breaking news
madana palli
-
అధ్యాపకురాలి దారుణహత్య.. కళ్లలో కారం కొట్టి, కింద పడేసి
మదనపల్లె: ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న యువతి దారుణ హత్యకు గురికావడంతో అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బండమీదకమ్మపల్లె వైఎస్సార్ కాలనీకి చెందిన రుక్సానా (35) ఎంఏ (ఇంగ్లిష్), బీఈడీ పూర్తిచేసి ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంగ్లిష్ అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. తను డిగ్రీ చదువుతున్న సమయంలోనే వివాహం చేసుకుంది. ఒక బిడ్డ పుట్టిన తర్వాత అతడితో విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ప్రస్తుతం పాప పదో తరగతి చదువుతున్నది. ఈ క్రమంలో ఏపీఎస్పీడీసీఎల్లో డ్యూటీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఎస్కే ఖదీర్ అహ్మద్‌తో 2017 ఆగస్టులో మరో వివాహం జరిగింది. కొంతకాలం అనంతరం తన తల్లి వెన్నెముక నొప్పి కిత్స నిమిత్తం రుక్సానా కూడా బెంగళూరుకు వెళ్లింది. ఈ క్రమంలో భర్త ఖదీర్‌అహ్మద్ పట్టణంలోని అవంతి థియేటర్ వద్ద ఉంటున్న ఆయిషాను గుట్టుచప్పుడు కాకుండా రెండో వివాహం చేసుకున్నాడు. ఆరోగ్య సమస్యలతో ఆమెకు పిల్లలు పుట్టలేదు. ఈలోపు రుక్సానాకు మరో ఆడపిల్ల జన్మింంది. పిల్లలు పుట్టని కారణంగా భర్త ఖదీర్‌అహ్మద్ తనకు దూరమవుతాడనే భయంతో ఆయిషా పోలీస్‌స్టేషన్‌లో తనను మోసం చేసి పెళ్లిచేసుకున్నాడంటూ ఖదీర్ అహ్మద్‌తో పాటు రుక్సానాపై టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో అయిషా తమ్ముళ్ల వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ రుక్సానా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఓ ఇద్దరు యువకులు కళాశాల పనివేళలు ముగిశాక స్కటీపై ఇంటికి వెళుతున్న రుక్సానా కళ్లలో కారం కొట్టి కిందపడేలా చేశారు. మంటతో కళ్లు నులుముకుంటున్న ఆమెను అత్యంత కిరాతకంగా గొంతుకోసి, ఛాతిపై పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచింది. డీఎస్పీ కేశప్ప ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆయిషా తమ్ముళ్లు తమ కుమార్తె రుక్సానాను దారుణంగా చంపేశారని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. భర్త ఖదీర్‌అహ్మద్ మాట్లాడుతూ.. ఆయిషా తమ్ముళ్లపై రౌడీషీటర్ కేసులు నమోదై ఉన్నాయని, వారు తాము చెప్పినట్లు వినకపోతే ఇద్దరినీ చంపేస్తామని బెదిరింనట్లు చెప్పాడు. ఈ విషయమై కోర్టులో కేసు నడుస్తున్నదని తెలిపారు. తమకు ప్రాణహాని తలపెడతారేమోనని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయాడు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు జిల్లా ఆస్పత్రికి చేరుకుని రుక్సానా మృతదేహాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. -
ట్రావెల్స్ బస్సు బోల్తా: ఒకరు మృతి
అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో గురువారం వేకువజామున జరిగిన బస్సు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఎస్ఎల్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో బోల్తాపడింది. ఈప్రమాదంలో ఒక యువతి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇరవై మంది గాయాలపాలయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.