breaking news
on line
-
సొంతంగా షేర్ల బదిలీ
బ్రోకర్ దగ్గర షేర్లు విక్రయిస్తే, ఆటోమేటిగ్గా అవి డీమ్యాట్ ఖాతా నుంచి డెబిట్ అవుతాయి. ఇందుకు ఖాతాను ప్రారంభించే సమయంలోనే అనుమతి (పవర్ ఆఫ్ అటార్నీ) తీసుకునే విధానం అమల్లో ఉంది. అయితే, కొన్ని సందర్భాల్లో బ్రోకర్ దగ్గర ఖాతా ద్వారా కాకుండా ఆఫ్‌లైన్‌లో షేర్లను విక్రయించుకోవడం లేదంటే కుటుంబ సభ్యులకు బహుమతిగా షేర్లను బదిలీ చేయాల్సి రావచ్చు. మరి అటువంటప్పుడు స్వయంగా ఎవరికి వారు ఆ బదిలీ బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుంది. దీని గురించి ఎక్కువ మందికి దాదాపుగా తెలియదు. ఒక డీమ్యాట్ ఖాతా నుంచి మరొక డీమ్యాట్ ఖాతాకు షేర్లను బదిలీ చేయడానికి ఆఫ్‌లైన్, ఆన్లైన్ మార్గాలున్నాయి. ఇవి ఎలా పనిచేస్తాయో అవగాహన కల్పించే ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం ఇది... ఇదంతా డిజిటల్ యుగం. దాదాపు బ్యాంకు సేవలు, బ్రోకింగ్ సేవలను ఆన్లైన్లోనే చేసుకుంటున్నాం. అయినా కానీ, రెండు డీమ్యాట్ ఖాతాల మధ్య షేర్లను బదిలీ చేసేందుకు ఇప్పటికీ ఆఫ్‌లైన్ విధానాన్నే ఎక్కువ మంది ఆశ్రయిస్తున్నారు. నూతనతరం బ్రోకర్లు (డిపాజిటరీ పార్టిసిపెంట్) అయిన జెరోదా, ఏంజెల్ వన్ తదితర కొన్ని సంస్థలు ఆన్లైన్లోనే షేర్లను సులభంగా బదిలీ చేసుకునే సేవలను అందిస్తున్నాయి. ఆన్లైన్లో షేర్ల బదిలీని రెండు విధాలుగా చేపట్టొచ్చు. డీమ్యాట్ ఖాతా ద్వారా లేదంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్ఎల్) ఈజీఎస్ట్ కోసం నమోదు చేసుకుని ఆన్లైన్లో షేర్లను బదిలీ చేసుకోవచ్చు. ఈజీఎస్ట్అనేది సెక్యూరిటీల సమాచారం తెలుసుకునేందుకు, లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఉద్దేశించినది. అలాగని అన్ని బ్రోకరేజీ సంస్థలు ఆన్లైన్లో బదిలీ సేవలను అందించడం లేదు. చాలా డీపీలు, బ్యాంకులకు సంబంధించిన బ్రోకింగ్ విభాగాల్లో ఖాతా ఉన్న వారు ఆఫ్‌లైన్ (భౌతిక రూపంలో) విధానంలో చేసుకోవాల్సి వస్తుంది. ఆఫ్‌లైన్ మార్గం.. ఆఫ్‌లైన్‌లో అయితే ఫిజికల్ డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్ (డీఐఎస్) బుక్లెట్ ఉండాలి. షేర్లను బదిలీ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ బుక్‌లెట్‌లోని ఓ స్లిప్పై బదిలీ చేయాలనుకుంటున్న కంపెనీ, ఐఎస్ఐఎన్ నంబర్, ఎన్ని షేర్లు తదితర వివరాలు నమోదు చేయాలి. ఏ డీపీ పరిధిలోని క్లయింట్‌కు బదిలీ చేయాలనుకుంటున్నారో, ఆ వివరాలు కూడా ఇవ్వాలి. అంటే క్లయింట్ ఐడీ, డీపీ ఐడీ వివరాలు నమోదు చేయాలి. ఐఎస్ఐఎన్ అన్నది ప్రతీ కంపెనీకి కేటాయించే ఓ యూనిక్ నంబర్. గూగుల్‌లో సెర్చ్ చేసినా ఈ నంబర్ తెలుస్తుంది. షేర్లను స్వీకరించే క్లయింట్ సీఎంఆర్ కాపీ జత చేయాలి. డీఐఎస్ అన్నది బ్యాంక్ చెక్ మాదిరిగా పనిచేస్తుంది. ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్‌కు నగదు బదిలీకి చెక్ ఉపయోగపడినట్టే.. డీఐఎస్ అన్నది ఒక డీమ్యాట్ ఖాతా నుంచి మరొక డీమ్యాట్ ఖాతాకు షేర్లను బదిలీ చేసే సాధనం. ఆఫ్‌లైన్‌లో ఇలా షేర్ల బదిలీకి కొన్ని రోజుల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో, కొందరు బ్రోకర్ల వద్ద ఇందుకు నెల వరకు సమయం తీసుకోవచ్చు. బ్రోకర్ మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ నుంచి లేదంటే బ్రోకర్‌కు ఈ మెయిల్ రూపంలో, బ్రోకర్ ఆఫీసుకు వెళ్లి డీఐఎస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకులకు సంబంధించిన డీమ్యాట్ ఖాతా కలిగి ఉన్న వారు నెట్ బ్యాంకింగ్ నుంచి లేదంటే బ్యాంకు శాఖకు వెళ్లి దీనికి దరఖాస్తు సమర్పించొచ్చు. రిజిస్టర్డ్ చిరునామాకు డీఐఎస్ బుక్లెట్ వస్తుంది. లేదా బ్రోకర్ ఆఫీసుకు వెళ్లి తీసుకోవచ్చు. బదిలీ చేయాలనుకున్నప్పుడు డీఐఎస్ స్లిప్‌లో అన్ని వివరాలు నమోదు చేసి, సీఎంఆర్ కాపీ జతచేసి బ్రోకర్ ఆఫీసులో సమర్పించాలి. లేదంటే కార్యాలయానికి పంపించాలి. బ్యాంకులు అయితే కేవలం కొన్ని శాఖల్లోనే ఈ సేవలు లభిస్తాయి. ఆన్లైన్లో షేర్ల బదిలీ ఆన్లైన్లో షేర్ల బదిలీకి రెండు విధానాలున్నాయి. ఒకటి డీమ్యాట్ ఖాతా ద్వారా చేసుకోవచ్చు. అలాగే, సీడీఎస్ఎల్ లేదా ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్ ద్వారా బదిలీ చేసుకోవచ్చు. కొన్ని బ్రోకరేజీ సంస్థలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సేవను అందిస్తున్నాయి. కానీ, భద్రత రీత్యా ఈ ప్రక్రియ కొంత ఆన్లైన్, కొంత ఆఫ్‌లైన్‌తో కూడుకుని ఉంటుంది. ఉదాహరణకు ఐసీఐసీఐ డైరెక్ట్ ఈ ఇన్స్ట్రక్షన్ అన్నది కనీసం ఒక అకౌంట్ హోల్డర్ వ్యక్తిగతంగా దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఆమోదం పొందితే, ఏ డీమ్యాట్ ఖాతాకు అయినా ఆన్లైన్లోనే షేర్లను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాకపోతే గరిష్టంగా ఐదు ఖాతాల వరకు ఆన్లైన్లో, అది కూడా నిర్ణీత విలువ మేరకే బదిలీకి అనుమతి ఉందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. సీడీఎస్‌ఎల్‌లో అకౌంట్ ఉండి, బదిలీ చేయాలనుకుంటున్న ఖాతా కూడా సీడీఎస్ఎల్ పరిధిలోనే ఉన్నట్టయితే బదిలీ ప్రక్రియ మరింత సులభంగా ఉంటుంది. ఇందుకోసం సీడీఎస్ఎల్ ఈజీఎస్ట్ వద్ద ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అలాగే, ఎన్ఎస్డీఎల్ పరిధిలోనే రెండు ఖాతాల మధ్య బదిలీకి ఎన్ఎస్డీఎల్ స్పీడ్–ఈ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సీడీఎస్ఎల్ పరిధిలో జాయింట్ అకౌంట్ ఉంటే, ఖాతాను నిర్వహించే వ్యక్తికి అనుకూలంగా మిగిలిన జాయింట్ అకౌంట్ హోల్డర్స్ నుంచి డిక్లరేషన్‌తో భౌతికంగా దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ ముగిసి, బ్రోకర్ నుంచి అమోదం లభించిన తర్వాత సీడీఎస్ఎల్ లేదా ఎన్ఎస్డీఎల్ పరిధిలో ఏ ఖాతాకు అయినా షేర్లను బదిలీ చేసుకోవడం సాధ్యపడుతుంది. సీడీఎస్ఎల్ లేదా ఎన్ఎస్డీఎల్ పరిధిలోని రెండు ఖాతాల మధ్య ఆన్లైన్లో షేర్ల బదిలీ చాలా సులభం. కాకపోతే సీడీఎస్ఎల్ – ఎన్ఎస్డీఎల్ పరిధిలోని ఖాతాల మధ్య బదిలీ చేసుకోవాలంటే ఓటీపీ వంటి అదనపు భద్రతా రక్షణలు అమల్లో ఉన్నాయి. మోసపూరిత లావాదేవీలకు చెక్ పెట్టేందుకు వీటిని ఏర్పాటు చేశారు. అదనపు సమయం కూడా తీసుకుంటుంది. సొంత ఖాతాల మధ్య.. తన పేరిటే మరో ఖాతాకు షేర్లను బదిలీ చేయాలనుకుంటే అందుకు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది క్లోజర్ కమ్ ట్రాన్స్ఫర్. అంటే ఒక డీపీ వద్ద డీమ్యాట్ ఖాతాను మూసేసి, మరో డీపి వద్ద ఖాతా ప్రారంభించడం. అలాంటప్పుడు క్లోజర్ కమ్ ట్రాన్స్ఫర్ విధానం అనుసరించాలి. ముందుగా మరో బ్రోకర్ వద్ద ఖాతాను తెరవాలి. అప్పుడు మూసి వేయాలని అనుకుంటున్న బ్రోకర్‌కు దరఖాస్తు ఇవ్వాలి. దాంతో అందులో ఉన్న అన్ని సెక్యూరిటీలను అదే క్లయింట్ వేరొక ఖాతాకు బదిలీ చేసిన తర్వాత, క్లోజ్ చేస్తారు. ఇందుకు ఎలాంటి చార్జీలు ఉండవు. ఒక బ్రోకర్ సేవలు నచ్చనప్పుడు, న్యూఏజ్ బ్రోకర్‌కు మారిపోవాలని అనుకున్నప్పుడు ఈ మార్గాన్ని అనుసరించొచ్చు. ఈ ప్రక్రియను భౌతికంగా చేసుకోవాల్సిందే. మరో విధానం పాక్షిక బదిలీ. అంటే అప్పటికే ఉన్న ఒక డీమ్యాట్ ఖాతాను కొనసాగిస్తూ, అందులోని షేర్లను మరో సొంత ఖాతాకు బదిలీ చేసుకోవడం ఈ విధానంలో ముఖ్యాంశం. వ్యయాలు, పన్నులు ఒక డీమ్యాట్ ఖాతాను మూసివేస్తూ, అందులోని షేర్లను అదే వ్యక్తికి సంబంధించి వేరొక డీపీ పరిధిలోని ఖాతాకు బదిలీ చేసేట్టు అయితే ఎలాంటి చార్జీల్లేవు. ఖాతా మూసివేయకుండా, వాటిని వేరొక ఖాతాకు బదిలీ చేసేట్టు అయితే షేర్ల విలువలో నిర్ణీత శాతం లేదంటే రూ.15–25 (స్క్రిప్ వారీ) ఫ్లాట్ చార్జీ పడుతుంది. ఒకవేళ ఆఫ్ మార్కెట్ విక్రయం ద్వారా బదిలీ చేస్తున్నట్టు అయితే స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించాల్సి రావచ్చు. ఇలా షేర్లను బదిలీ చేస్తున్న వారు ధరసహా పలు వివరాలను నమోదు చేసుకోవాలి. ఎందుకంటే మూలధన లాభాల పన్నును చెల్లించేందుకు ఈ వివరాలు ప్రామాణికం అవుతాయి. భవిష్యత్తులో ఇలాంటి ఆఫ్ మార్కెట్ (స్టాక్ ఎక్సే్ఛంజ్లతో సంబంధం లేకుండా) లావాదేవీలపై ఏదైనా పన్ను వివాదం తలెత్తినప్పుడు ఈ రికార్డులు అవసరంపడతాయి. ఒక వ్యక్తి ఒక డీపీ పరిధిలోని ఖాతా నుంచి వేరొక డీపీ పరిధిలోని ఖాతాకు షేర్లను బదిలీ చేసుకున్నప్పుడు కొందరు బ్రోకర్లు ఈ వివరాలను రికార్డు చేస్తున్నారు. అటువంటప్పుడు దీర్ఘకాల మూలధన లాభం, స్వల్పకాల మూలధన లాభం పన్ను వివరాలు సులభంగా పొందొచ్చు. కొందరు బ్రోకర్ల పరిధిలో ఈ వివరాలు నమోదవడంలేదు. కనుక ఎంత కాలం పాటు సదరు సెక్యూరిటీని కలిగి ఉన్నామనే వివరాల కోసం పాత ఖాతాకు సంబంధించి (కొనసా గిస్తున్నా లేదా మూసివేస్తున్నా కానీ) అకౌంట్ స్టేట్మెంట్ జాగ్రత్త చేసి పెట్టుకోవాలి. జెరోదా వంటి కొందరు బ్రోకర్లు ఆఫ్‌లైన్‌లో బదిలీ ద్వారా డీమ్యాట్ ఖాతాలోకి కొత్తగా సెక్యూరిటీలు వచ్చి చేరినప్పుడు.. మాన్యువల్‌గా వాటిని కొనుగోలు చేసిన తేదీ, ధర వివరాలు నమోదు చేసే ఆప్షన్ ఇస్తున్నాయి. ఒక వ్యక్తి వేరొక వ్యక్తికి షేర్లను బదిలీ చేస్తున్నట్టు అయితే ఆ లావాదేవీ పన్ను పరిధిలోకి వస్తుంది. ఒకే కుటుంబం పరిధిలోని వేరొక సభ్యుడికి బదిలీ చేస్తే పన్ను లేదు. వేర్వేరు కుటుంబాల వారి మధ్య బదిలీ (ఆర్థిక సంవత్సరంలో రూ.50వేలకు మించినప్పుడు) గిఫ్ట్ ట్యాక్స్ పడుతుంది. సీడీఎస్ఎల్ పరిధిలో ఆన్లైన్ బదిలీకి... ► సీడీఎస్ఎల్ పరిధిలో డీమ్యాట్ అకౌంట్ ఉన్న వారు సీడీఎస్ఎల్ ఈజీఎస్ట్ పేజీకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. ► డీపీ ఐడీ, క్లయింట్ ఐడీ నమోదు చేసి సబ్మిట్ కొట్టాలి. ► అప్పుడు మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని అక్కడ ఇవ్వాలి. ► యూజర్ నేమ్, టైప్ ఆఫ్ అకౌంట్ సెలక్ట్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ► ట్రస్టెడ్ అకౌంట్ల వివరాలు ఇవ్వాలి. ► ట్రస్టెడ్ అకౌంట్ కింద 4 సీడీఎస్ఎల్ ఖాతాల వరకు వివరాలు నమోదు చేసుకోవచ్చు. ► అకౌంట్ ఆఫ్ చాయిస్ కింద సీడీఎస్ఎల్, ఎన్ఎస్డీఎల్ ఖాతాలకు బదిలీ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ బదిలీ విధానం ► బ్రోకర్ నుంచి డీఐఎస్ బుక్లెట్ తీసుకోవాలి. ► బదిలీ చేయాలనుకుంటే డీఐఎస్ స్లిప్పై అన్ని వివరాలు నమోదు చేయాలి. ► మీ నుంచి షేర్లను పొందే డీమ్యాట్ ఖాతాకు సంబంధించి క్లయింట్ మాస్టర్ రిపోర్ట్ (సీఎంఆర్) కాపీని తెప్పించుకోవాలి. ► అప్పుడు డీఐఎస్ స్లిప్‌తోపాటు, సీఎంఆర్ కాపీని బ్రోకర్‌కు సమర్పించాలి. ► బ్రోకర్ అన్ని వివరాలను వెరిఫై చేసి బదిలీ ప్రక్రియ పూర్తి చేస్తారు. ► ఏ విధానంలో అయినా షేర్లు మీ ఖాతా నుంచి బదిలీ, జమ అయిన సమయంలో సీడీఎస్ఎల్ లేదా ఎన్ఎస్డీఎల్ నుంచి ఎస్ఎంఎస్ వస్తుంది. -
పిల్లలకు వాటిని దూరం చేయండి.. లేదంటే రాత్రి నిద్రపోయే ముందు పడకపై..
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్... ఆధునిక యుగంలో మనుషుల శరీరంలో ఒక అవయవంగా మారిపోయిందనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. కోవిడ్–19 మహమ్మారి రంగప్రవేశం చేశాక స్మార్ట్ఫోన్ల బెడద మరింత పెరిగింది. ఆన్లైన్ క్లాసుల పేరుతో పిల్లలు సైతం ఈ ఫోన్లకు అలవాటుపడ్డారు. ఎంతగా అంటే.. మన దేశంలో 23.8 శాతం మంది పిల్లలు పడుకునే ముందు పడకపై ఫోన్ ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ఫోన్లు ఉపయోగిస్తున్న చిన్నారుల్లో 37.15 శాతం మందిలో ఏకాగ్రత స్థాయిలు తగ్గిపోతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బుధవారం లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చేపట్టిన అధ్యయనాన్ని బట్టి చూస్తే.. భారత్‌లో 23.80 శాతం మంది రాత్రిపూట నిద్రపోయే ముందు పడకపై స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. 37.15 శాతం మంది చిన్నారుల్లో స్మార్ట్‌ఫోన్ వాడకంవల్ల ఎల్లప్పుడూ లేదా తరచుగా ఏకాగ్రతా స్థాయిలు తగ్గుతున్నాయి. -
మళ్లీ ఆన్లైన్ ‘థర్డ్’.. డిగ్రీ చదువులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు కాలేజీలు మొదలవ్వబోతున్నాయి. ఇప్పటికే కొత్త విద్యార్థులకు పరిచయ కార్యక్రమా లు ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఆనందం ఎంతోకాలం నిలబడేట్టు కన్పించడం లేదు. కరోనా వేరియంట్ ఒమిక్రాన్ నీలినీడల నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి తిరిగి ఆన్లైన్ బోధన ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ దిశగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగా మంగళవారం రాష్ట్రం లోని అన్ని విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో సమావేశం నిర్వహిస్తోంది. ఆన్లైన్ విద్యాబోధనే ఇందులో ప్రధాన ఎజెండా కావడం గమనార్హం. వీలైనంత ఎక్కువగా విద్యార్థులను, అధ్యాపకులను, కాలేజీల యాజమాన్యాలను సిద్ధం చేసే అంశాలపై ఈ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. ఒమిక్రాన్ వ్యాప్తిపై స్పష్టత లేకున్నా ఆన్లైన్ బోధనను ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. ప్రత్యక్ష బోధనతోపాటు ఆన్లైన్కూ కాలేజీలు ప్రాధాన్యత ఇవ్వడాన్ని తప్పనిసరి చేసే యోచనలో ఉన్నారు. మార్గదర్శకాల రూపకల్పన ప్రాథమిక విశ్లేషణల ప్రకారం అన్ని వర్సిటీలు ఆన్లైన్ బోధనకే ప్రాధాన్యమిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. గతంలో ఆన్లైన్ బోధనపై అనేక విమర్శలొచ్చిన నేపథ్యంలో ఈ విధానంలో ఎదురవుతున్న సమస్యలపై సమావేశంలో చర్చించనున్నారు. కాలేజీల్లో ముందస్తు ప్రణాళిక లేకపోవడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొరవడటం వల్ల బోధన సరిగా జరగలేదని ఆరోపణలొచ్చాయి. కొన్నిచోట్ల అధ్యాపకులు సెల్‌ఫోన్ ద్వారా తరగతు లు బోధించారు. ఇందులో సబ్జెక్టు ప్రాధాన్యత కొరవడిందని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జూమ్ మీటింగ్‌ల ద్వారా కూడా బోధనకు అనేక సమస్యలు వచ్చాయి. చాలాచోట్ల ఫ్యాకల్టీలు సాంకేతికతకు అలవాటు కాలేదు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ బోధన కోసం మార్గదర్శకాలు రూపొందించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఆన్లైన్ సంభాషణ జరిగేలా.. ►గతంలో ఆన్‌లోన్ విద్యాబోధనపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ విధానాన్ని పకడ్బందీగా నిర్వహించడంపై ఉన్నత విద్యామండలి దృష్టి పెట్టింది. ఆఫ్‌లైన్‌లో అయితే విద్యార్థులు, అధ్యాపకుల మధ్య నేరుగా సంభాషణ ఉంటుంది కాబట్టి విద్యార్థులు నేరుగా అనుమానాలు నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో ఇలాంటి అవకాశం తక్కువగా ఉంటుంది. అందువల్ల రోజూ అధ్యాపకులు, విద్యార్థుల మధ్య ఆన్లైన్ సంభాషణ జరిగేలా చూడాలని భావిస్తోంది. ►ఆన్లైన్ బోధనకు సంబంధించి ఉన్నత విద్యామండలి కొన్ని అంశాలపై దృష్టి పెట్టింది. ఇందులో ముఖ్యమైంది.. ప్రతీ విద్యార్థి, అధ్యాపకుడి మధ్య ఆన్లైన్ సంభాషణ జరిగేలా చూడాలి. బోధన తొలి నాటి నుంచి కనీసం 15 నిమిషాలపాటు ఓ గ్రూపు ద్వారా విద్యార్థులతో అధ్యాపకులు మాట్లాడేలా చూడాలి. ►కనిష్టంగా 10, గరిష్టంగా 40 శాతం వరకూ ఆన్లైన్ బోధన చేపట్టేలా కాలేజీలను ప్రోత్సహించాలి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అ«ధ్యాపకులు బోధన చేసేందుకు అవసరమైన సదుపాయాలపై కాలేజీలు దృష్టి పెట్టేలా సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకునేలా వీసీలు చూడాలి. ► నిజానికి రెండేళ్లుగా ఆన్లైన్ బోధనతో విసిగిపోయిన మెజారిటీ విద్యార్థులు ప్రత్యక్ష బోధన కోరుకుంటున్నారని ఉన్నత విద్యా మండలి గుర్తించింది. ఈనేపథ్యంలో మళ్లీ ఆన్లైన్ వైపు సంసిద్ధులను చేయడంపై వీసీలు దృష్టి పెట్టాలి. ఆన్లైన్ అంతర్భాగమే ఆన్లైన్ బోధన నేటి విద్యా విధానంలో అంతర్భాగమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రత్యక్ష బోధన సాధ్యం కాని పరిస్థితులు తలెత్తితే సమర్థవంతమైన ఆన్లైన్ బోధన వైపు అడుగులేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాం. వీసీలతో సమావేశంలో దీన్నే ప్రధానాం శంగా చర్చిస్తాం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
ఎన్నికల జాతరలో అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రచారం కోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నాయి. సంప్రదాయ జెండాలు, ప్లెక్సీలతో పాటు బెలూన్లు, బటన్లు, టీషర్టులు, కప్పులు, కీ–చైన్లపై తమ గుర్తులను ప్రచారం చేస్తూ ప్రజల్లోకి దూసుకుపోతున్నాయి. వీటిపై ఆయా పార్టీల మద్దతుదారులు, యువత ఆసక్తి చూపుతుండటంతో ఆఫ్‌లైన్‌తో పాటు అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఆన్లైన్ సంస్థల్లోనూ జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి. మై భీ హూ చౌకీదార్(నేనూ కాపలాదారునే) అనే బీజేపీ నినాదమున్న టీ–షర్టులు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మోదీ, ప్రియాంకా గాంధీ చీరలకు డిమాండ్ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రత్యేక టోపీలను తీసుకొచ్చింది. వీటికే భారీ డిమాండ్.. కాంగ్రెస్, బీజేపీ సహా వేర్వేరు రాజకీయ పార్టీల గుర్తులు, నినాదాలతో వస్తున్న టీ–షర్టులు, కప్పులు, కీచైన్లకు ఆన్లైన్లో మంచి గిరాకీ ఉందని ఆన్లైన్ రిటైల్ సంస్థ స్నాప్‌డీల్ అధికార ప్రతినిధి తెలిపారు. ‘అభ్యర్థులు, పార్టీల చిత్రాలు ఉన్న కాఫీ మగ్గులు, పవర్ బ్యాంకులు, యూఎస్బీ డ్రైవ్స్, టీ షర్టులు, చీరలను కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌లలో కారు, బైక్ స్టిక్కర్లు, టీషర్టులు, టోపీలు, నీటి బాటిళ్లు, కీచైన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి’ అని అన్నారు. మోదీ, రాహుల్, ప్రియాంక వంటి కీలక నేతల ముఖచిత్రాలతో ఉన్న ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని పేరొన్నారు. సదర్ బజార్లో దీటుగా అమ్మకాలు.. ఆన్లైన్ అమ్మకాలకు పోటీగా ఢిల్లీలోని సదర్ బజార్లో ఎన్నికల ఉత్పత్తుల అమ్మకాలు సాగుతున్నాయి. ఇక్కడి షాపుల్లో కాంగ్రెస్, బీజేపీ, ఆప్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లకు చెందిన జెండాలు, బ్యాండ్లు, పార్టీ ముఖ్యనేతల చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. విక్రమ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ యజమాని హర్‌ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. ప్రచార సామగ్రి అమ్మకాల్లో బీజేపీ అన్నిపార్టీల కంటే ముందంజలో ఉందని అభిప్రాయపడ్డారు. ప్రముఖ ఆన్లైన్ రిటైల్ సంస్థ అమెజాన్ వెబ్సైట్లో మోదీ చీరలు రూ.700 నుంచి రూ.3,549 మధ్యలో దర్శనమిస్తున్నాయి. మరోవైపు బీజేపీ ప్రచార సామగ్రిని అమ్మేందుకు ‘నమో రథాల’ను సిద్ధం చేశామనీ, ఈసీ నుంచి అనుమతి లభించిన వెంటనే వీటిని రంగంలోకి దించుతామని బీజేపీ నేత మనోజ్ తెలిపారు. -
వెయిటింగ్ లిస్ట్‌ను వెల్లడించాల్సిందే
న్యూఢిల్లీ: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు(డీఎస్ఎస్ఎస్బీ) పరీక్షలో ఎంపికై వెయిటింగ్ లిస్టులో ఉన్న అభ్యర్ధుల పేర్లను బహిర్గతం చేయాలని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ఆదేశించింది. ఈ జాబితాను వారం రోజుల్లో ఆన్లైన్లో ఉంచాలని సీఐసీ కమిషనర్ యశోవర్ధన్ ఆజాద్ సెలెక్షన్ బోర్డును కోరారు. డీఎస్ఎస్ఎస్బీ గత ఏడాది 34 టీచర్ పోస్టుల భర్తీకి గాను పరీక్షలు నిర్వహించింది. ఎంపికైన వారితో 33 పోస్టులను భర్తీ చేసింది. అయితే, వెయిటింగ్ లిస్ట్, కటాఫ్ మార్కులు, ర్యాంకుల వివరాలు తెలపాలని రేఖారాణి అనే అభ్యర్థిని కోరగా డీఎస్ఎస్ఎస్బీ తిరస్కరించింది. దీనిపై ఆమె సీఐసీని ఆశ్రయించారు. వెయిటింగ్ లిస్ట్‌ను రహస్యంగా ఉంచడం సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనని సీఐసీ పేర్కొంది. అర్జీదారుకు వివరాలు తెలుసుకునే హక్కు ఉందంటూ, ఈ పరీక్ష వెయిటింగ్ లిస్ట్‌ను రెండు వారాల్లోగా ఆన్లైన్లో ఉంచాలంది. -
మే 24న ఎంసెట్-ఏసీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్- అసోసియేటెడ్ కాలేజెస్ (ఏపీ ఎంసెట్-ఏసీ)ను మే 24న నిర్వహిస్తామని వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఎంసెట్-ఏసీని ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తామన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్ల్లాడుతూ 2015-16 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్ ఫీజులను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేశామన్నారు. ఎంసెట్‌లో ప్రతిభ కనబరిచి.. మెరుగైన ర్యాంకు సాధించిన వారికి 50 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో కేటాయించామన్నారు. కన్వీనర్ కోటాలో సీట్లు పొందే వారికి ఏడాదికి రూ.పది వేలు ఫీజుగా నిర్ణయించామని చెప్పారు. మిగతా 50 శాతం సీట్లలో 35 శాతం సీట్లు భర్తీ చేయడానికి ఈ ఏడాది నుంచి ఏపీ ఎంసెట్-ఏసీను