breaking news
Legislative Assembly meeting
-
కాళేశ్వరంపై సీబీఐ: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలుపంచుకున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్‌లో వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, పీఎఫ్సీ, ఆర్ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాలుపంచుకున్నందున సీబీఐకి విచారణ అప్పగించడం సముచితమని తమ ప్రభుత్వం భావిస్తుందన్నారు. శాసనసభలో ఆదివారం జరిగిన ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, జస్టిస్ పీసీ ఘోస్ విచారణ కమిషన్ నివేదిక’పై జరిగిన సుమారు తొమ్మిదిన్నర గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. ఆదివారం అర్ధరాత్రి 1:40 గంటల వరకు సాగిన శాసనసభ చర్చలో సీఎం రేవంత్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. లోతైన దర్యాప్తు అవసరం.. ‘తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ (సీఓఐ)ను నియమించింది. విచారణ కమిషన్ తన నివేదికను ఈ ఏడాది జూలై 31న ప్రభుత్వానికి సమర్పించింది. గత నెల 4న జరిగిన మంత్రిమండలి సమావేశం ఈ నివేదికను ఆమోదించింది. తదుపరి చర్చ జరిపేందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కేబినెట్ చేసిన తీర్మానం ప్రకారం ఈ నివేదికపై శాసనసభలో చర్చ జరిగింది. పీసీ ఘోష్ విచారణ కమిషన్ నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించింది. మూడు బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని.. అసలు ప్రణాళిక లేదని కమిషన్ తేల్చిచెప్పింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా, మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్ల కోసమే మేడిగడ్డకు మార్పు ‘కేసీఆర్ ఆదేశాల మేరకే మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి వ్యాప్కోస్ నివేదిక ఇచ్చింది. లిఫ్టులు, పంపుల సంఖ్య పెరగడంతోనే ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగంది. కాంట్రాక్టర్ల కమీషన్లకు తలొగ్గి నిర్మాణ లోపాలపై కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మేడిగడ్డ కుప్పకూలింది. దుర్మార్గంగా ఆలోచించి దోపిడీ దొంగగా మారి తెలంగాణ సొత్తు లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ దోచుకున్నాడు. కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి వందల ఎకరాలు, ఫామ్‌హౌస్‌లు, మీడియా సంస్థలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 85,449 కోట్లు అప్పు తీసుకున్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ఊరుపేరు మార్చి రూ. 1.50 లక్షల కోట్ల భారాన్ని తెలంగాణపై మోపారు. తెచ్చిన రుణంలో ఇప్పటివరకు అసలు, వడ్డీ కలుపుకుని రూ. 49,835 కోట్లు బ్యాంకులకు అప్పు చెల్లించాం. అసంపూర్తిగా మిగిలి ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఇంకా రూ. 47 వేల కోట్లు అవసరం ఉంది. లోపభూయిష్ట నిర్ణయాలతో ఆర్థికభారం మోపిన కేసీఆర్, హరీశ్‌రావును శిక్షించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం పూర్తిచేయాల్సిన ప్రాణహిత ప్రాజెక్టు ఉసురు తీసి ఉరి వేసింది కేసీఆర్ కాదా? కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా తెచ్చిన అప్పులను రీ–స్ట్రక్చర్ చేసి వడ్డీ భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. నేను ఢిల్లీకి సర్కస్ చూడటానికి వెళ్లడం లేదు. ఇప్పటివరకు ప్రధాని మోదీని కలిసి రూ. 26,400 కోట్ల రుణం రీ–స్ట్రక్చర్ చేసి ఏటా రూ. 4 వేల కోట్లు ఆదా చేస్తున్నాం. రుణాలు రీ–స్ట్రక్చర్ అయితే ప్రతి నెలా రూ. వేయి కోట్లు ఆదా అవుతాయి. నాకు ప్రధాని మోదీ బడే భాయ్. జెండా, ఎజెండా వేరైనా అనుమతులు, నిధులు తెచ్చుకునే బాధ్యతపై నాపై ఉంది. మోదీని కలిసేందుకు నాకు భేషజాలు లేవు’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. -
ఎప్పటికప్పుడు మనం వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సీఎం జగన్
-
26 కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తాం: సీఎం జగన్
-
సీఎం జగన్ అధ్యక్షతన ప్రారంభమైన వైఎస్సార్సీఎల్పీ భేటీ
-
ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లోనే ఉండాలి: సీఎం జగన్
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం సమావేశం ముగిసింది. అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ భేటీలో రాబోయే ఎన్నికలకు సమాయత్తంపై పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటుపై సీఎం జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సీఎం జగన్ సూచించిన పలు మార్గనిర్దేశకాలు.. ► ఒక్కో గ్రామ సచివాలయానికి రెండు రోజులు వెళ్లాలన్న సీఎం జగన్ ►ప్రతిరోజు నివేదికను తెప్పించుకుని సమీక్షిస్తామన్న సీఎం జగన్ ►క్యాడర్ ప్రజలకు దగ్గర చేయాలన్న సీఎం ► బూత్ కమిటీలను బలోపేతం చేయాలి ► బూత్ కమిటీల్లో సగం మంది మహిళలు ఉండాలి ► ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లోనే ఉండాలి ► ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి ► మే నెల నుంచి నెలలో 10 సచివాలయాలను సందర్శించాలి ► ఒక్కో గ్రామ సచివాలయానికి వారంలో రెండు రోజులు వెళ్లాలన్న సీఎం జగన్ ► ఏప్రిల్‌కల్లా జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు కావాలన్న సీఎం ► కొత్త జిల్లాల వారీగా రీజినల్ కోఆర్డినేటర్లను నియమిస్తామన్న సీఎం ► జూలై 8న ప్లీనరీ నిర్వహిస్తామన్న సీఎం జగన్ ► మంత్రివర్గాన్ని కూడా పునర్ వ్యవస్థీకరిస్తాం: సీఎం జగన్ ► 26 కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తాం: సీఎం ► కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించాం: సీఎం జగన్ ►దీని వల్ల మనం గర్వంగా ప్రజలకు దగ్గర వెళ్లగలం: సీఎం ► టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న సీఎం జగన్ ► మనం చేస్తున్న యుద్ధం చంద్రబాబుతోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, tv-5తో కూడా: సీఎం జగన్ ► వీరంతా ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు: సీఎం ► ఎప్పటికప్పుడు మనం వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సీఎం జగన్ చదవండి: ‘కల్తీ’ మాటలేల! -
ఈ నెల 15న వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం
-
ఆదర్శప్రాయుడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో ఎదిగి నిరాడంబరుడిగా, ఆదర్శవాదిగా ప్రజా మన్ననలు పొందిననేత దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన రామలింగారెడ్డి మరణం దుబ్బాక నియోజకవర్గ ప్రజలనే కాక, రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. రామలింగారెడ్డి మృతిపై సోమవారం శాసనసభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘బాధాకరమైన తీర్మానం ప్రవేశపెట్టాల్సి వస్తుందని ఊహించలేదు. బాధాతప్త హృదయంతో ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నా. రామలింగారెడ్డి మృతిపట్ల ఈ సభ సంతాపం తెలుపుతోంది. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఉద్యమ నేపథ్యంలో ఎదిగి వచ్చిన నేత రామలింగారెడ్డి నిత్యం ప్రజల మధ్యనే మనుగడ సాగించిన నిరాడంబరనేతగా చెరగని ముద్ర వేశారు’అని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రజాఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారని, మెదక్ జిల్లాలో జరిగిన ఉద్యమాలకు బాసటగా నిలిచారని కొనియాడా రు. జర్నలిస్టుగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఎమ్మెల్యే కాక ముందు నుంచే తనకు ఆయనతో ఆత్మీయ అనుబంధం ఉందని గుర్తు చేసిన ముఖ్యమంత్రి, తాను నమ్మిన ఆదర్శాలను ఆచరణలో పెట్టిన అభ్యుదయవాదని కొనియాడారు. వరకట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారని, ప్రజాకవి కాళోజీ, తన చేతుల మీదుగా ఆదర్శ వివాహం జరిగిందని గుర్తు చేశారు. ఇదే ఆదర్శంతో తన పిల్లలకు కూడా వివాహాలు జరిపించారన్నారు. రామలింగారెడ్డిలోని నిబద్ధత, విశ్వసనీయత, నాయకత్వ లక్షణాలు గమనించి.. