breaking news
Lady oriented
-
భయపెట్టే అందాల భామలు
హీరోయిన్లు అంటే తెరపై అందంగా కనిపించడం... హీరోలతో పాటల్లో ఆడిపాడటం... అనే ధోరణి ప్రేక్షకుల్లో ఉంది. అయితే ఇటీవల ట్రెండ్ మారింది. తామేమీ తక్కువ కాదంటూ లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు పచ్చజెండా ఊపుతున్నారు కథానాయికలు. యాక్షన్ సినిమాల్లోనే కాదు... ప్రేక్షకులను భయపెట్టే హారర్ చిత్రాల్లో నటించేందుకు కూడా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం రష్మికా మందన్నా, తమన్నా, పూజా హెగ్డే, నిధీ అగర్వాల్, అనూ ఇమ్మాన్యుయేల్, ఆండ్రియా, సమీరా రెడ్డి... వంటి పలువురు అందమైన భామలు థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆ విశేషాలు...డబుల్ ధమాకా ‘ఛలో’ (2018) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు హీరోయిన్ రష్మికా మందన్నా. తొలి చిత్రంతోనే హిట్ అందుకున్న ఈ కన్నడ బ్యూటీ టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అంతేకాదు... తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటున్న రష్మిక నేషనల్ క్రష్‌గా మారారు. ఇప్పటివరకూ తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన రష్మిక ఒకేసారి రెండు చిత్రాల ద్వారా ప్రేక్షకులను భయపెట్టనున్నారు. ‘థామా, మైసా’ వంటి హారర్ సినిమాల ద్వారా ఆడియన్స్‌కి డబుల్ ధమాకా ఇవ్వనున్నారామె.రష్మికా మందన్న లీడ్ రోల్లో ‘మైసా’ అనే సినిమా రూపొందుతోంది. డైరెక్టర్ హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పుల్లె ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. అజయ్, అనిల్ సయ్యపురెడ్డి ఈ సినిమానిపాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఇటీవల తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. గోండు తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని ఎమోషనల్, హారర్, యాక్షన్ థ్రిల్లర్‌గా ‘మైసా’ రూపొందుతోంది. ఈ చిత్రంలో రష్మిక గోండు మహిళగా కనిపించనున్నారు.అదే విధంగా రష్మికా మందన్నా లీడ్ రోల్లో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘థామా’. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా ప్రధానపాత్ర పోషిస్తున్నారు. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ‘స్త్రీ’ యూనివర్స్‌లో నాలుగో చిత్రంగా ‘థామా’ని నిర్మిస్తున్నారు దినేష్ విజయన్. గతంలో వచ్చిన ‘భేడియా, స్త్రీ, ముంజ్య’ చిత్రాలు ప్రేక్షకులను బాగా అలరించడంతో ‘థామా’పై భారీ అంచనాలున్నాయి. అతీంద్రియ శక్తులతో కూడిన ఈ హారర్ రొమాంటిక్ చిత్రంలో తడ్కాపాత్రలో రష్మిక నటిస్తున్నారు. హారర్, మిస్టరీ అండ్ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న ‘థామా’ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. సిద్ధంగా ఉండండి ఓ వైపు హీరోయిన్గా, మరోవైపు లీడ్ రోల్స్ చేస్తూనే ప్రత్యేకపాటల్లోనూ సందడి చేస్తుంటారు తమన్నా. తెలుగులో ఆమె లీడ్ రోల్లో నటించిన ‘ఓదెల 2’ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 17న విడుదలైంది. ఆ తర్వాత ఆమె మరో తెలుగు చిత్రానికి పచ్చజెండా ఊపకపోయినా బాలీవుడ్లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో తమన్నా నటిస్తుండగా అందులో ‘వి వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ అనే చిత్రంలో ప్రధానపాత్రలో నటిస్తున్నారామె.అరుణాభ్ కుమార్, దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా కీలకపాత్ర పోషిస్తున్నారు. మైథలాజికల్ హారర్, జానపద థ్రిల్లర్ జానర్లో అడవి నేపథ్యంలో ఈ చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్, ది వైరల్ ఫీవర్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.