breaking news
lungis
-
ఖండాంతరాలకు.. కడలుంగీలు
ప్రాంతానికో ప్రత్యేకత, ఊరికో వైవిధ్యం, ప్రతి దాని వెనకా ఓచరిత్ర.. అలాంటివెన్నో రఘునాథపురం, పుట్టపాక ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చాయి. ఇక్కడి చేనేత, పవర్లూమ్ కార్మికుల చేతిలో రూపుదిద్దుకున్న వస్త్రాలు ఎంతోమంది ప్రముఖులను ఆ‘కట్టు’కున్నాయి. జిల్లా కీర్తిని నలుదిశలా ఇనుమడింపజేస్తున్నాయి. రఘునాథపురం కడలుంగీలు, పుట్టపాక తేలియా రూమాల్, దుబీయన్ వస్త్రాలు నేతన్నల కళాప్రతిభకు నిదర్శనాలుయాదాద్రి భువనగిరి జిల్లా : రాజాపేట మండలంలోని రఘునాథపురం అనగానే మదిలో మెదిలేది పవర్లూమ్(మరమగ్గం) పరిశ్రమ. వీటిపై తయారైన కడలుంగీలు జిల్లా పేరును దేశ, విదేశాలకు తీసుకెళ్లాయి. ఇంత ఖ్యాతి తెచ్చిపెట్టిన ఘనత ఇక్కడి కార్మికులకే దక్కుతుంది. అర్ధ శతాబ్దానికి పైగా కడలుంగీలు ఇక్కడ రూపుదిద్దుకుంటున్నాయి. గ్రామంలో 800 వరకు పవర్‌లూమ్స్ ఉండగా అందులో 400 మరమగ్గాలపై కడలుంగీలు తయారు చేస్తున్నారు. ఒక మరమగ్గంపై పది చొప్పున రోజుకు 3వేల వరకు కడలుంగీలు ఉత్పత్తి అవుతాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి మందికి పైగా జీవనోపాధి పొందుతున్నారు. పుట్టపాక ప్రత్యేకత.. దుబీయన్ వస్త్రం సంస్థాన్‌నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామ చేనేత కళాకారులు రూపొందించిన వస్త్రాలను ఫ్రాన్స్, సింగపూర్, అమెరికా, జర్మనీ, జపాన్, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశ ప్రథమ పౌరురాలు బ్రిగిట్టే మెక్రాన్‌కు పుట్టపాక చేనేత కళాకారులు నేసిన దుబీయన్ సిల్క్ చీరను చందనం పెట్టెలో పెట్టి బహూకరించారు. చీరను చూసిన బ్రిగిట్టే మెక్రాన్ పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యంపై అప్పట్లో ప్రశంసలు కురిపించారు. లండన్ మ్యూజియం, అమెరికా అధ్యక్షుని భవనంతో పాటు ముఖ్య కార్యక్రమాల్లో, విదేశాల్లోని ప్రముఖ మహిళలు పుట్టపాకలో తయారైన వస్త్రాలను ధరిస్తుంటారు.తొలినాళ్లలో షేర్‌గోలా వస్త్రాల తయారీకి ప్రసిద్ధి రఘునాథపురంలో పవర్లూమ్ పరిశ్రమ స్థాపించిన తొలినాళ్లలో షేర్‌గోలా వస్త్రాలను ప్రసిద్ధి. ఈ వస్త్రాలను హైదరాబాద్‌లోని రిక్షా కార్మికులు ఎక్కువగా ఉపయోగించేవారు. క్రమేణా హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ముంబయికి షేర్‌గోల వస్త్రాలు ఎగుమతి అయ్యేవి. కాలానుగుణంగా నక్కీ, జననీలు, అక్రాలిక్, ఎల్లో ట్రైప్, రీడ్ బైపిక్ వంటి రకరకాల కడలుంగీలను తయారు చేస్తున్నారు. రఘునాథపురానికి చెందిన కొందరు మాస్టర్ వీవర్స్ హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి కేంద్రాలుగా దుబాయ్, సౌదీ అరేబియా, ఒమన్ తదితర అరబ్ దేశాలతో పాటు ఆఫ్రికాలోని ఉగాండాకు ఎగుమతి చేస్తున్నారు. ఈ దేశాల్లో కడలుంగీలను పురుషులు లుంగీలుగా ఉపయోగిస్తే, మహిళలు డ్రెస్ మెటీరియల్‌గా వినియోగిస్తుంటారు. -
సారూన్.. ఇదో లుంగీ కథ
- వేసవిలో చల్లగా.. శీతాకాలంలో వెచ్చగా.. అంతా ఎంతో హాయిగా.. - ఇదేదో ఏసీ యూనిట్ గురించి కబుర్లు కావు.. - ఇండోనేసియా లుంగీల కథా కమామీషు! చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్ దాటి కాస్త ముందుకెళ్లగానే పురుషుల వస్త్రధారణలో ప్రత్యేక తేడా కనిపిస్తుంది. ఇది మిగతా ప్రాంతాలకు చాలా భిన్నంగా ఉంటుంది. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా అందరూ లుంగీలు ధరించి కనిపిస్తారు. వస్త్రధారణలో లుంగీ మనకు కొత్తేమీ కాదు. కానీ అక్కడివారు ధరించే లుంగీ మాత్రం కచ్చితంగా భిన్నమైందే. ప్రత్యేకంగా ఇస్లామిక్ దేశం ఇండోనేసియాలో తయారైన ఉన్నతశ్రేణి లుంగీలు మాత్రమే ధరించటం వారి ప్రత్యేకత. యెమన్ నుంచి.. కుతుబ్‌షాహీలు తమ సంస్థానంలో పోలీసు వ్యవస్థ, జమా పద్దుల నిర్వహణకు అరబ్ దేశాల నుంచి నిపుణుల్ని రప్పించారు. అలా యెమన్ దేశీయులు హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఆ తర్వాత అసఫ్‌జాహీల హయాం వచ్చాక కూడా వీరికి ప్రాధాన్యం పెరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యెమన్ జాతీయులకు బార్కస్, సలాలా ప్రాంతాలను కేటాయించారు. నేటికి ఈ ప్రాంతాలు యెమన్ వంశస్తులతో నిండిపోయి కనిపిస్తాయి. వీరికి ప్రత్యేక వస్త్రంతో తయారు చేసిన లుంగీలు ధరించటం ఆనవాయితీ. ఆ సంప్రదాయాన్నే వారు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇండోనేసియా నుంచే దిగుమతి.. యెమన్లు ఇండోనేసియాలో తయారైన లుంగీలనే వినియోగిస్తారు. వాటిని వారు ‘సారూన్’ అని, ‘తైబన్’ అని పిలుచుకుంటారు. ఈ లుంగీ నాణ్యత ఉన్నత శ్రేణిలో ఉంటుంది. వస్త్రం చాలా మృదువుగా ఉండి వేసవి కాలంలో చల్లని, శీతాకాలంలో వెచ్చని అనుభూతి నిస్తుంది. ఇండోనేసియాలో ప్రత్యేక శ్రద్ధతో వీటిని తయారు చేస్తారు. యెమన్ ప్రాంతానికి ఈ లుంగీలే ఎగుమతి అవుతాయి. బార్కస్‌లో స్థిరపడ్డ వీరి పూర్వీకులు యెమన్ దేశీయులు అయినందున వీరు కూడా ఆ పద్ధతినే అనుసరిస్తున్నారు. పన్నెండేళ్ల పిల్లలు మొదలు వృద్ధుల వరకు అందరూ ఈ లుంగీలను ధరించే తిరుగుతుంటారు. బార్కస్ ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ ఇండోనేసియా లుంగీలమ్మే దుకాణాలు వెలిశాయి. ఇక సిటీలో ఎక్కడా ఈ లుంగీలు దొరకవు. ఈ లుంగీల ధర కూడా ఎక్కువే. సాధారణ లుంగీ రూ.750 ధర పలుకుతోంది. మరింత మంచివైతే రూ.2,000-3,000 వరకు ఉంటోంది. ఒక్కో లుంగీ కనీసం నాలుగేళ్లవరకు పాడవకుండా ఉంటుందని స్థానికులంటున్నారు. ..::గౌరీభట్ల నరసింహమూర్తి