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ ఇచ్చామని, ఆ ఎన్నికల్లో దొమ్మాట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున గెలిచి యువ నేతగా శాసనసభలో అడుగుపెట్టారన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైనపాత్ర పోషించారని, సమైక్యవాదుల ప్రలోభాలకు లొంగకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని కొనియాడారు. గుండెలు బరువెక్కాయి... రామలింగారెడ్డి మరణం ఊహించనిదని, ఆయన మరణంపై తీర్మానాన్ని బలపరచాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని మంత్రులు పేర్కొన్నారు. నిరాడంబరంగా ఉండే మిత్రున్ని కోల్పోయామన్నారు. సీఎం ప్రవేశపెట్టిన సంతాప తీర్మానంపై మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాల్లో రామలింగారెడ్డి లాంటి నాయకులు అరుదని కేటీఆర్ కొనియాడారు. ఆయన మరణంతో తమ గుండెలన్నీ బరువెక్కాయని మంత్రులు పేర్కొన్నారు. -
కర్మయోగి.. అజాత శత్రువు
సాక్షి, హైదరాబాద్: దేశాభివృద్ధిలో మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ సేవలు మరువలేనివని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రణబ్ మరణంతో దేశం శిఖర సమానుడైన నాయకున్ని కోల్పోయిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతిగా తెలంగాణ చరిత్రలో ప్రణబ్ నిలిచిపోయారని కొనియాడారు. సోమవారం శాసనసభ ప్రారంభం కాగానే స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచన మేరకు సీఎం కేసీఆర్.. ప్రణబ్ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రణబ్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సీఎం మాట్లాడుతూ, ‘ప్రణబ్ మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నా. ఆయన మరణంతో దేశం శిఖర సమానుడైన నాయకుడిని కోల్పోయింది. అర్ధ శతాబ్దం పాటు భారత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన కర్మయోగి ప్రణబ్. 1970 తర్వాత దేశ అభివృద్ధిలో ఆయన లేని పేజీ ఉండదంటే అతిశయోక్తి కాదు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకితభావంతో ఎదిగారు. సంకీర్ణ ప్రభుత్వాల శకం మొదలయ్యాక పార్టీల మధ్య ఏకాభిప్రాయ సాధనలో ఆయనది అమోఘమైనపాత్ర. మిత్రపక్షాలను కలుపుకొనిపోవడంలో కుడిఎడమలను సమన్వయం చేసిన సవ్యసాచిలా మన్ననలు పొందారు. పార్లమెంట్ విలువలకు నిలువెత్తు ప్రతీక’అని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో ప్రణబ్.. తెలంగాణతో ప్రణబ్‌కు ఉన్న సంబంధాన్ని సీఎం గుర్తు చేశారు. ‘రాష్ట్ర ఏర్పాటుపై పార్టీల అభిప్రాయ సేకరణకు నియమించిన కమిటీకి ఆయన సారథ్యం వహించడమే కాకుండా, ప్రజల ఆకాంక్షను అధ్యయనం చేసి పరిష్కారానికై అధిష్టానానికి మార్గదర్శనం చేశారు. రాష్ట్ర అవతరణకు సహాయపడిన వారిగానే కాకుండా, రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతిగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారు’అని సీఎం పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులేశారు: భట్టి ‘ప్రణబ్ దేశం గర్వించదగ్గ నాయకుడు. దేశంలో ఉత్పన్నమైన అనేక సమస్యలను ట్రబుల్ షూటర్‌గా పరిష్కరించేవారు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు వేశారు.తెలంగాణ సాధనకు మార్గదర్శనం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎదిగి, దేశానికి విశేష సేవలు అందించినందుకు గర్విస్తున్నాం’అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొ న్నారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు ప్రణబ్ సేవలను గుర్తుచేసుకున్నారు. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, సుధీర్‌రెడ్డి మాట్లాడి సంతాప తీర్మానాలను బలపరిచారు. అనం తరం ప్రణబ్ సేవలను స్పీకర్ పోచారం గుర్తు చేశారు. సభ ప్రణబ్ ముఖర్జీ మృతికి తీవ్ర సంతాపాన్ని తెలిపింది. 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించింది. ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్ర శాసనమండలి నివాళులర్పించింది. సమావేశాలు ప్రారంభమైన అనం తరం సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించి ప్రణబ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. -
2023లోనూ మనమే వస్తాం..!
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో రాజకీయ నాయకత్వ శూన్యత ఉందని, అయితే ఇప్పట్లో తనకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సొంత పార్టీ నేతలకు స్పష్టతనిచ్చారు. 2023లోనూ రాష్ట్రంలో తిరిగి టీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో సోమవారం సాయంత్రం జరిగిన టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. శాసనసభ వాయిదా అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి దివంగత దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్టీ శాసనసభా పక్షాన్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ సుమారు గంటపాటు ప్రసంగించారు. ‘కేంద్రంలో బీజేపీ చేస్తున్న తప్పిదాలను ఆయుధాలుగా మలచుకోవడంలో కాంగ్రెస్ పదేపదే విఫలమవుతోంది. జాతీయ పార్టీలు అభివృద్ధి, సంక్షేమాన్ని మరిచి పాకిస్తాన్ వంటి ఇతర అంశాలను బూచిగా చూపిస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే మీ అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటా. జాతీయ రాజకీయాలకు సంబంధించి త్వరలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీతోనూ సమావేశం నిర్వహిస్తా. ప్రస్తుతం ఇక్కడ చేయాల్సింది ఎంతో ఉంది’అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ప్రపంచంలోనే అత్యుత్తమ రెవెన్యూ చట్టం ‘బ్రిటిష్ పాలన కాలంలో తయారైన రెవెన్యూ చట్టాలే ఇంకా చెల్లుబాటులో ఉన్నాయి, రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత లోపించడంతో భూ వివాదాలు పెరిగిపోతున్నాయి. సుమారు రెండు, మూడేళ్లుగా కసరత్తు చేసి దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత పారదర్శకమైన రెవెన్యూ చట్టాన్ని తయారు చేశాం. ఇకపై వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ బాధ్యతలు తహసీల్దార్లకు అప్పగిస్తాం. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతను రిజిస్ట్రార్లు నిర్వహిస్తారు. కొత్త రెవెన్యూ చట్టం నిబంధనలకు లోబడి కొత్త పాస్‌పుస్తకాలు కూడా జారీ చేస్తాం. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి, వారిని ఇతర చోట్ల సర్దుబాటు చేస్తాం’అని చట్టంలోని అంశాల గురించి సీఎం సుదీర్ఘంగా వివరించారు. అసెంబ్లీలో రెవెన్యూ చట్టం ఆమోదం పొందిన తర్వాత ఊరూరా బాణసంచా పేల్చి సంబురాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దుబ్బాకను గెలుచుకుంటాం.. ‘సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానాన్ని లక్ష ఓట్ల మెజారిటీతో గెలుచుకుంటాం. బస్సు కిరాయిలు లేని స్థితిలో ఉన్న రామలింగారెడ్డిని రాజకీయంగా ఎంతో ప్రోత్సహించా. ఆయన కూడా ఎంతో కష్టపడి రాజకీయాల్లో రాణించాడు. ఆయన కుటుంబానికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాం. దుబ్బాకలో గెలుస్తామంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డబ్బాలో రాళ్లు వేసినట్లు హడావుడి చేస్తున్నాయి. సోషల్ మీడియాలో హడావుడి చూసి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’అని సీఎం వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీలో వందకు పైగా సీట్లు ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు మూడు రకాల సర్వేలు నిర్వహించగా 92 నుంచి 110 స్థానాలు వస్తాయని తేలింది. అంతమాత్రాన స్థానిక ఎమ్మెల్యేలు ఆషామాషీగా వ్యవహరించకుండా సమన్వయంతో పనిచేస్తూ, మనం చేసిన అభివృద్దిని ప్రజలకు వివరించాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇతర జిల్లాల ఎమ్మెల్యేల సహకారం కూడా తీసుకుంటాం’అని కేసీఆర్ ప్రకటించారు. కరోనా పోరులో కేంద్ర సాయం శూన్యం ‘కరోనా ప్రభావంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ పూటకో మాట చెప్తుండటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రానికి రూ.12 వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా రూ.300 కోట్లకు పడిపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. వలస కార్మికుల వెతలు చూసి ఎంతో చలించిపోయా, వారు స్వస్థలాలకు చేరుకునేందుకు కొంత గడువు ఇవ్వాలనే వినతిని కేంద్రం పట్టించుకోకుండా లాక్డౌన్ విధించడంతో అనేక ఇబ్బందులు పడ్డారు. కేంద్రం నుంచి సాయం అందకున్నా బీజేపీ మాత్రం దుష్ప్రచారం చేస్తోంది. అసెంబ్లీ 18 రోజుల పాటు కొనసాగుతున్నందున సభ్యులు ప్రభుత్వ కార్యక్రమాలను సభా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి‘అని సీఎం కేసీఆర్ శాసనసభా పక్ష సమావేశంలో దిశానిర్దేశం చేశారు. -
‘హోదా’కు తొలి ప్రాధాన్యం
-
ఇది వైఎస్సార్సీపీ ప్రభంజనం
-
నేడు వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం భేటీ
-
నేడు వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం భేటీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం విజయవాడ బందరు రోడ్డులోని ఆర్అండ్ బీ అతిథి గృహంలో సోమవారం సాయంత్రం 6 గంటలకు జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యనేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు హాజరవుతున్నారు.