ఆ మధ్య ఈ సినిమా టీజర్ విడుదలైంది. రాత్రి వేళ ఎర్రటి చీర ధరించిన తమన్నా కారు దిగి అడవిలోకి వెళ్లి, అక్కడ ఓ దీపం వెలిగించడం, అక్కడ ఏదో దృశ్యాన్ని చూసి కళ్లు పెద్దవి చేయడం వంటి విజువల్స్ ఈ వీడియోలో కనిపించాయి. ‘అడవి పిలిచింది. నేను సమాధానం చెప్పాను. ‘వి వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’లో భాగం కావడం థ్రిల్లింగ్‌గా ఉంది. ఆ అడ్వంచర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ తమన్నా పేర్కొన్న విషయం విదితమే. ఈ సినిమా 2026 మే 15న విడుదల కానుంది.తొలిసారి హారర్ చిత్రంలో... ‘మజ్ను, అజ్ఞాతవాసి, శైలజారెడ్డి అల్లుడు, ఊర్వశివో రాక్షసివో, రావణాసుర’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు అనూ ఇమ్మాన్యుయేల్. ఇప్పటివరకూ కమర్షియల్ సినిమాల్లో సందడి చేసిన ఈ బ్యూటీ తొలిసారి ‘బూమరాంగ్’ అనే హారర్ చిత్రంలో నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.లండన్ గణేశ్, డా. ప్రవీణ్ రెడ్డి ఊట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హారర్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్‌ని లండన్‌లోని పలు ప్రదేశాల్లో జరిపారు. ‘‘సైకలాజికల్ థ్రిల్లర్, హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘బూమరాంగ్’. కర్మ సిద్ధాంతం ఆధారంగా ఈ చిత్రకథ సాగుతుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని మేకర్స్ తెలిపారు. ఇప్పటివరకు కమర్షియల్ హీరోయిన్గా సందడి చేసిన అనూ ఇమ్మాన్యుయేల్ ‘బూమరాంగ్’ ద్వారా ప్రేక్షకులను ఏ మేర భయపెడతారో వేచి చూడాలి.మొదటిసారి... ‘సవ్యసాచి’ (2018) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు నిధీ అగర్వాల్. ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో, హరి హర వీరమల్లు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారామె. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిధీ అగర్వాల్ మొదటిసారి ఓ గ్రిప్పింగ్ హారర్ సినిమాలో నటించేందుకు పచ్చజెండా ఊపారు. ఈ సినిమా ద్వారా ఎన్. నిఖిల్ కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.పుప్పాల అప్పలరాజు నిర్మిస్తున్న తొలి చిత్రమిది. ఈ నెల 17న నిధీ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ప్రకటించి, ఓ స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘నిధీ అగర్వాల్ నటిస్తున్న తొలి గ్రిప్పింగ్ హారర్ థ్రిల్లర్ సినిమా ఇది. ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. టాప్ టెక్నికల్ స్టాండర్డ్స్, హై ప్రోడక్షన్ వాల్యూస్‌తో ఈ మూవీ ఆడియన్స్‌కి విజువల్లీ స్ట్రాంగ్, ఎమోషనల్‌గా ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది. ఈ సినిమా నిధీ కెరీర్లో ఓ మైలురాయి అవుతుంది. మా ప్రోడక్షన్ హౌస్‌లో ఆమె జాయిన్ అవ్వడం మాకు ఆనందం కలిగిస్తోంది. బిగ్ స్క్రీన్‌పై ఆమె చూపించబోయే మేజిక్ కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. ఈ సినిమా టైటిల్ దసరాకి రివీల్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ తెలిపింది. రెండో పిశాచి ... ఓ సినిమా హిట్ అయిందంటే చాలు... ఆ చిత్రానికి సీక్వెల్ ΄్లాన్ చేస్తున్నారు మేకర్స్. మిస్కిన్ దర్శకత్వం వహించిన హారర్ చిత్రం ‘పిశాచి’ 2014లో విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా తాజాగా ‘పిశాచి 2’ రూపొందించారు మిస్కిన్. ఈ మూవీలో ఆండ్రియా లీడ్ రోల్లో నటించారు. విజయ్ సేతుపతి, పూర్ణ, అజ్మల్ అమీర్ ఇతరపాత్రలు పోషించారు. మురుగానందం నిర్మించారు. ఇప్పుటికే పలు హారర్ బ్యాక్‌డ్రాప్ మూవీస్‌లో నటించిన ఆండ్రియా ‘పిశాచి–2’లోనూ తనదైన నటనతో ప్రేక్షకులను భయపెట్టనున్నారు.ఈ చిత్రంలో ఆమెపాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని సమాచారం. అంతేకాదు... కథకు అవసరం రీత్యా ఈ సినిమాలో ఆండ్రియా బోల్డ్‌గా నటించారని, ఓ సన్నివేశంలో నగ్నంగా నటించారనే వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని డైరెక్టర్ మిస్కిన్ ధ్రువీకరించారు. ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే రిలీజ్ విషయంలో పలు అడ్డంకులు రావడంతో ‘పిశాచి 2’ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయంపై స్పష్టత లేదు. హారర్ చిత్రంతో రీ ఎంట్రీ ‘నరసింహుడు, జై చిరంజీవ, అశోక్’ వంటి తెలుగు చిత్రాల్లో నటించి, ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు సమీరా రెడ్డి. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అశోక్’ (2006) చిత్రం తర్వాత ఆమె తెలుగులో నటించలేదు. అయితే క్రిష్ దర్శకత్వంలో రానా హీరోగా వచ్చిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ (2012) సినిమాలో మాత్రం ప్రత్యేకపాటలో చిందేశారామె. ఆ తర్వాత నటించలేదు. 2014లో అక్షయ్ వర్దేతో ఏడడుగులు వేసిన ఈ బ్యూటీ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. పెళ్లి, పిల్లలు కారణంగా నటనకు దూరమైన సమీర 13 సంవత్సరాల తర్వాత హిందీ చిత్రం ‘చిమ్నీ’తో రీ ఎంట్రీ ఇస్తున్నారు.అది కూడా ఓ హారర్ మూవీతో కావడం విశేషం. ఔట్ అండ్ ఔట్ హారర్ మూవీగా రూపొందుతోన్న ‘చిమ్నీ’కి గగన్ పూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘చిమ్నీ’ టీజర్ సినిమాపై ఉత్కంఠత పెంపొందించింది. ఈ సినిమా గురించి సమీరా రెడ్డి మాట్లాడుతూ– ‘‘చిమ్నీ’లాంటి హారర్ సినిమాని నేనెప్పుడూ చేయలేదు. గతంలో ‘డర్నా మనా హై’మూవీలో చేశాను.అయితే కేవలం అందులో నాది నెరేటర్పాత్ర మాత్రమే. ఆ రకంగా నేను నటిస్తున్న తొలి హారర్ మూవీ ‘చిమ్నీ’ అనుకోవచ్చు. 13 సంవత్సరాల తర్వాత తిరిగి షూటింగ్లోపాల్గొనడం కాస్తంత నెర్వస్‌గా ఫీల్ అయ్యాను. కానీ కెమెరా ఆన్ కాగానే నాలోనిపాత నటి తిరిగి బయటకు వచ్చేసింది’’ అని తెలిపారు. ఇదిలా ఉంటే.. సమీరా రెడ్డి ఇరవై యేళ్ల క్రితం నటించిన ‘నామ్’ అనే హిందీ సినిమా గత యేడాది నవంబరు 22న విడుదల కావడం విశేషం. కాంచన 4లో... అందం, అభినయంతో ఇప్పటివరకూ కమర్షియల్ సినిమాల్లో హీరోల సరసన సందడి చేస్తూ ప్రేక్షకులను అలరించిన పూజా హెగ్డే తొలిసారి హారర్ నేపథ్యంలో రూపొందుతున్న ‘కాంచన 4’ సినిమాలో నటించనున్నారు. నాగచైతన్య హీరోగా ‘ఒక లైలా కోసం’ (2014) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రభాస్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోలందరితో నటించారు. ‘ఎఫ్ 3’ (2022) సినిమాలో ప్రత్యేకపాటలో నటించిన ఆమె ఆ తర్వాత ఏ తెలుగు చిత్రంలోనూ నటించలేదు.అయితే హిందీ, తమిళ సినిమాల్లో మాత్రం నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే... ‘ముని, కాంచన’ హారర్ సిరీస్‌లో రానున్న ‘కాంచన 4’ చిత్రంలో ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇప్పటివరకూ పోషించనటువంటి సరికొత్తపాత్రలో పూజ నటిస్తున్నారని కోలీవుడ్ టాక్. ఈ చిత్రంలో ఆమెది ఓ సవాల్‌తో కూడుకున్నపాత్ర అనే వార్తలు వినిపిస్తున్నాయి.మూగ, చెవిటి అమ్మాయిపాత్రలో కనిపించనున్నారట పూజా హెగ్డే. ఇంతకీ ఈ చిత్రంలో ఆమెపాత్ర ఏంటి? అన్నది తెలియాలంటే చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫుల్ హారర్ నేపథ్యంలో వచ్చిన ‘ముని, కాంచన, కాంచన 2, కాంచన 3’ సినిమాలు మంచి విజయం సాధించడంతో ‘కాంచన 4’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.హారర్ మూవీతో తమిళ్లో ఎంట్రీ... నోరా ఫతేహి... పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, హిందీ, మలయాళ చిత్రాల్లో ప్రత్యేకపాటలతో తనదైన డ్యాన్సులతో కుర్రకారుని ఉర్రూతలూగించారామె. తెలుగులో ‘టెంపర్, బాహుబలి: ది బిగినింగ్, కిక్, షేర్, లోఫర్, ఊపిరి’ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేశారామె. కాగా ‘కాంచన 4’ వంటి హారర్ సినిమాతో నోరా ఫతేహి తమిళ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘‘కాంచన 4’కి అవకాశం వచ్చినప్పుడు తమిళ ఇండస్ట్రీకి పరిచయం కావడానికి ఇదే సరైనcజెక్టు అనుకున్నా. స్క్రిప్టు బాగా నచ్చింది. పైగా ‘కాంచన’ ఫ్రాంచైజీకి ప్రేక్షకుల్లో గొప్ప ఆదరణ ఉంది. ‘మడ్గావ్ ఎక్స్‌ప్రెస్’ తర్వాత అలాంటి జానర్ మూవీ చేయాలనుకున్నప్పుడు ‘కాంచన 4’ అవకాశం దక్కింది. కొత్త భాషలో నటించడం సవాలే. కానీ, నేను సవాళ్లను ఇష్టపడతాను. హారర్ అండ్ కామెడీ సీన్స్‌లో నా నటనను, డాన్స్ స్కిల్స్‌ను ప్రదర్శించడానికి ఇది నాకు సరైనcజెక్ట్ అని నా