breaking news
Laukyam
-
భాగ్యనగరంలో భార్యా బాధితుల సంఘం
మెన్‌టోన్ పురుషులలో అత్యంత అరుదైన పుణ్యపురుషులని మినహాయించేస్తే, మిగిలిన మగాళ్లందరూ బేసిగ్గా కష్టజీవులు. కష్టజీవుల్లో అత్యధికులు నష్టజాతకులు. వివక్షాపూరిత సమాజం విసిరే నింద నిష్ఠురాలను భరించే పాపాల భైరవులు! సంసార భవసాగరంలో నిండా మునిగిపోయి, నానిపోయి, చివికిపోయి, చివరకు ఛిద్రమయ్యేవి మగబతుకులే! మగపుట్టుక పగవాళ్లకు కూడా వద్దురా అని దేవుడిని బహిరంగ రహస్యంగా ప్రార్థించే స్థాయిలో ఉంటాయి ‘మగా’నుభావుల కష్టాలు. ఇవేవీ లోకం కళ్లకు కనిపించవు. కనిపించినా, లోకం కాసేపు లౌక్యంగా కళ్లుమూసుకుంటుంది. మగాడెవడైనా కష్టాలు చెప్పుకుందామనుకున్నా, సాటి మగాడి కష్టాలను సానుభూతితో వింటే, సమాజంలో ఉన్న ‘మహిళా పక్షపాతి’ బిరుదుకు భంగం కలుగుతుందనే బెంగ కొందరిదైతే, ఇంట్లో ఇల్లాళ్లతో ప్రైవేటు చెప్పించుకునే పరిస్థితి తలెత్తే ప్రమాదాలుంటాయనే భయం మరికొందరిది. ఏతా వాతా చెప్పొచ్చేదేమిటంటే, మన సమాజంలో మగాడి కష్టాలను వినడానికి సాటి మగాళ్లకు ఓపిక, సానుభూతి మాత్రమే కాదు, ధైర్యసాహసాలూ కావాలి. మహిళా పక్షపాత సమాజంలో అలాంటి సాహసవంతులైన మగాళ్లు చాలా అరుదు. ఇంతటి అరుదైన పరిస్థితుల్లో అత్యంత అరుదైన దుస్సాహసానికి ఒడిగట్టారు కొందరు ‘మగా’నుభావులు. సగటు మగాళ్లు కలలోనైనా ఊహించలేని రీతిలో భాగ్యనగరంలో భార్యా బాధితుల సంఘాన్ని ప్రారంభించారు. న్యూ ఇయర్ కేలండర్ కూడా విడుదల చేశారు. ఈ సంఘం ఫేస్బుక్లో పేజీ తెరిచిన నాలుగు రోజుల వ్యవధిలోనే భార్యా బాధితుల నుంచి ఏకంగా 175 ఫోన్‌కాల్స్ వచ్చాయి. తమ భార్యలు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారనేదే మెజారిటీ బాధితుల ఫిర్యాదు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. పేరు మార్చుకోవాలంటూ ఈ సంఘానికి మహిళా సంఘాల నుంచి బెదిరింపులు కూడా మొదలయ్యాయి. ఇదేం విడ్డూరం చెప్మా! -
నవ్విస్తూ.. కవ్విస్తూ...!
గోపీచంద్ ఈ నెలాఖరున ‘లౌక్యం’తో ప్రేక్షకులను నవ్వించడానికి, కవ్వించడానికి సిద్ధమవుతున్నారు. మాస్లో మంచి ఇమేజ్ ఉన్న గోపీచంద్‌కు మంచి కామెడీ టైమింగ్ ఉంది. ఆయన ఏ తరహా సినిమా చేసినా ఎంటర్టైన్మెంట్ మాత్రం మిస్ కారు. ఇక, ‘లౌక్యం’లో అయితే, గోపీచంద్ పూర్తి స్థాయిలో తన కామెడీతో విజృంభించనున్నారట. ఈ సినిమాలో ఆయన సరసన రకుల్ ప్రీత్‌సింగ్ నటించారు. శ్రీవాస్ దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుక ఈ ఆదివారం విజయవాడలో జరగనుంది. అనూప్ రూబెన్స్ స్వరాలందించారు. ఈ నెల 26నే ఈ సినిమా విడుదల కానుంది.