breaking news
Machareddy Mandal
-
కామారెడ్డి: భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
సాక్షి, మాచారెడ్డి: అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్తపై చర్య తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరుతు భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. ఈ సంఘటన ఆదివారం మండలంలోని బండరామేశ్వర్‌పల్లిలో జరిగింది. కోడలి రాకను గమనించిన అత్త లక్ష్మీ, మామ నారాయణ ఇంటికి తాళం వేసి పరారైనట్లు ఆమె తెలిపింది. వివరాలు ఇలా ఉన్నాయి. బండ రామేశ్వర్పల్లికి చెందిన ఉట్ల శ్రీనివాస్‌కు కామారెడ్డి పట్టణానికి చెందిన గాయత్రి శరణ్యను రెండేళ్ల కింద ఇచ్చి వివాహం జరిపించారు. వివాహం సందర్భంగా కట్న కానుకలతో పాటు నగదు, బంగారాన్ని అందజేశారు. పెళ్లయిన మూడు నెలల నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని గాయత్రి శరణ్య ఆవేదన వ్యక్తం చేసింది. వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని తనను వదిలించుకోవాలని తనపై ఎన్నో నిందలు వేస్తున్నారని ఆరోపించింది. తనను వేధిస్తున్న భర్తపై చట్టరీత్యా చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. చదవండి: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం: ఎంత చెప్పినా వినలేదు! -
ఆడపిల్ల పుట్టిందని తండ్రి ఆత్మహత్య
ఆడపిల్ల పుట్టిందని మనస్తాపానికి గురైన ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రతి విషయానికి మానసికంగా కుంగి పోయే మల్లయ్య ఆడపిల్ల పుట్టిందనే బెంగతో ఉరి వేసుకున్నాడు. ఎస్ఐ చందర్‌రాథోడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన పల్లె మల్ల య్య (35)కు ఎనిమిదేళ్ల కొడుకు మధు ఉన్నాడు. 11 రోజుల కింద ఆడపిల్ల పుట్టింది. ఈ క్రమంలో మల్లయ్య బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి ఆడపిల్ల పుట్టింది ఎలా అంటూ విలపించాడు. శుక్రవారం రాత్రి బయటకు వెళ్లి, మండలంలోని లక్ష్మీరావులపల్లి గ్రామ శివారులో శవమై కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.