breaking news
malabar showroom
-
రూ.50 వేల కోట్ల టర్నోవర్‌ను దాటిన మలబార్
హైదరాబాద్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రూ.50 వేల కోట్లను మించి రికార్డు వార్షిక టర్నోవర్ సాధించిందని సంస్థ చైర్మన్ ఎం.పి. అహమ్మద్ తెలిపారు. సోమాజిగూడ మలబార్ షోరూమ్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘గ్లోబల్ ర్యాంకింగ్ ఆఫ్ లగ్జరీ ప్రోడక్ట్స్‌లో మలబార్ గ్రూప్ 19వ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం రూ.51,218 కోట్ల వార్షిక రిటైల్ గ్లోబల్ టర్నోవర్ సాధించింది’’ అన్నారు. వ్యాపార విస్తరణకు ప్రణాళికల్లో భాగంగా దేశ, విదేశాల్లో వచ్చే ఏడాదిలో 100 కొత్త షోరూములు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తద్వారా అదనంగా 7 వేల మందికి ఉపాధి కలి్పస్తామని అహమ్మద్ పేర్కొన్నారు. -
నేడు నగరానికి రానున్న సినీనటి తమన్నా
అనంతపురం కల్చరల్: నగరంలో ఏర్పాటు చేస్తున్న మలబార్ గోల్డ్, డైమండ్స్ షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖ సినీనటి తమన్నా గురువారం నగరానికి రానున్నారు. మలబార్ ఆభరణాల 178వ షోరూమ్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా సంస్థ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న తమన్నా ఉదయం 11.00 గంటలకు విచ్చేసి షోరూమ్‌ను ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు.