breaking news
Lausanne
-
మళ్లీ దెబ్బేసిన పతిరగే.. నీరజ్ చోప్రాకు రజతం
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా లుసానే డైమండ్ లీగ్ మీట్లో రజతంతో మెరిశాడు. ఈటెను 88.05 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా సీజన్ బెస్ట్ త్రో నమోదు చేశాడు. కామన్వెల్త్లో స్వర్ణంతో మెరిసిన లంక స్టార్ జావెలిన్ త్రోయర్ రుమేశ్ పతిరగే మరోసారి పసిడి పతకాన్ని కొల్లగొట్టాడు. పతిరగే తన మూడో ప్రయత్నంలో ఈటెను నీరజ్ కంటే 9 సెంటీమీటర్లు ఎక్కువ దూరం విసిరాడు. దీంతో నీరజ్ స్కోరును దాటేసిన పతిరగే తొలి స్థానంలో నిలిచి భారత స్టార్‌ను మరోసారి దెబ్బకొట్టాడు. ఇక గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ మూడో ప్రయత్నంలో ఈటెను 86.61 మీటర్ల దూరం విసిరి బెస్ట్ నమోదు చేయడంతో పాటు కాంస్య పతకం సాధించాడు.కామన్వెల్త్ గేమ్స్‌లో అంత ఫిట్‌గా కనిపించనప్పటికీ నీరజ్ చోప్రా రజతంతో మెరిశాడు. అయితే లుసానే డైమండ్ లీగ్‌లో మాత్రం నీరజ్ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. తొలి రౌండ్లో ఈటెను 83.54 మీటర్లు విసిరి మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఇక రెండో రౌండ్లో 88.05 మీటర్లు విసిరిన నీరజ్ ఈ సీజన్లోనే బెస్ట్ ప్రదర్శన కనబరిచాడు. ఇక లంక స్టార్ పతిరగే 87.06 మీటర్లు విసిరి నీరజ్ తర్వాతి స్థానంలో నిలిచాడు. పీటర్స్ కూడా 84.76 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు. మూడో రౌండ్లో నీరజ్ ఈటెను 83.72 మీటర్లు మాత్రమే విసరగలిగాడు. కానీ పతిరగే మాత్రం ఈటెను 88.14 మీటర్లు విసిరి నీరజ్ స్కోరును దాటేసి అగ్రస్థానంలో నిలిచాడు. నాలుగో రౌండ్లో నీరజ్ ఫౌల్ చేయగా, పతిరగే మాత్రం 86.71 మీటర్ల దూరం విసిరాడు. ఇక పీటర్స్ మాత్రం నాలుగో రౌండ్లో ఈటెను 86.61 మీటర్లు విసిరి తన స్కోరును కాస్త పెంచుకున్నాడు. ఇక చివరి రౌండ్‌కు నీరజ్ దూరంగా ఉన్నాడు. అదే సమయంలో పతిరగే ఫౌల్ చేయగా, మిగతా అథ్లెట్లు 70 నుంచి 80 మీటర్ల మధ్యలోనే విసరడంతో నీరజ్‌కు రజతం ఖరారైంది.కామన్వెల్త్ క్రీడలు ముగిసిన తర్వాత నీరజ్ స్విట్జర్లాండ్‌లోని బీల్లో ఉన్న తన శిక్షణా కేంద్రానికి వెళ్లిపోయాడు. తన కోచ్ జైవీర్ చౌధరీ, ఫిజియో ఇషాన్ మార్వా సమక్షంలో అతను రీహాబిలిటేషన్‌ను కొనసాగించడంతో పాటు ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. బ్రసెల్స్‌లో జరిగే ఫైనల్స్‌కు ఆరుగురు త్రోయర్లు క్వాలిఫై అవుతారు. లుసానే తర్వాత తమ ర్యాంక్‌ను మెరుగపర్చుకునేందుకు ఆటగాళ్లకు ఈ నెల 27 నుంచి జ్యూరిచ్‌లో జరిగే అంచెలో కూడా అవకాశం ఉంది. 2022లో డైమండ్ లీగ్ చాంపియన్‌గా నిలిచిన నీరజ్, ఆ తర్వాత వరుసగా మూడేళ్ల పాటు రెండో స్థానంతో ముగించాడు. లుసానేలో టాప్–3లో నిలవడంతో తొలిసారి భారీ ప్రైజ్‌మనీ ఈవెంట్ వరల్డ్ అథ్లెటిక్స్ అల్టిమేట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు నీరజ్‌కు మార్గం సుగమమయింది.NEERAJ CHOPRA FINISHED 2ND AT THE DIAMOND LEAGUE LAUSANNE! 💎- Season Best throw of 88.05m 🔥🔥🔥 pic.twitter.com/iKbpOS2Li7— The Khel India (@TheKhelIndia) August 21, 2026 NEERAJ CHOPRA FINISHED 2ND AT THE DIAMOND LEAGUE LAUSANNE! 💎- Season Best throw of 88.05m 🔥🔥🔥 pic.twitter.com/iKbpOS2Li7— The Khel India (@TheKhelIndia) August 21, 2026చదవండి: 'భారత్, బ్రెజిల్ మ్యాచ్ బహిష్కరించండి' -
ఆ పోటీ నుంచి తప్పుకొంటున్నా.. కారణం ఇదే!
పాకిస్తాన్ స్టార్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. డైమండ్ లీగ్‌లో భాగంగా లుసానేలో జరుగనున్న ఈవెంట్ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని అర్షద్ నదీమ్ కోచ్ సల్మాన్ బట్ ధ్రువీకరించాడు.పసిడితో మెరిసి.. ఆపైకాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో అర్షద్ నదీమ్ స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. అత్యుత్తమంగా ఈటెను 92.7 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పిన అతడు.. విశ్వ క్రీడల వ్యక్తిగత విభాగంలో పాకిస్తాన్‌కు తొలి పసిడి పతకం అందించాడు.కానీ ఆ తర్వాత అర్షద్ నదీమ్ ప్రదర్శన దిగజారిపోయింది. చివరగా టోక్యోలో జరిగిన వరల్డ్‌కప్ చాంపియన్స్ మెడల్ ఈవెంట్లో ఈటెను 82.75 మీటర్ల దూరం విసిరిన ఈ పాక్ అథ్లెట్.. ఆ తర్వాత కనీసం 80 మీటర్ల మార్కు కూడా దాటలేదు.కాంస్యం కూడా గెలవలేకఇటీవల కామన్వెల్త్ గేమ్స్-2026లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అర్షద్ నదీమ్.. కనీసం కాంస్యం కూడా గెలవలేక అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అయితే, సరైన ప్రాక్టీస్ లేకపోవడం, పాక్ అమెచూర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్తో విభేదాల నేపథ్యంలోనే అర్షద్ రాణించలేకపోయాడనే వార్తలు వచ్చాయి.మరోవైపు.. కామన్వెల్త్ గేమ్స్‌లో తన ప్రదర్శనపై సొంత దేశ అభిమానులు సైతం విద్వేషం వెళ్లగక్కడంతో అర్షద్ నదీమ్ ఆవేదన వ్యక్తం చేశాడు. పాకిస్తాన్‌కు ఒలింపిక్ పతకంతో పాటు మరెన్నో మెడల్స్ అందించానని.. తనను తిట్టడం సరికాదని వాపోయాడు. లాహోర్ వాతావరణానికి, క్రీడలు జరిగిన గ్లాస్గో వాతావరణం పూర్తి భిన్నంగా ఉంటుందని.. అది తన ప్రదర్శనపై ప్రభావం చూపిందని చెప్పకనే చెప్పాడు.తప్పుకోవడానికి కారణం ఇదేఈ నేపథ్యంలో లుసానే (స్విట్జర్లాండ్)లో జరిగే డైమండ్ లీగ్ అంచె పోటీల నుంచి అర్షద్ నదీమ్ తప్పుకోవడం గమనార్హం. ఈ విషయం గురించి అతడి కోచ్ సల్మాన్ బట్ స్పందిస్తూ.. ‘లుసానేలో జరిగే డైమండ్ లీగ్‌లో పాల్గొనవద్దని అర్షద్ నిర్ణయించుకున్నాడు. ఆసియా క్రీడలకు సన్నద్ధమయ్యే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు’’ అని స్పష్టం చేశాడు.అదే విధంగా.. అర్షద్ ఈసారి సౌతాఫ్రికాలో ప్రాక్టీస్ చేస్తాడన్న సల్మాన్ బట్.. వీసా రాగానే అతడు అక్కడికి చేరుకుంటాడని తెలిపాడు. పోచెస్ట్రూమ్లో రెండు వారాల పాటు అర్షద్ శిక్షణ తీసుకుంటాడని తెలిపాడు. కాగా 2022 కామన్వెల్త్ క్రీడలు, 2024 ఒలింపిక్స్‌కు ముందు అర్షద్ ఇక్కడే ప్రాక్టీస్ చేశాడు. ఈ రెండు ఈవెంట్లలోనూ అతడు స్వర్ణ పతకం గెలవడం విశేషం.చాంపియన్లంతా బరిలోనేఇదిలా ఉంటే.. ఆగష్టు 21న జరిగే లుసానే డైమండ్ లీగ్‌లో భారత స్టార్, టోక్యో ఒలింపిక్స్ పసిడి పతక విజేత నీరజ్ చోప్రా, 2016 ఒలింపిక్ చాంపియన్ థామస్ రోలర్ (జర్మనీ), 2012 లండన్ ఒలింపిక్స్ విజేత, ట్రినిడాడ్‌కు చెందిన కెషోర్న్ వాల్కాట్, వరల్డ్ చాంపియన్ ఆండర్సన్ పీటర్స్ (గ్రెనెడా), కామన్వెల్త్ గేమ్స్-2026 స్వర్ణ విజేత, శ్రీలంక స్టార్ రుమేశ్ పతిరగే పోటీపడనున్నారు.చదవండి: నాడు పావురాల రెట్టలతో పోయిన పరువు.. తాజా పరిణామంపై సింధు స్పందన -
చిన్న గ్యాప్ మాత్రమే.. ప్రపంచ రికార్డుతో ఘనంగా రీఎంట్రీ
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడు. గజ్జల్లో గాయంతో కామన్వెల్త్ గేమ్స్‌కు దూరంగా ఉన్న నీరజ్ చోప్రా స్విట్జర్లాండ్‌లోని లుసాన్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో మరోసారి అదరగొట్టాడు. శుక్రవారం(ఆగస్టు 26న) జరిగిన అర్హత రౌండ్లో తొలి ప్రయత్నంలోనే నీరజ్ ఈటెను 89.08 మీట్లర్ల దూరం విసిరి తొలి స్థానంలో నిలిచాడు. ఇది అతని కెరీర్లో మూడో బెస్ట్ త్రో కావడం ఇశేషం. ఇంతకముందు ఇదే సీజన్లో 89.30 మీటర్లు, 89.98 మీటర్ల దూరం ఈటెను విసిరి కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. ఇక నీరజ్ చోప్రా వచ్చే నెలలో 7, 8 తేదీల్లో స్విట్జర్లాండ్‌లోనే డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో పాల్గొంటాడు. నీరజ్ తన తొలి ప్రయత్నంలో ఈటెను 89.08 మీటర్ల దూరం విసిరాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 85.18 మీటర్లు, మూడో ప్రయత్నంలో ఈటెను విసరలేదు. నాలుగో ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్ చివరి ప్రయత్నంలో 80.04 మీటర్లు మాత్రమే విసరగలిగాడు. అయితే తనకంటే బెస్ట్ ఎవరు వేయకపోవడంతో నీరజ్ తొలి స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. గత నెలలో అమెరికాలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ రజతం సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్ సందర్భంగా గాయపడటంతో నీరజ్ కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలిగాడు. #NeerajChopra 🇮🇳 Top finish with 89.08m at Lausanne Diamond League 🔥 He is back and back with a bang!#IndianAthletics@Diamond_League pic.twitter.com/0zTwDpjhyU — Athletics Federation of India (@afiindia) August 26, 2022 చదవండి: భారత్‌పై ‘ఫిఫా’ నిషేధం ఎత్తివేత Yora Tade: ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతూ మృత్యు ఒడిలోకి భారత కిక్ బాక్సర్ -
భారత షూటర్ గురించి ఆందోళన చెందవద్దు
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న భారత షూటర్ చైన్ సింగ్ హాస్పిటల్ నుంచి నేడు (ఆదివారం) డిశ్చార్జ్ కానున్నాడు. న్యూమోనియాతో ఇబ్బంది పడుతున్న షూటర్ స్విట్జర్లాండ్ లోని లుసానేలో ఓ ఆస్పత్రిలో చేరాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక వెంటనే రియోకు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడని, షూటర్ గురించి ఆందోళన చెందనవసరం లేదని భారత రైఫిల్స్ అకాడమీ సెక్రటరీ రాజీవ్ భాటియా తెలిపారు. గగన్ నారంగ్, అపూర్వీ చందేలాతో కలిసి లుసానేలో షూటింగ్ శిక్షణ తీసుకుంటున్నాడు. రియోలో 50 మీటర్ల ప్రోన్, 50 మీటర్ల రైఫిల్ త్రి పోజిషన్ విభాగాలలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. 2014లో ఇంచియాన్ లో జరిగిన ఆసియా గేమ్స్ లో 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్ విభాగంలో కాంస్యం సాధించాడు.


