేదిక మీదకు వచ్చి "విజయ్ సార్, నా ఫ్రెండ్ కొంచెం పిచ్చోడు.. దయచేసి క్షమించండి" అంటూ వ్యాఖ్యానించాడు. ఆ మాటతో అక్కుడున్నవాళ్లంతా కడుపుబ్బా నవ్వుకున్నారు.ఎవరీ ధ్యాన్-నవ్యా?ధ్యాన్ శ్రీనివాసన్(Dhyan Sreenivasan) మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత అయిన శ్రీనివాసన్ కుమారుడు. ప్రముఖ నటుడు, దర్శకుడు, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అయిన వినీత్ శ్రీనివాసన్‌కు సోదరుడు. 2013లో వచ్చిన తీరా సినిమాతో నటుడిగా పరిచయమైన ధ్యాన్, 2013లో 'తీరా' చిత్రంతో నటుడిగా పరిచయమైన ధ్యాన్ శ్రీనివాసన్.. 'ఆది కాప్యారే కూటమణి', 'కుంజిరామాయణం', 'గూడలోచన', 'వర్షంగళ్క్కు శేషం' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా కూడా మలయాళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక.. నవ్యా నాయర్ మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటి. 'నందనం', 'ఇష్టం', 'కళ్యాణరామన్', 'పందిప్పాడ' వంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు పొందిన ఆమె, మలయాళంతో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ధ్యాన్ శ్రీనివాసన్ 2017లో అర్పితా సెబాస్టియన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నవ్యా నాయర్ 2010లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త సంతోష్ మీనన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. -
ఆ నలుగురి వల్ల ఇండస్ట్రీ వదిలేసి పోయా: మలయాళ నటి
మలయాళ ఇండస్ట్రీలోని చీకటి కోణాన్ని బహిర్గతం చేసింది హేమ కమిటీ. బలం, పలుకుబడి ఉన్నవారు ఇక్కడి ఆర్టిస్టులను బానిసల కన్నా హీనంగా చూస్తారని, మహిళా ఆర్టిస్టులను వేధింపులకు గురిచేస్తున్నారని ఓ నివేదికను బయటపెట్టింది. ఈ క్రమంలో పలువురు నటీనటులు తమకు ఎదురైన చేదు అనుభవాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నారు.వేధింపులుమాలీవుడ్పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దర్శకుడు రంజిత్, నటుడు సిద్ధిఖి.. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్టు (అమ్మ)లోని తమ పదవులకు రాజీనామా చేశారు. ఇంతలో ఓ మలయాళ నటి ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఇబ్బందులను సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. 2013లో ఓ సినిమా కోసం పనిచేస్తున్నప్పుడు ముఖేశ్, మణ్యంపిల్లరాజు, ఇడవెల బాబు, జయసూర్య నన్ను శారీరకంగా వేధించారు, దూషించారు. నేను సర్దుకుపోయి పని చేసుకుందామని ప్రయత్నించాను.ఇండస్ట్రీ వదిలేశా..కానీ ఆ వేధింపులు తారా స్థాయికి చేరుకున్నాయి. దీంతో నేను మలయాళ ఇండస్ట్రీని వదిలేయక తప్పలేదు. అక్కడినుంచి చెన్నైకి మకాం మార్చేశాను. వీళ్ల వల్ల నేను పడ్డ వేదనకు, దాని పర్యవసానాలకు నాకిప్పుడు న్యాయం కావాలి. నా పట్ల దారుణంగా ప్రవర్తించిన ఆ నలుగురిపై చర్యలు తీసుకోవాలి. వారు అడిగినదానికి ఒప్పుకోలేదని నాతో దురుసుగా ప్రవర్తించారు అని రాసుకొచ్చింది.బలవంతంగా..'క్యాలెండర్ సినిమా షూటింగ్లో మణ్యం పిల్ల రాజుకు భార్యగా నటించాను. ఒకసారి కారులో వెళ్తున్నప్పుడు ఆయన నన్ను వ్యక్తిగత ప్రశ్నలు అడిగాడు. నా భర్త చనిపోయాడని చెప్పినందుకు ఒక్కదానివి సంతోషంగా ఎలా ఉంటున్నావని ఇబ్బందికరంగా మాట్లాడాడు. జయసూర్య అయితే డె ఇంగోట్ నొక్కి(2108) సినిమా టైంలో నన్ను బలవంతంగా వెనకనుంచి హత్తుకుని ముద్దుపెట్టాడు. మరో నటుడైతే రాత్రికి వస్తానంటూ నీచంగా మాట్లాడాడు. ఇంకొకరు హోటల్ గదిలో నాపై అత్యాచారం చేయబోయాడు' అని మిను పేర్కొంది. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నటుడు కుందర జానీ కన్నుమూశారు. కేరళలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన మరణించినట్లు చిత్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మంగళవారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా.. కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల మలయాళ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ ఆయనకు నివాళులర్పించారు. (ఇది చదవండి: విక్రమ్ కొత్త సినిమా.. చిన్నా మూవీ డైరెక్టర్‌తో..) కెఎన్ బాలగోపాల్ సోషల్ మీడియాలో రాస్తూ.. "కుందర జానీ నా చిరకాల మిత్రుడు. అతను మలయాళ చిత్రసీమలో 45 ఏళ్లకు పైగా చురుకుగా ఉన్నారు. దాదాపు 500 చిత్రాలకు పైగా నటించాడు. కొల్లంలోని సాంస్కృతిక, సామాజిక వేదికల్లో నిరంతరం చురుకుగా ఉండే కుందర జానీ మృతికి నా సంతాపం తెలియజేస్తున్నా.' అని పోస్ట్ చేశారు. కాగా.. 1979లో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన కుందర జానీ మలయాళ చిత్రాలలో ప్రతినాయకుని పాత్రలు పోషించినందుకు గుర్తింపు తెచ్చుకున్నాడు. 2022లో విడుదలైన మెప్పడియాన్ ఆయన చివరి చిత్రం. అవన్ చండీయుడే మకన్, భార్గవచరితం మూన్నం ఖండం, బలరామ్ వర్సెస్ తారదాస్, తచ్చిలేదత్ చుండన్, సమంతారం, వర్ణప్పకిట్ట్, సాగరం సాక్షి, ఆనవల్ మోతిరమ్ లాంటి చిత్రాల్లో కనిపించారు. మలయాళంతో పాటు కొన్ని తమిళం, తెలుగు, కన్నడ చిత్రాలలో కూడా నటించారు. కధయిలే రాజకుమారి, నిలవుం నక్షత్రాలుమ్, సీబీఐ డైరీ అనే మలయాళ సీరియల్స్‌లో కూడా కనిపించారు. (ఇది చదవండి: అలాంటి పాత్రల్లో నటించను.. అదే నా కోరిక : మృణాల్ ఠాకూర్) -
నటుడిగా పనికిరాడన్నారు.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నాడు!
ఓ నటుడు. తండ్రి డైరెక్టర్ కావడంతో ఈజీగా ఇండస్ట్రీలోకి వచ్చేశాడు. 19 ఏళ్లకే హీరోగా తొలి సినిమా. బ్యాడ్ లక్. మూవీ ఫ్లాప్ అయింది. దీనికి తోడు అదనంగా అవమానాలు, యాక్టింగ్ రాదని ఘోరమైన విమర్శలు. దెబ్బకు భయపడిపోయాడు. వల్ల కాదు బాబోయ్ అని దేశం వదిలేసిపోయాడు. కట్ చేస్తే ఏడేళ్ల తర్వాత రీఎంట్రీ. సినిమా హిట్. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు ఏకంగా సౌత్ ఇండస్ట్రీని ఏలుతున్నాడు. అతడే ఫహాద్ ఫాజిల్. మంగళవారం అతడి పుట్టినరోజు. ఈ సందర్భంగా స్పెషల్ స్టోరీ. హీరోలా ఉండడు సినిమా హీరో అంటే ఫిట్‌గా ఉండాలి, అందంగా కనిపించాలి, అమ్మాయిలని ఆకట్టుకోవాలి.. ఇలాంటి కొలమానాలు బోలెడు. వాటన్నింటికీ ఫహాద్ ఫాజిల్ చాలా దూరం. చూడటానికి బక్కగా ఉంటాడు. బట్టతలతోనే కనిపిస్తాడు. ఓ సాదాసీదా మనిషిలా ఉంటాడు. ఇవన్నీ కాదు ఎవరికోసమే తన వ్యక్తిత్వాన్ని అస్సలు మార్చుకోడు. అందుకే ప్రేక్షకులు ఇతడిని అభిమానిస్తున్నారు, సినిమాల్ని పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తున్నారు. (ఇదీ చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) పనికిరాడన్నారు తండ్రి ఫాజిల్ దర్శకత్వంలో 19 ఏళ్లకే 'కైయెతుమ్ దూరత్' సినిమాతో ఫహాద్ హీరో అయిపోయాడు. కానీ ఇది ఫెయిలవడంతో ఫహాద్‌ని ఇష్టమొచ్చినట్లు విమర్శించారు. నటుడిగా అస్సలు పనికిరాడని అవమానించారు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు. పై చదువుల కోసం అమెరికా వెళ్లిపోయాడు. ఏడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. తనపై విమర్శలకు నటనతోనే సమాధానమిచ్చాడు. హీరోయిన్‌తో పెళ్లి రీఎంట్రీలో నటుడిగా ఫహాద్ ఫాజిల్ సక్సెస్‌లు అందుకున్నాడు. 'బెంగళూరు డేస్'లో తనకు భార్యగా నటించిన నజ్రియా నజీమ్‌ని చూసి తొలిచూపులోనే ఇష్టపడ్డాడు. లవ్ లెటర్లో ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేశాడు. నజ్రియా.. కొన్నాళ్లు చుట్టూ తిప్పించుకుని ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది జరిగిన కొన్నాళ్లకే అంటే 2014 ఆగస్టు 21న వీళ్ల పెళ్లి జరిగిపోయింది. (ఇదీ చదవండి: రజినీ కంటే ఆ హీరోయిన్‌కి డబుల్ రెమ్యునరేషన్.. ఎవరో తెలుసా?) ఓటీటీల్లోకి ధైర్యంగా లాక్డౌన్ టైంలో దాదాపు అందరూ హీరోలు షూటింగ్స్ చేయడానికే భయపడితే.. ఫహాద్ ఫాజిల్ మాత్రం వరసపెట్టి మూవీస్ చేశాడు. వాటిని ఓటీటీల్లో ధైర్యంగా రిలీజ్ చేశాడు. అలా చాలామందికి ఉపాధి కల్పించాడు. అదే టైంలో తెలుగు డబ్బింగ్ కూడా ఉండేసరికి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయాడు. 'పుష్ప'లో షెఖావత్, 'విక్రమ్'లో అమర్‌గా సూపర్ యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. ఎప్పటికప్పుడు డబ్బింగ్ సినిమాలతో మనల్ని పలకరిస్తూనే ఉన్నాడు. కళ్లు చాలు సాధారణంగా హీరోలంటే ఫైట్స్ చేయాలి, గడ్డం పెంచాలని అందరూ అంటుంటారు. ఫహాద్ ఫాజిల్ మాత్రం జస్ట్ కళ్లతోనే అద్భుతమైన యాక్టింగ్ చేసేస్తుంటాడు. అతడి సినిమాలు చూసే ఎవరిని అడిగినా ఈ విషయం చెబుతారు. అలానే హీరో అనే కాకుండా విలన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ లాంటి రోల్స్ చేయడానికి అస్సలు మొహమాటపడడు. ఇకపోతే ఫహాద్ ఫాజిల్ మరెన్నో మంచి సినిమాలు చేయాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి ఫిక్స్ !) -
సహనిర్మాతను మోసం చేసిన నటుడు!
కొచ్చి: మలయాళ నటుడు విజయ్ బాబు చిక్కుల్లో పడ్డాడు. తనపై దాడి చేశారని ఆరోపిస్తూ నిర్మాత శాండ్రా థామస్ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలమక్కరలోని తన ఆఫీస్‌లో విజయ తనపై దాడి చేశాడని శాండ్రా మంగళవారం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం శాండ్రా ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే థామస్ పెట్టిన కేసుపై విజయ్ స్పందించాడు. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ’ నేను ఎంతో నమ్మిన భాగస్వామి, ఆమె భర్త నాపై తప్పుడు కేసు నమోదు చేశారు. వారిపై దాడి చేశాననడం అవాస్తవం.’ అని ఆయన తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. శాండ్రా, విజయ్ కలిసి ఫ్రైడే ఫిల్మ్ హౌస్ అనే నిర్మాణ సంస్థను నడుపుతున్నారు. ఈ పతాకంపై దాదాపు 10 చిత్రాలను నిర్మించారు.


