breaking news
lewd comments on women
-
అసభ్యంగా కామెంట్లు.. అపరకాళిలా మారి చెప్పుతో కొట్టింది
న్యూఢిల్లీ: రద్దీగా ఉండే నడిరోడ్డుపై ఓ మహిళ ఒక వ్యక్తిని కిందపడేసి చెప్పుతో చితకొట్టేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...రోడ్డుపై వెళ్తున్న ఆమె పట్ల సదరు వ్యక్తి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా అపరకాళిలా మారి అతని పై దాడి చేసింది. రహదారిపై ఉన్నవారంతా చూస్తుండగానే కిందపడేసి చెప్పుతో చితక బాదేసింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిద్దర్నీ అడ్డుకుని పోలీస్టేషన్‌కి తరలించారు. ఈ మేరకు పోలీస్ అధికారి అనూప్ సింగ్ సదరు వ్యక్తులను విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. मुरादाबाद ➡महिला ने शोहदे की बीच सड़क जमकर पिटाई की ➡महिला ने शोहदे को बीच सड़क पर चप्पलों से पीटा ➡पिटाई होते देख मौके पर लगी लोगों की काफी भीड़ ➡15 मिनट तक शोहदे की पिटाई का हाईवोल्टेज ड्रामा।#Moradabad pic.twitter.com/XxJII5IOS3 — भारत समाचार (@bstvlive) August 27, 2022 (చదవండి: బ్యాగ్‌లో 15 ఏళ్ల బాలిక మృతదేహం) -
ట్రంప్.. మరో షాకింగ్ కంపు వీడియో!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు కావాలన్న కలలు కంటున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరో దిమ్మదిరిగే షాక్ తగిలింది. 1992లో ఓ అమ్మాయితో అసభ్యంగా మాట్లాడిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే మహిళలపై లైంగిక దుర్భాషలు ఆడిన వీడియో సంచలనం రేపుతుండగా.. దీనికి తోడు ట్రంప్ తమపై లైంగిక దుశ్చర్యలకు పాల్పడ్డాడని కనీసం ఐదుగురు మహిళలు ముందుకొచ్చారు. తనను అసభ్యంగా తాకుతూ.. ఒళ్లంతా తడుముతూ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. ఈ ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతుండగా.. తాజాగా సీబీఎస్ న్యూస్ చానెల్ ఓ వీడియోను ప్రసారం చేసింది. 1992లో క్రిస్మస్ సందర్భంగా ట్రంప్ టవర్స్‌లో 'ఎంటర్టైన్మెంట్ టునైట్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యుక్త వయస్సు బాలికలు పాల్గొనగా.. వాళ్లలో ఒక అమ్మాయిని ఉద్దేశించి.. 'రానున్న పదేళ్లలో నీతో డేటింగ్ చేస్తాను. దీనిని నువ్వు నమ్ముతావా?' అంటూ ట్రంప్ పేర్కొన్నాడు. అప్పడు ట్రంప్ వయస్సు 42 ఏళ్లు.. ''నేను వాళ్లను ఇప్పుడు ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టాను.. కేవలం ముద్దే.. నేను వేచి చూడలేదు. నువ్వు స్టార్ అయినప్పుడు వాళ్లు నిన్ను ముద్దు పెట్టుకోనిస్తారు'' అంటూ ట్రంప్ అసభ్య వ్యాఖ్యలు చేసిన వీడియో గతవారం వెలుగులోకి రావడం పెద్ద దుమారం రేపింది. ఈ వీడియోతో రిపబ్లికన్ పార్టీలో అంతర్యుద్ధం తరహా పరిస్థితి నెలకొంది. ట్రంప్‌ను అధ్యక్ష అభ్యర్థిగా కొనసాగించరాదంటూ సొంత పార్టీకి చెందిన మెజారిటీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ట్రంప్‌పై మహిళల ఆరోపణలు ఆగడం లేదు. ట్రంప్ గతంలో తమను అసభ్యంగా తాకారని తాజాగా ముగ్గురు మహిళలు ఆరోపించిన సంగతి తెలిసిందే. వారిలో ఒకరు తనను పెదవుల మీద బలవంతంగా ముద్దుపెట్టుకున్నారని చెప్పగా, మరొకరు చెప్పరాని చోట తాకారని అన్నారు. ఇంకొకరు తనను వెనక భాగంలో అసభ్యంగా నొక్కారన్నారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం తాను, ట్రంప్ పక్కపక్క సీట్లలో విమానంలో ప్రయాణించినట్లు జెస్సికా లీడ్స్ అనే వ్యాపారవేత్త చెప్పారు. అప్పుడు ట్రంప్ తనను అసభ్యంగా తాకారన్నారు. విమానం టేకాఫ్ తీసుకున్న 45 నిమిషాల తర్వాత ట్రంప్ తమ రెండు సీట్ల మధ్య చెయ్యిపెట్టుకోడానికి ఉన్న ఆర్మ్ రెస్ట్‌ను తీసేసి.. తనను చాలా అసభ్యంగా తాకడం మొదలుపెట్టారని, తన స్కర్టు మీద కూడా చెయ్యి వేశారని ఆమె అన్నారు. అతడు ఆక్టోపస్ లాంటివాడని, అతడి చేతులు అన్నిచోట్లా ఉన్నాయని ఆరోపించారు. అప్పటికి తన వయసు 38 ఏళ్లన్నారు. దాంతో తాను వేరే సీటులోకి