breaking news
Lawarence
-
లారెన్స్ బిష్ణోయ్‌పై అమెరికా ఛార్జ్ షీట్ దాఖలు
వాషింగ్టన్: భారత్ జైళ్లల్లో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని ఆరుగురు సహచరులపై అమెరికా న్యాయ శాఖ కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. అందులో హత్యలు, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, డ్రగ్స్,మానవ అక్రమ రవాణా వంటి అనేక అంతర్జాతీయ నేరాలకు పాల్పడ్డారనే వివరాలను అధికారులు పొందుపరిచారు.లారెన్స్ బిష్ణోయ్ 2015 నుండి భారత్‌లో జైలు శిక్షను అనుభవిస్తున్నప్పటికీ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్(VoIP) సాంకేతికత ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తన నేర నెట్‌వర్క్‌ను నేరుగా నడుపుతున్నట్లు అమెరికా దర్యాప్తులో స్పష్టమైంది.అమెరికా ఛార్జ్‌షీట్ వివరాల ప్రకారం, లారెన్స్ బిష్ణోయ్ మరియు ఉత్తర అమెరికాలో ఉన్న అతని ప్రధాన అనుచరుడు గోల్డీ బ్రార్ కలిసి 18 జూన్ 2023న కెనడాలోని సర్రేలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కాల్చి చంపాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా ను మే 2022లో పంజాబ్‌లో దారుణంగా కాల్చి చంపిన ఘటనకు బిష్ణోయ్ గ్యాంగే పూర్తి బాధ్యత వహించినట్లు తెలిపింది.దీంతో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను చంపాలనే ఉద్దేశాన్ని బిష్ణోయ్ పలుమార్లు బహిరంగంగానే వ్యక్తపరిచాడు. ఏప్రిల్ 2024లో ముంబైలోని నటుడి నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనకు కూడా ఈ సిండికేట్ బాధ్యత వహించాల్సి ఉంటుందని దర్యాప్తు సంస్థ తెలిపింది. ఇలా లారెన్స్ బిష్ణోయ్ తన నేర సామ్రాజ్యాన్ని భారత్ నుంచి అమెరికా, కెనడా, బ్రిటన్, యూరప్ వంటి పలు అభివృద్ధి చెందిన దేశాలకు విస్తరించాయి.ప్రస్తుతం ఈ గ్యాంగ్‌లో గోల్డీ బ్రార్ ఉత్తర అమెరికా విభాగాన్ని, రోహిత్ గొదారా యూరప్ విభాగాన్ని, సుఖ్రాజ్ సింగ్ కాంగ్ భారతదేశ కార్యకలాపాలను లీడ్ చేస్తున్నారు. అమెరికా దాఖలు చేసిన ఈ ఛార్జ్‌షీట్ కారణంగా గ్లోబల్ స్థాయిలో లారెన్స్ బిష్ణోయ్ సిండికేట్‌పై చట్టపరమైన నిఘా మరియు చర్యలు మరింత కఠినతరం కానున్నాయి. -
నాగ్‌ను మాసీగా చూపించేందుకు...
కొరియోగ్రాఫర్‌గా సక్సెస్ సాధించి అనంతరం మెగా ఫోన్ చేతపట్టి వరుస సక్సెస్‌లు కొడుతున్న దర్శకుడు లారెన్స్. స్టార్ హీరోలను కూడా డైరెక్ట్ చేసిన లారెన్స్ ప్రస్తుతం తను హీరోగా నటిస్తున్న తమిళ సినిమాల మీదే ఎక్కువగా దృష్టి పెట్టాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఈ డాన్సింగ్ స్టార్‌కు మంచి రికార్డే ఉంది. ముఖ్యంగా కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కించిన మాస్, డాన్ సినిమాలు లారెన్స్ కెరీర్లో మంచి హిట్స్ గా నిలిచాయి. అందుకే మరోసారి టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు లారెన్స్. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా నాగార్జున ఓ మాస్ సినిమా చేయాలనుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో లారెన్స్ ఆశలకు మరింత జోష్ వచ్చింది. రెండుసార్లు సక్సెస్ అయిన వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తే ఆడియన్స్‌లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే నాగ్ ఇమేజ్ కు తగ్గ ఓ యాక్షన్ సబ్జెక్ట్ రెడీ చేస్తున్నాడు లారెన్స్. ప్రస్తుతం నాగార్జున రెండు సినిమాలతో బిజీగా ఉండగా, లారెన్స్ కూడా తమిళ్ లో రెండు సినిమాలు చేస్తున్నాడు. సెట్స్ మీద ఉన్న ఈ ప్రాజెక్ట్స్ పూర్తవ్వగానే ఈ ఇద్దరి కాంబినేషన్లో మాస్ మసాలా ఎంటర్ టైనర్ పట్టాలెక్కే చాన్స్ ఉంది. చాలా రోజులుగా క్లాస్ సినిమాలే చేస్తున్న నాగ్ ను వీలైనంత మాసీగా చూపించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు లారెన్స్. 'రెబల్' డిజాస్టర్ కావటంతో కావటంతో తెలుగు తెరకు దూరమైన ఈ డాన్సింగ్ స్టార్ నాగ్ సినిమాతో మరోసారి టాలీవుడ్ లో సత్తా చాటాలని భావిస్తున్నాడు.


