breaking news
Lakkireddy palli
-
ఎన్నికల నామినేషన్లు.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి హల్చల్
సాక్షి, అన్నమయ్య జిల్లా: ఏపీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని పాతరేసేందుకు చంద్రబాబు డైరెక్షన్లో పచ్చముఠాలు బరితెగిస్తున్నాయి. ఓటమి భయంతో ప్రజాతీర్పును ఎదుర్కొనే ధైర్యం లేక ప్రత్యర్థులను పోటీకి దూరం చేయడమే లక్ష్యంగా కుట్రలకు తెరతీశారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి హల్చల్ చేశారు.వివరాల మేరకు.. లక్కిరెడ్డిపల్లి మండలం కోనంపేట నామినేషన్ కేంద్రంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆదివారం ఉదయం నామినేషన్ కేంద్రంలోకి ప్రవేశించి అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించివేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.మరోవైపు.. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో కూడా టీడీపీ గూండాలు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళ్లడంతో వారిని టీడీపీ మూకలు అడ్డుకున్నారు. అభ్యర్థులను అడ్డుకున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ పచ్చ బ్యాచ్‌ను పట్టించుకోలేదు. ఇదే సమయంలో పలుచోట్ల పోలీసుల బైండోవర్లు, అక్రమ నిర్బంధాలు, అధికారుల తనిఖీల పేరుతో వైఎస్సార్సీపీ అభ్యర్థులను వేధింపులకు గురిచేస్తున్నారు. ఇలా అడుగడుగునా అధికార బలాన్ని ప్రయోగిస్తూ ఎన్నికల స్వేచ్ఛను కాలరాస్తున్నారు.నామినేషన్ కేంద్రాల కుదింపు మొదలు ప్రత్యర్థులపై దాడుల వరకు అన్నింటా ప్రజాస్వామ్య హక్కులకు సంకెళ్లు వేస్తున్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అనుసరించిన బెదిరింపులు, దౌర్జన్యాలు, అక్రమాలనే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ పునరావృతం చేస్తున్నారు. ప్రజలు ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన ఎన్నికలను టీడీపీ నేతలు తమకు నచ్చిన వారిని ఏకగ్రీవంగా ప్రకటించుకునే ప్రక్రియగా మార్చేస్తున్నారు. ఓటుతో ప్రజాతీర్పు వెలువడాల్సిన పల్లెల్లో.. బెదిరింపులు, దౌర్జన్యాలు, వేలంపాటలతో అధికార పార్టీ తన ఆధిపత్యాన్ని రుద్దుతోంది.ఇదీ చదవండి: ఇక్కడా ఏకగ్రీవాలే లక్ష్యమా? -
యజమానినే బురిడీ కొట్టించాలని చూసి..
లక్కిరెడ్డిపల్లి (వైఎస్సార్ జిల్లా) : యజమానిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన ముగ్గురు డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా లక్కిరెడ్డిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆంజనేయరాజు తన ప్రైవేటు బస్సులను అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం కొందరు వ్యక్తులు ఆంజనేయరాజును కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. తనను వదిలేస్తే డబ్బులు తెచ్చి ఇస్తానని కిడ్నాపర్ల చెర నుంచి బయటపడిన రాజు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు అనంతరం రాజు వద్ద డ్రైవర్లుగా పనిచేసినవారే కిడ్నాప్ చేశారని గుర్తించారు. వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.