మారిపోయానని చెప్పారు. రాషెల్ క్రూక్స్ (22) అనే మరో మహిళ 2005లో ట్రంప్ టవర్లోని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో రిసెప్షనిస్టుగా పనిచేసేవారు. ఒకరోజు ఉదయం భవనం బయట ఉన్న లిఫ్టులో ట్రంప్ కలిశారని, తనను తాను ఆయనకు పరిచయం చేసుకుని షేక్‌హ్యాండ్ ఇవ్వగా, ట్రంప్ ముందు బుగ్గల మీద, తర్వాత పెదాల మీద బలవంతంగా ముద్దుపెట్టుకున్నారని చెప్పారు. అది చాలా ఇబ్బందికరంగా అనిపించిందని, తాను ఏమీ చేయలేనని భావించి ఆయనలా చేసి ఉంటారని అన్నారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ తన కార్యాలయానికి వచ్చి ఫోన్ నెంబరు అడిగారన్నారు. ఎందుకు కావాలని అడగ్గా.. తన మోడలింగ్ ఏజెన్సీకి పంపుతానని చెప్పారన్నారు. తాను పనిచేసే బేరాక్ గ్రూప్ కంపెనీకి, ట్రంప్‌కు మధ్య ఉన్న వ్యాపార సంబంధాల దృష్ట్యా తాను చెప్పాల్సి వచ్చింది గానీ మోడలింగ్ ఏజెన్సీ వాళ్లు మాత్రం ఎప్పుడూ తనకు ఫోన్ చేయలేదన్నారు. 13 ఏళ్ల క్రితం ఒక రిసార్టులో తన పృష్టభాగంలో ట్రంప్ తనను అసభ్యంగా నొక్కారని మరో మహిళ ఆరోపించారు. మిండీ మెకగ్ గిల్లివ్రే (36) అనే మహిళ ఈ ఆరోపణలు చేశారు. అప్పట్లో తాను ఒక ఈవెంటు ఫొటోగ్రాఫర్‌తో కలిసి అక్కడకు వెళ్లానని, వెనక భాగంలో ఏదో ఇబ్బందిగా అనిపిస్తే తొలుత కెమెరా బ్యాగ్ తగిలందనుకున్నానని, కానీ వెనక్కి తిరిగి చూసి దిగ్భ్రాంతి చెందానని చెప్పారు. అయితే ఈ ఆరోపణలన్నింటినీ ట్రంప్ ఖండించారు. -
వీడియోలో అడ్డంగా దొరికేసిన ట్రంప్
శ్వేతసౌధంలో రాజ్యం ఏలాలన్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఆశలు గల్లంతయ్యేలా ఉన్నాయి. 2005 సంవత్సరంలో ఆయన మహిళల గురించి దారుణంగా కామెంట్ చేసిన వీడియో ఒకటి తాజాగా బయటపడింది. దాంతో ఆయన క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అయినా కూడా ఓటర్లు.. ముఖ్యంగా మహిళలు శాంతించే పరిస్థితి కనిపించడం లేదు. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక దాదాపు 11 ఏళ్ల క్రితం నాటి ఆ వీడియోను సంపాదించింది. ''నేను వాళ్లను ఇప్పుడు ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టాను.. కేవలం ముద్దే.. నేను వేచి చూడలేదు. నువ్వు స్టార్ అయినప్పుడు వాళ్లు నిన్ను ముద్దు పెట్టుకోనిస్తారు'' అని ట్రంప్ అన్నట్లు ఆ వీడియోలో ఉంది. మహిళలను ముద్దుపెట్టుకోవడం, అసభ్యంగా తాకడం, వాళ్లతో లైంగిక కార్యకలాపాలలో పాల్గొనడం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ మైక్రోఫోన్లో రికార్డయ్యాయి. బిల్లీ బుష్‌తో మాట్లాడుతున్నట్లుగా ఈ వీడియో ఉంది. అయితే ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక ప్రైవేటు సంభాషణ అని ట్రంప్ అన్నారు. గోల్ఫ్ కోర్స్‌లో బిల్ క్లింటన్ తనకంటే ఇంకా చాలా దారునంగా మాట్లాడారని చెప్పారు. అయితే.. తన మాటలకు ఎవరైనా బాధపడితే మాత్రం తాను క్షమాపణలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలపై ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తీవ్రంగా మండిపడ్డారు. ''ఇది దారుణాతి దారుణం ఇలాంటి వ్యక్తి అధ్యక్షుడు అవ్వడానికి మనం అంగీకరించలేం'' అని ఆమె చెప్పారు. ఇలాంటి ప్రవర్తన హేయమని డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి సెనేటర్ టిమ్ కైన్ అన్నారు. ట్రంప్ సొంత పార్టీ వాళ్లు కూడా ఆయన క్షమాపణలను ఏమాత్రం అంగీకరించడం లేదు. ఇద్దరు అమ్మాయిలకు తాతగా.. ట్రంప్ మహిళల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసి, ఇప్పుడు క్షమాపణలు చెప్పినా తాను వాటిని అంగీకరించలేనని రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీపడిన జెబ్ బుష్ చెప్పారు. ప్రతినిధుల సభ స్పీకర్ పాల్ ర్యాన్ కూడా మహిళలపై ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళలు ఎవరైనా వాళ్ల గురించి ఇలాంటి మాటలు మాట్లాడకూడదని, ఎప్పుడూ అలా చేయకూడదని రిపబ్లికన్ పార్టీ జాతీయ కమిటీ చైర్మన్ రీన్స్ ప్రీబస్ చెప్పారు.