breaking news
majority positions
-
పరిషత్ తీర్పు: చరిత్ర సృష్టించిన వైఎస్సార్సీపీ
-
జెడ్పీ పోటా పోటీ
నల్లగొండ, న్యూస్‌లైన్ జెడ్పీపోరు రసవత్తరంగా మారింది. చైర్మన్ స్థానాన్ని తొలిసారి ఎస్టీ జనరల్‌కు రిజర్వు చేశారు. దీంతో ఆ కేటగిరీకి చెందిన అభ్యర్థులు చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ పదవి ఎవరికి వరి స్తుందోనన్న ఆసక్తికర చర్చకొనసాగుతోంది. జిల్లాలో 59 జెడ్పీటీసీ స్థానాల్లో ఏడు స్థానాలను ఎస్టీలకు రిజర్వు చేశారు. ఇందులో ఎస్టీ మహిళకు -4, ఎస్టీ జనరల్‌కు-3 స్థానాలు కేటాయించారు. వీటితో పాటు మరో 18 స్థానాలు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. వీటిల్లో జనరల్‌కు-9, మహిళలకు 9 స్థానాలు రిజర్వు చేశారు. రిజర్వు చేసిన స్థానాలతో పాటు జనరల్ కేటగిరీల్లో 17 చోట్ల ఎస్టీ అభ్యర్థులు బరిలో ఉండటం విశేషం. కాంగ్రెస్ తరఫున చైర్మన్ అభ్యర్థి పేరును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ రేసులో మాత్రం దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ ఉన్నారు. ఆయన చందంపేట జనరల్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. చింతపల్లి ఎస్టీ జనరల్ స్థానం నుంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడు నేనావత్ బిల్యానాయక్ సతీమణి అనిత బరిలో ఉన్నారు. మెజార్టీ స్థానాలు టీడీపీ కైవసం చేసుకున్నట్లయితే చైర్మన్ రేసులో అనిత పేరు మొదటి వరుసలో ఉంటుంది.