ఏపీలో 3.67 కోట్ల మంది ఓటర్లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఓటర్ల ముసాయిదా జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటించింది. మొత్తం 3,67,04,801 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,82,38,197 మంది, మహిళలు 1,84,63,496 మంది. రాష్ట్రంలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో 3,108 మంది హిజ్రా ఓటర్లున్నారు.
వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే వారిని ఓటర్లుగా నమోదు చేసే కార్యక్రమం ఈనెల 13న ప్రారంభమైంది. డిసెంబర్ 8వ తేదీవరకు నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. ముసాయిదా జాబితాలో పొరపాట్లున్నా, అర్హులైన వారి పేర్లు లేకపోయినా డిసెంబర్ 8 వరకు సవరణలతో పాటు పేర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది.