breaking news
lungarhouse
-
షాకింగ్: హైదరాబాద్‌లో నడిరోడ్డుపై..
-
షాకింగ్: హైదరాబాద్‌లో నడిరోడ్డుపై..
హైదరాబాద్: అది నగరంలోని లంగర్‌హౌజ్ ప్రాంతం. ఇంద్రారెడ్డి ఫ్లైవర్ డౌన్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడు. ఫ్లైఓవర్ దిగుతున్న ఒక్కో వాహనాన్ని నిశితంగా గమనిస్తూ.. కొంచెం తులుతూ ముందుకు కదులుతున్నాడు. ఇంతలో ఓ కారు వేగంగా రావడాన్ని గమనించాడు. లుంగీ కట్టుకున్న ఆ వ్యక్తి అంతే వేగంగా పరిగెత్తుకొని వచ్చి.. ఆ కారు ఎదురుగా రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడు. అంతే.. వాహనం ముందు టైర్లు అతనిపై నుంచి వెళ్లాయి. షాక్ తిన్న వాహన యజమాని గాబరా పడుతూ అతన్ని చూశాడు. ఈ ఘటన ఈ నెల 14న సాయంత్రం లంగర్‌హౌజ్ పరిధిలో జరిగింది. ఓ వ్యక్తి నడిరోడ్డుపై ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇంద్రారెడ్డి ఫ్లై ఓవర్ దిగుతున్న వాహనాలను నిశితంగా గమనిస్తూ వేగంగా వస్తున్న ఆ కారు కింద తనకు తాను పడిపోయాడు. గాబరా పడిన కారు డ్రైవర్ వాహనాన్ని ఆపేలోపే ముందు టైర్లు అతనిపై నుంచి దూసుకుపోయాయి. దీంతో తీవ్ర గాయాలైన అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు విడిచాడు. ఇంతకు అతను ఎవరు? ఎందుకు నడిరోడ్డుపై ఆత్మహత్యకు ప్రయత్నించాడన్న విషయాలు ఇంకా తెలియరాలేదు.