భారత షూటర్ గురించి ఆందోళన చెందవద్దు | Shooter Chain Singh to be discharged from hospital today | Sakshi
Sakshi News home page

భారత షూటర్ గురించి ఆందోళన చెందవద్దు

Jul 24 2016 1:56 PM | Updated on Sep 4 2017 6:04 AM

భారత షూటర్ గురించి ఆందోళన చెందవద్దు

భారత షూటర్ గురించి ఆందోళన చెందవద్దు

రియో ఒలింపిక్స్లో పాల్గొననున్న భారత షూటర్ చైన్ సింగ్ హాస్పిటల్ నుంచి నేడు (ఆదివారం) డిశ్చార్జ్ కానున్నాడు.

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో పాల్గొననున్న భారత షూటర్ చైన్ సింగ్ హాస్పిటల్ నుంచి నేడు (ఆదివారం) డిశ్చార్జ్ కానున్నాడు. న్యూమోనియాతో ఇబ్బంది పడుతున్న షూటర్ స్విట్జర్లాండ్ లోని లుసానేలో ఓ ఆస్పత్రిలో చేరాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక వెంటనే రియోకు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడని, షూటర్ గురించి ఆందోళన చెందనవసరం లేదని భారత రైఫిల్స్ అకాడమీ సెక్రటరీ రాజీవ్ భాటియా తెలిపారు.

గగన్ నారంగ్, అపూర్వీ చందేలాతో కలిసి లుసానేలో షూటింగ్ శిక్షణ తీసుకుంటున్నాడు. రియోలో 50 మీటర్ల ప్రోన్, 50 మీటర్ల రైఫిల్ త్రి పోజిషన్ విభాగాలలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. 2014లో ఇంచియాన్ లో జరిగిన ఆసియా గేమ్స్ లో 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్ విభాగంలో కాంస్యం సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement