ఎల్ఐసీ హౌసింగ్ నుంచి రెండు కొత్త పథకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ‘భాగ్య లక్ష్మి ప్లస్’, ‘న్యూ ఫిక్స్డ్ 10’ పేరుతో రెండు సరికొత్త గృహరుణ పథకాలను ప్రవేశపెట్టింది. భాగ్యలక్ష్మి ప్లస్ పథకం కింద మహిళపేరిట తీసుకునే గృహరుణాలపై గరిష్టంగా రూ.75 లక్షల వరకు మొదటి రెండు సంవత్సరాలకు 10.35 శాతం స్థిర వడ్డీపైన రుణాన్ని అందిస్తుంది. ఆ తర్వాత ఈ మొత్తం అప్పటి వడ్డీరేట్ల ప్రకారం ఫ్లోటింగ్ రేట్లలోకి మారుతుంది.
కాని ఇలా ఫ్లోటింగ్ రేటులోకి మారినప్పుడు వడ్డీరేటులో పావు శాతం డిస్కౌంట్ లభిస్తుందని కంపెనీ మంగళ వారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. న్యూ ఫిక్స్డ్ 10 పథకంలో గృహరుణం తీసుకునే వారికి గరిష్టంగా రూ.75 లక్షల రుణం వరకు 10 సంవత్సరాలు పాటు 11.50 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాని ఐదేళ్ల తర్వాత ఫ్లోటింగ్ రేటులోకి మారే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది.