breaking news
legal position
-
యుద్ధ విమానాలే నడిపిస్తుంటే... సైన్యంలో లీగల్ పోస్టులు మహిళలకు ఇవ్వరా: సుప్రీం
న్యూఢిల్లీ: భారత వాయుసేనలో మహిళలు యుద్ధ విమానాలు నడిపిస్తున్నారని, వారికి సైన్యంలోని లీగల్ పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సైన్యంలో న్యాయమూర్తి, అడ్వొకేట్ జనరల్, ఇతర లీగల్ బ్రాంచ్ పోస్టుల్లో మహిళలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని వెల్లడించింది. ఆయా పోస్టులకు స్త్రీ–పురుష నిష్పత్తి వర్తించదని, అయినప్పటికీ మహిళలను ఎందుకు నియమించడం లేదని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. సైన్యంలో లీగల్ పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో తాము నాలుగు, ఐదో ర్యాంకులు సాధించామని, అయినా తమను ఎంపిక చేయలేదంటూ ఇద్దరు మహిళా అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయం చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. తమకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన పురుష అధికారులను లీగల్ బ్రాంచ్‌లో నియమించారని వారు ఆక్షేపించారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. సైన్యంలోని న్యాయ విభాగంలో పురుషుల కంటే ఎక్కువగా మహిళలను విధుల్లో చేర్చుకుంటే ఇబ్బందులేమిటో చెప్పాలని నిలదీసింది. పురుషులైనా, మహిళలైనా అర్హత ఉంటే అవకాశం ఇవ్వాల్సిందేనని స్పష్టంచేసింది. -
మాజీ భార్యకు ‘ఫేస్బుక్’ వేధింపులు
*ఆపై ఫోన్లో బెదిరింపులు *బాధితురాలి ఫిర్యాదుతో *కటకటాల పాలు గోల్కొండ: తనకు విడాకులు ఇచ్చిందన్న కక్షతో ఓ వ్యక్తి తన మాజీ భార్యను హైటెక్ పద్ధతుల్లో వే ధించసాగాడు. అసభ్యకర చిత్రాలను ఫేస్బుక్లో పెట్టాడు. ఆమెతోపాటు సదరు కుటుంబ సభ్యులను కూడా ఫోన్లలో బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. సైబరాబాద్ డీసీపీ( క్రైమ్స్) జి.జానకీ షర్మిల శుక్రవారం తన కార్యాలయంలో విలేకరులతో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన అశ్వాక్(38) నాలుగేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. శామీర్‌పేట్‌లోని ఐవీ లీగ్ అకాడమీ రెసిడెన్సియల్ స్కూల్లో ఎస్టేట్ మేనేజర్‌గా ఉంటూ 3 మార్చి 2013న ప్రైవేటు స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరు రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌లో కాపురం పెట్టారు. శామీర్‌పేటలోనే ఉండాలనేది అశ్వాక్ ఆలోచన. ఈ విషయమై భార్యాభర్తల మధ్య నిత్యం గొడవ జరిగేది. ఈ దశలో ఆమెపై పలు ఆరోపణలు చేయసాగాడు. అంతేగాక ఆమెను వదిలి అశ్వాక్ ఒక్కడే శామీర్‌పేటకు మకాం మార్చుకున్నాడు. దీంతో అతని భార్య వరంగల్ కోర్టులో విడాకుల పిటిషన్ పెట్టుకుంది. ఇతను కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం బాధితురాలికి విడాకులు మంజూరు చేసింది. విడాకుల అనంతరం అశ్వాక్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తప్పుడు చిరునామాతో షకీలా అనే పేరుతో ఫేస్బుక్ ఖాతా తెరిచాడు. మాజీ భార్యకు చెందిన చిత్రాలను అందులో అప్లోడ్ చేశాడు. గూగుల్ ద్వారా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి సిమ్‌కార్డులు తీసుకొని ఆమెతోపాటు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్లు చేయడం మొదలు పెట్టాడు. అసభ్యకరమైన మెసేజ్‌లు పంపేవాడు. ఈ విషయమై బాధితురాలు ఇటీవల సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. విచారణను చేపట్టిన పోలీసులు గురువారం శామీర్‌పేట్‌లో అశ్వాక్‌ను అదుపులోకి తీసుకున్నారు. విడాకుల ఇచ్చినందునే మాజీ భార్యను వేధించేందుకే తాను ఇవ న్ని చే శానని అశ్వాక్ అంగీకరించినట్టు డీసీపీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన ఏసీపీలు ఎస్.జయరామ్, డి.ప్రతాప్ రెడ్డిలను ఆమె అభినందించారు.