breaking news
Lisence fees
-
అమెరికా షాకింగ్ డెసిషన్: భారత డ్రైవర్లపై భారీ వేటు!
ఇండియానా: అమెరికాలో ట్రక్కు డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకుని స్థిరపడిన వేలాది మంది భారతీయులకు, ముఖ్యంగా పంజాబీ సిక్కులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇండియానా రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన కొత్త చట్టం కారణంగా భారీ సంఖ్యలో కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు (సీడీఎల్) రద్దయ్యాయి. 2026, ఏప్రిల్ ఒకటి నుంచి ఈ నిర్ణయం అమలులోకి రావడంతో వందలాది మంది భారతీయుల ఉపాధి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.ఏమిటీ కొత్త చట్టం?ఇండియానా బ్యూరో ఆఫ్ మోటార్ వెహికల్స్ (బీఎంవీ) ‘హౌస్ ఎన్రోల్డ్ యాక్ట్ 1200’ ప్రకారం మొత్తం 1,790 నాన్-డొమిసైల్డ్ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేసింది. గతంలో చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్ (ఈఏడీ) ఉన్న విదేశీయులకు ఈ లైసెన్సులు ఇచ్చేవారు. అయితే తాజా మార్పుల ప్రకారం కేవలం మూడు రకాల వీసా కేటగిరీలకు (H-2A - వ్యవసాయ కార్మికులు, H-2B - తాత్కాలిక కార్మికులు, E-2 - ఇన్వెస్టర్లు) మాత్రమే ఈ లైసెన్సులు పొందే అర్హత ఉంటుంది. మిగిలిన వీసాలపై ఉన్న డ్రైవర్లందరినీ అనర్హులుగా ప్రకటిస్తూ, మార్చి 16నే నోటీసులు జారీ చేశారు.ఎందుకు ఈ కఠిన నిర్ణయం?ఇటీవల కాలంలో నాన్-డొమిసైల్డ్ డ్రైవర్ల వల్ల జరిగిన ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ చర్యలు చేపట్టారు. డ్రైవింగ్ రికార్డుల పరిశీలన, ఆంగ్ల భాషా ప్రావీణ్యం, సరైన శిక్షణ వంటి అంశాల్లో ఎక్కడా రాజీ పడకూడదని ఫెడరల్ మోటార్ క్యారియర్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ చట్టాన్ని రూపొందించారు.భారతీయులపై ప్రభావంఅమెరికాలో లాంగ్-హాల్ ట్రక్కు రవాణా రంగంలో భారతీయ సంతతికి చెందిన వారు, ముఖ్యంగా పంజాబీ కమ్యూనిటీ కీలక పాత్ర పోషిస్తోంది. తాజా రద్దుతో చాలా మంది డ్రైవర్లు తమ స్థాయిని కోల్పోయి, కేవలం సాధారణ డ్రైవింగ్ లైసెన్సులకే (Regular DL) పరిమితం కావాల్సి వస్తుంది. ఇప్పటికే కాలిఫోర్నియా వంటి రాష్ట్రాలు వేల సంఖ్యలో లైసెన్సులను రద్దు చేయగా, ఇప్పుడు ఇండియానా తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా సరఫరా గొలుసు (Supply Chain)పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: గుండె గుభేల్: యుద్ధం మరో 20 రోజులు? -
లక్కెవరిదో..!
ఆదిలాబాద్ : జిల్లాలో మద్యం ప్రక్రియ మొదలైంది. 2014-15 వార్షిక సంవత్సరం కోసం మద్యం దుకాణాలు కేటాయించేందుకు జిల్లా గెజిట్ జారీ చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల ఎక్సైజ్ యూనిట్ల పరిధిలో 174 షాపులకు ఆసక్తి గల వ్యాపారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. సోమవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. రెండు యూనిట్ల పరిధిలోని షాపులకు ఆదిలాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొదటిరోజు దరఖాస్తులు రాలేదు. ఈ నెల 21 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 23న జిల్లా కేంద్రంలోని జనార్దన్‌రెడ్డి గార్డెన్స్‌లో లాటరీ ద్వారా డ్రా తీసి మద్యం దుకాణాలు కేటాయిస్తారు. మూడు స్లాబ్‌లు జిల్లాలో మూడు స్లాబుల విధానంలో లెసైన్స్ ఫీజును నిర్ధారించారు. 10 వేల జనాభా ఉన్న చోట రూ.32.50 లక్షలు,10 వేల నుంచి 50 వేల జనాభా ఉన్నచోట రూ.34 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షల జనాభా ఉన్న చోట రూ. 42 లక్షలు ఫీజు నిర్ధారించారు. దరఖాస్తుదారుడు రూ.25 వేల విలువ గల నాన్ రిఫండెబుల్ చలాన్, లెసైన్స్ ఫీజుపైన 1/3 శాతం ధరావత్తు (ఈఎండీ) డీడీ తీయాలి. అదేవిధంగా ఫామ్ ఏ1, ఏ2, ఏ3, ఏ4 లను నింపాలి. పూర్తి చేసిన దరఖాస్తులకు చలాన్, డీడీ, రెండు కలర్ పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను జత చేసి టెండర్ బాక్సులో వేయాలి. ఏదైన జాతీయ బ్యాంకులో మాత్రమే డీడీ తీయాలి. 21 సంవత్సరాలకు లోబడి ఉన్న వ్యక్తులు అనర్హులు. మంచిర్యాల పరిధిలో 104 షాపులు, ఆదిలాబాద్ పరిధిలో 70 షాపులకు సంబంధించి జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలోనే ఏర్పాటు చేసిన టెండర్ బాక్సుల్లో దరఖాస్తులను వేయాలి. ఒక షాపుకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయో అన్ని టోకెన్లను ఒకదాంట్లో ఉంచి అందులో నుంచి ఒక టోకెన్‌ను తీయడం జరుగుతుంది. టోకెన్‌లోని నంబర్ ఆధారంగా లక్కీ విజేత ఎవరన్నది ప్రకటిస్తారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ రోజు లాటరీ డ్రా నిర్వహించడం జరుగుతుంది. పరాజితులకు ధరావత్తును తిరిగి ఇస్తారు. ఇతర జిల్లాలకు 33 షాపులు తరలింపు జిల్లాలో 207 మద్యం షాపులు ఉండగా గతేడాది నిర్వహించిన టెండర్లలో 33 షాపులకు అసలు దరఖాస్తులే రాలేదు. 11 సార్లు ఆ షాపులకు రీటెండర్లు నిర్వహించినప్పటికీ వ్యాపారులు ఎవరు ముందుకు రాలేదు. ఆయా ప్రాంతాల్లో లాభసాటిగా లేదని, ఇతర కారణాలతో అక్కడ టెండర్లకు వ్యాపారులు వెనుకంజ వేశారు. ఈ నేపథ్యంలో ఆ 33 షాపులను డిమాండ్ ఉన్న ఇతర జిల్లాలకు తరలించినట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. కాగా క్యాతన్పెల్లిలోని రెండు దుకాణాలను ఆదిలాబాద్ పట్టణానికి తరలించారు. మంచిర్యాల యూనిట్ పరిధిలోని మరో రెండు షాపుల్లో ఒకటి నిర్మల్, మరొకటి ఖానాపూర్‌కు తరలించారు. ఆదిలాబాద్ పట్టణంలో ఇదివరకు 5 వైన్స్‌లు ఉండగా, తాజాగా టెండర్లలో ఈ సంఖ్య ఏడుకు పెరిగింది.