అభి్రపాయం. ‘కాంచన 4’లో లారెన్స్, పూజా హెగ్డేలతో నటించడం చాలా సంతోషంగా ఉంది’’ అని నోరా ఫతేహి చెప్పారు. పై తారలే కాదు... మరికొందరు హీరోయిన్లు కూడా హారర్ చిత్రాల ద్వారా ప్రేక్షకులను భయపెట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు. బాలీవుడ్లో లేడీ ఫైర్ బ్రాండ్ అనగానే హీరోయిన్ కంగనా రనౌత్ గుర్తొస్తారు. నటిగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం బీజేపీ పార్టీ నుంచి లోక్‌సభ సభ్యురాలిగా గెలుపొంది తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. కాగా కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ మూవీ ఈ ఏడాది జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక΄ోతే.. తాజాగా ఆమె ‘బ్లెస్డ్ బై ది ఈవిల్’ అనే ఓ హాలీవుడ్ సినిమాలో నటించనున్నారు. అనురాగ్ రుద్ర దర్శకత్వం వహించనున్న ఈ హారర్ డ్రామా సినిమాలో ఆమె కీలక పాత్రపోషించనున్నారు. ఓ జంటని దుష్ట శక్తి ఎలాంటి తిప్పలు పెట్టిందనే కథాంశం చుట్టూ ఈ సినిమా ఉంటుందట. అతీంద్రియ శక్తులు, జానపద కథల నేపథ్యంలో అనురాగ్ రుద్ర తీర్చిదిద్దనున్నారని టాక్. టైలర్పోసీ, స్కార్లెట్ రోజ్ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలుపోషించనున్నారు. లయన్ మూవీస్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ న్యూయార్క్‌లో మొదలు కానుందని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ దాదాపు అమెరికాలోనే జరగనుంది. కంగనా రనౌత్ ఎంపీగా గెలుపొందిన తర్వాత ఒప్పుకున్న చిత్రం ‘బ్లెస్డ్ బై ది ఈవిల్’ కావడం విశేషం. -
మరో లేడీ ఓరియంటెడ్ మూవీలో...
విజయ్ సేతుపతి కెరీర్‌లోని 50వ సినిమా ‘మహారాజ’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. ‘మహారాజ’కు బాక్సాఫీస్ పరంగా మంచి వసూళ్లు, సినీ విమర్శకుల పరంగా అభినందనలు రావడంతో నితిలన్కు అవకా శాలు క్యూ కడుతున్నాయి.ఈ క్రమంలోనే నయనతారకు నితిలన్ ఓ లేడీ ఓరియంటెడ్ స్టోరీ చెప్పారని, బేసిక్ ప్లాట్ నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు ఆమె సానుకూలంగా ఉన్నారని టాక్. దీంతో స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారట నితిలన్. సో.. నయనతార మరో లేడీ ఓరియంటెడ్ మూవీలో కనిపిస్తారన్న మాట. -
రేణూ రీ ఎంట్రీ
‘బద్రి, జానీ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రేణూ దేశాయ్ ‘ఆద్య’ అనే ఒక పవర్ఫుల్ లేడీ ఓరియంటెడ్ ప్యాన్ ఇండియా చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుడుతున్నారు. ఈ సినిమాతో ఎం.ఆర్. కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డి.ఎస్.కె. స్క్రీన్–సాయికృష్ణ ప్రొడక్ష¯Œ ్స బ్యానర్స్‌పై రావ్. డి.ఎస్–రజనీకాంత్. ఎస్ నిర్మించనున్నారు. ‘హుషారు’ ఫేమ్ తేజ కురపాటì,, గీతికా రతన్ జంటగా నటించనున్న ఈ చిత్రంలో ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక, నందినీ రాయ్ ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ .ఎస్ మాట్లాడుతూ– ‘‘విజయదశమి రోజున మా ‘ఆద్య’ సినిమా ప్రారంభిస్తాం. రేణూ దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అన్నారు. బాలీవుడ్ హీరో వైభవ్ తత్వవాడి ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర దాశరధి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ చైతన్యరెడ్డి .ఎస్. -
లేడీ పోలీస్
ఈ ఏడాది కొరియన్ కథతో ‘ఓ బేబి’ (కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’కి తెలుగు రీమేక్) వంటి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు సమంత. లేడీ ఓరియంటెడ్ సినిమాగా సమంత కెరీర్లో పెద్ద హిట్ సినిమా అనిపించుకుంది ‘ఓ బేబి’. ఇప్పుడు నయనతార కూడా ఓ కొరియన్ కథలో నటించడానికి అంగీకరించారని తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ లేడీ ఓరియంటెడ్ సినిమా తెరకెక్కనుందట. ఈ చిత్రాన్ని హీరో రానా నిర్మిస్తారట. ఇందులో నయనతార పోలీస్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
యాసిడ్ బాధితురాలిగా..
అదుగో ఇదిగో అంటూ సమయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కానీ తన తాజా సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై మాత్రం దీపికా పదుకోన్ స్పష్టత ఇవ్వడం లేదు. అయితే ‘తల్వార్, రాజీ’ చిత్రాల ఫేమ్ మేఘనా గుల్జార్ దర్శకత్వంలో దీపిక ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటించబోతున్నారని బీటౌన్‌లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన లక్ష్మీ అగర్వాల్ అనే యాసిడ్ బాధితురాలి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని, షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలవుతుందని బాలీవుడ్లో ఓ వార్త షికారు చేస్తోంది. పదిహేనేళ్ల వయసులో యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ ఆ తర్వాత యాసిడ్ దాడులను ఆపేందుకు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. జీవితంలో జరిగిన చేదు ఘటనకు కుమిలిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతోన్న లక్ష్మీ అగర్వాల్ చాలామందికి స్ఫూర్తినిస్తుందని దీపిక భావిస్తున్నారు. అందుకే ఆమె జీవితకథలో నటించబోయే ఈ సినిమాకు సహ–నిర్మాతగా కూడా వ్యవహరిస్తారట. ఆల్రెడీ ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ నిర్మాణ సంస్థలు ప్రారంభించారు. ఇప్పుడు దీపికా. -
ఇది ఆట కాదు ఖో ఖో!
చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ‘ఖో ఖో’ ఆట గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు నయనతార లీడ్ రోల్ చేయనున్న ఓ సినిమాకి ఇదే టైటిల్ పెట్టారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా కాదిది. మరి.. ‘ఖో ఖో’ అని టైటిల్ ఎందుకు పెట్టినట్లు? అంటే... టైటిల్ వెనక అసలు కారణం తెలియడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. ఎందుకంటే, నయనతారతో ఈ సినిమా తీయనున్న లైకా ప్రొడక్షన్స్ ప్రస్తుతానికి పెద్దగా వివరాలేం బయటపెట్టలేదు. ‘డార్క్ కామెడీ’ నేపథ్యంలో సినిమా ఉంటుందని మాత్రం పేర్కొన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో 2.0’ నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ ‘ఖో ఖో’ని కూడా భారీ బడ్జెట్‌తో నిర్మించనుందట. అఫ్కోర్స్ ‘2.0’ అంత భారీ బడ్జెట్ కాకపోయినా, లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఎక్కువ బడ్జెట్‌తో రూపొందే సినిమా అవుతుందట. -
1818కు ఓకే చెప్పిన చెన్నై చిన్నది
చేతి నిండా చిత్రాలతో నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు చెన్నై చిన్నది త్రిష. కోలీవుడ్‌లో నయనతార తరువాత హీరోయిన్ఓరియంటెడ్ చిత్రాలు ఈ బ్యూటీనే వరిస్తున్నాయి. ఇప్పటికే నాయకి అనే కథానాయకికి ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించిన త్రిష మోహిని అనే మరో చిత్రంలో హీరోయిన్ సెంట్రిక్ పాత్రను పోషిస్తున్నారు. త్వరలో విజయ్‌సేతుపతికి జంటగా 96 అనే చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్న త్రిషకు మరో లేడీ ఓరియంటెడ్ కథా చిత్రంలో నటించే అవకాశం వరించింది.1818 అనే చిత్రంలో నాయకిగా నటించడానికి ఈ బ్యూటీ పచ్చజెండా ఊపారు. మైండ్ డ్రామా పతాకంపై రితున్ సాగర్ దర్శక, నిర్మాతగా తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఇది 2008లో ముంబైలో జరిగిన తీవ్రవాదుల మారణకాండ ఇతివృత్తంగా రూపొందించనున్న చిత్రం అని చెప్పారు. చిత్రం ఆధ్యంతం ఆసక్తిగా జెట్ స్పీడ్‌లో సాగుతుందన్నా రు. త్వరలో చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందులో త్రిషతో పాటు సుమన్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానం దం, సూదుకవ్వుం చిత్రం ఫేమ్ రమేశ్, తిలక్, రాజారాణి చిత్రం ఫేమ్ మీరా ఘోషల్ ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ 1818 చిత్రానికి ఎస్ఎస్.తమన్ సంగీతాన్ని, మదన్ కార్గీ పాటలను అందిస్తున్నారు. -
మలయాళ చిత్ర రీమేక్‌లో త్రిష
మలయాళ చిత్ర రీమేక్‌లో నటించే లక్కీచాన్స్ సంచల నటి త్రిషను వరించిందన్నది తాజా సమాచారం. ఇంతకు ముందు కమర్శియల్ కథా చిత్రాలను చేసిన ఈ చెన్నై చిన్నది ఇటీవల లేడీ ఓరియెంటెడ్ చిత్రాలనే వరుసగా చేస్తున్నారు. నాయకి చిత్రం తరువాత ప్రస్తుతం మోహిని చిత్రం చేస్తున్నారు. విదేశాల్లో చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ హారర్ కథా చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా మరో చిత్రానికి త్రిష పచ్చజెండా ఊపారు. రెండేళ్ల క్రితం విడుదలై మంచి విజయాన్ని సాధించిన మలయాళ చిత్రం 100 డిగ్రీ సెల్సియస్‌ను తమిళంలోకి రీమేక్ చేయనున్నారు. అక్కడ రోషన్ గొప్పన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందించారు. నటి శ్వేతామీనన్, భామ, మేఘ్నారాజ్, అనన్య, హరిత ఐదుగురు నటీమణులు నటించిన ఈ మహిళా ఇతివృత్తంతో కూడిన కథా చిత్రాన్ని రీమేక్ దర్శక కింగ్‌గా పేరు పొందిన మిత్రన్ జవహర్ తమిళంలో దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు తెలుగులో హిట్ అయిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, రెడీ చిత్రాలను యారడీ నీ మోహినీ, ఉత్తమ పుత్రన్ పేర్లతో తమిళంలో దర్శకత్వం వహించారు. అదే విధంగా ఇటీవల మలయాళ చిత్రం తల్లయన్ మరయత్తు చిత్రాన్ని తమిళంలో మీండుం ఒరు కాదల్ కథై పేరుతో దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. తాజాగా 100 డిగ్రీ సెల్సియస్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో ప్రస్తుతానికి త్రిష, రాయ్‌లక్ష్మీ నాయకిలుగా ఎంపికయ్యారని సమాచారం. ఇతర నటీమణుల ఎంపిక పూర్తి కాగానే షూటింగ్‌కు సిద్ధం కానున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. -
ఆమె పారితోషికంతో చిన్న చిత్రం చేయొచ్చు
నయనతార పారితోషికం అంతా అని సహ నటీమణులు విస్మయం చెందేంతగా వెలిగిపోతోంది ఆ కేరళ భామ. అదృష్టం అన్న విషయాన్ని పక్కన పెడితే పట్టుదల+నిరంతర కృషి+శ్రమ=విజయం ఒక మనిషి ఎదుగుదలకు సూత్రం ఇదే.నటి నయనతారకు ఇది కరెక్ట్‌గా వర్తిస్తుంది. ఒకానొక టైమ్‌లో నటనకు గుడ్‌బై చెప్పిన ఈ బ్యూటీ తన జీవితంలో జరిగిన అనూహ్య పరిణామాల కారణంగా మళ్లీ నటనను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ కారణం ఎమిటన్నది చాలా మందికి తెలిసిందే కాబట్టి అది ఇప్పుడు అప్రస్తుతం. సాధారణంగా సెకెండ్ ఇన్నింగ్స్‌లో పూర్వవైభవాన్ని సాధించడం అన్నది అసాధ్యం కాకపోయినా అంత సులభం మాత్రం కాదు.అయితే ఈ విషయంలో నయనతార సాధించారు. ఇంకా చెప్పాలంటే తొలి ఇన్నింగ్స్ క్రేజ్‌ను అధిగమించారని చెప్పాలి. రెండో ఇన్నింగ్‌లోనూ నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న రేర్ నాయకి నయనతార. వరుస విజయాలే ఆమె క్రేజ్‌కు కారణం అని చెప్పవచ్చు. హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలతో పాటు,వర్ధమాన హీరోలతో నటించిన చిత్రాలను తన పాపులారిటీతో సక్సెస్ బాట పట్టించడంతో నయనతార హవా నిర్విఘ్నంగా కొనసాగుతోంది.ఆ క్రేజ్‌ను నయనతార బాగా ఉపయోగించుకుంటున్నారు. పెద్ద మొత్తంలో పారితోషికాన్ని రాబట్టుకుంటున్నారు. ఇప్పటి ఆమె పారితోషకం సహ నటీమణులకు గుండెల్లో గుబులు పుట్టిస్తోందని చెప్పవచ్చు. గత ఏడాది వరకూ కోటి రూపాయలు డిమాండ్ చేసిన ఈ కేరళ కుట్టి తాజాగా ఏకంగా మూడు కోట్లకు పెంచేశారని సమాచారం. దర్శకుడు సర్గుణం తన శిష్యుడు దాస్ రామసామిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రంలో నయనతారనే నాయకి. ఈ లేడీఓరియెంటెడ్ కథా చిత్రంలో నటించడానికి ఆమె అందుకుంటున్న పారితోషికం అక్షరాలా మూడు కోట్లని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇదే నిజమైతే తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ నయనతారనే అవుతారు. అంతేకాదు ఒక స్థాయి హీరోలకు కూడా ఇంత పారితోషికం పొందడం లేదన్నది నిజం. ఇంకా చెప్పాలంటే ఒక్క నయనతార పారితోషికంతో చిన్న బడ్జెట్ చిత్రం రూపొందించవచ్చు అనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. -
సెల్యులాయిడ్ శక్తి స్వరూపిణి
తెలుగు సినిమా పుట్టి 83 ఏళ్లు. వేల సినిమాలొచ్చాయి. కానీ, వాటిల్లో స్త్రీ శక్తి ప్రధానమైన చిత్రాలు తక్కువే. గడచిన పాతికేళ్లలో అయితే అది మరీ పలచబడి పోయింది. రాశి తక్కువైనా వాసిలో గొప్పవైన అలాంటి తొమ్మిది సినిమాల గురించి... ఈ నవరాత్రుల్లో... కర్తవ్యం (1990) - స్త్రీ పాత్రలన్నీ ప్రేమ, పెళ్ళి లాంటి అంశాల చుట్టే తిరుగుతున్న టైమ్‌లో తెలుగు తెరపై లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కొత్త ఊపు తెచ్చిన చిత్రం. సమకాలీన సమాజంలోని కిరణ్ బేడీ జీవితం స్ఫూర్తితో అల్లుకున్న ఈ లేడీ ఐ.పి.ఎస్. ఆఫీసర్ కథ ఉత్తేజపూరిత అనుభవం. తెలుగు, తమిళం, హిందీ - ఇలా ఎక్కడకు వెళ్ళినా హిట్టే. ఈ కథతో ‘షీ మ్యాన్’ పాత్రలకు విజయశాంతి కేరాఫ్ అడ్రసయ్యారు. ‘లేడీ అమితాబ్’ పట్టంతో పాటు, కోటి పారితోషికం తీసుకున్న తొలి తెలుగు హీరోయిన్ అయ్యారు. అశ్వని (1991) - ఇటీవల హిందీలో వస్తున్న అనేకానేక జీవితకథా చిత్రాలకూ, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకూ చాలా ముందే పాతికేళ్ళ క్రితం తెలుగులో చేసిన ప్రయత్నం. జాతీయ చాంపియన్ అయిన భారతీయ అథ్లెట్ అశ్వినీ నాచప్ప జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ఇది. అశ్వినితోనే ఆ పాత్రను పోషింపజేయడం అప్పట్లో మరో సంచలనం. ప్రతిభను పసిగట్టి సానపెట్టేవాళ్ళుంటే స్త్రీలేమీ తక్కువకారని చాటిచెప్పిన స్ఫూర్తిదాయక చిత్రం. అమ్మోరు (1995) - మామూలు మనుషుల్ని తట్టుకోవడమే కష్టం. అలాంటిది ఆమె దుష్టశక్తితోనే తలపడాల్సి వచ్చింది. భర్త ఎక్కడో దూరంగా ఉన్నాడు. ఉన్నదల్లా అమ్మోరు తల్లి అండ. ఆ నమ్మకంతోనే కష్టాలన్నీ భరించింది. ఇలాంటి కథలు చాలా వచ్చి ఉండొచ్చు. గ్రాఫిక్స్‌తో డీల్ చేయడమే వండర్. సౌందర్య యాక్టింగ్ లేడీస్ ఫాలోయింగ్ తెచ్చింది. ఒసేయ్... రాములమ్మా! (1997) - తెలంగాణలోని మహిళా విప్లవాన్ని తెరపై చూపెట్టిన ‘ఎర్ర’ సినిమా. దొరల సంస్కృతిపై ఎక్కుపెట్టిన సెల్యులా యిడ్ గన్. మాదాల రంగారావు, ఆర్. నారాయణమూర్తి తరహా సినిమాలకు దాసరి నారాయణరావు ఇచ్చిన పర్ఫెక్ట్ బాక్సాఫీస్ క్లైమాక్స్ - ఈ సూపర్ హిట్ సినిమా. ‘ప్రజా యుద్ధ నౌక’లుగా నిలిచిన విప్లవ గాయకుల జీవిత స్ఫూర్తి, మహిళా ఉద్యమకారుల చైతన్యదీప్తి కలగలిసి, ‘వందేమాతరం’ శ్రీనివాస్ స్వరం, సుద్దాల అశోక్‌తేజ కలం పదును రుచిచూపెట్టాయి. విజయశాంతి రాజకీయజీవిత ఆకాంక్షలకు ఊపిరిలూదిన పాస్‌పోర్ట్ ఈ ఫిల్మ్. అంతఃపురం (1999) - ప్రేమ తప్ప ఇంకేమీ తెలియని, కుటుంబం తప్ప ఇంకేం వద్దనుకునే అమ్మాయి. ఆమె జీవితంలో ఊహించని పరిణామం. కుట్రలూ కుతంత్రాలూ రక్తపాతాలూ మారణహోమాలు నిండిన లోకంలోకి వచ్చి పడింది. కుందేలు పిల్ల కాస్తా శివంగిలా మారింది. కృష్ణవంశీ తీసిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్. సౌందర్య నటించలేదు. జీవించిందంతే. 9 నెలలు (2001) - ‘సరోగసీ’ (అద్దె గర్భం) ఇప్పుడు హాట్ టాపిక్. దీని గురించి క్రాంతికుమార్ 14 ఏళ్ల క్రితమే వెండితెరపై చర్చించారు. అప్పుడ ప్పుడే కెరీర్లో కుదురుకుంటున్న సౌందర్యకు పర్సనల్ శాటిస్ఫేక్షన్ ఇచ్చిన సినిమా. ముందే కూసిన ఈ కోయిల నిజానికి ఇప్పుడు రావాల్సింది.మిస్సమ్మ (2003) - కుటుంబాన్ని నొప్పి లేకుండా సుతిమెత్తగా డీల్ చేయగల స్త్రీ, ఒక కంపెనీని డీల్ చేయడం కష్టం కాదు. తన తర్వాత సంస్థకు వారసుణ్ణి ఎంపిక చేయడం కోసం ఓ స్త్రీ చేసిన అన్వేషణ, తపనే ఈ ‘మిస్సమ్మ’ సినిమా. భూమికకు ‘ఖుషీ’తో పేరొచ్చిందేమో కానీ, ఈ ‘మిస్సమ్మ’ మాత్రం ఆమెకు గ్రేట్ మెమరీగా నిలిచిపోతుంది. అరుంధతి (2009) - ఈ ఆధునిక సాంకేతిక యుగంలో విజువల్ ఎఫెక్ట్స్ పరిజ్ఞానాన్ని వినియోగించుకొని పాతకాలపు అంధ విశ్వాసాలను తెరపై ఆవిష్కరించిన హార్రర్ - ఫ్యాంటసీ ఫిల్మ్. తెలుగుతెరపై గ్రాఫిక్స్ శకానికి మొదటి నుంచి నారుపోసి నీరు పెడుతూ వచ్చిన నిర్మాత ఎం. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కలల పంట. కోడి రామకృష్ణ మార్కు దర్శకత్వ ప్రతిభ, అనుష్కలోని అపూర్వ అభినయ పార్శ్వం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులతో ‘వదల బొమ్మాళీ! వదల!’ అనిపించాయి. కోట్ల ఖర్చుకు పదుల కోట్ల వసూళ్ళు తెచ్చి, బాక్సాఫీస్ వద్దా మహిళలు మహారాణులేనని చూపింది. రుద్రమదేవి (2015) - మూడు దశాబ్దాల తరువాత తెలుగులో వచ్చిన భారీ హిస్టారికల్ ఫిల్మ్. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో అత్యంత భారీ ఖర్చు (రూ. 80 కోట్లు)తో తయారైన సినిమా. భారతదేశంలో గద్దెనెక్కి, రాజ్యమేలిన తొలి మహిళ రాణీ రుద్రమదేవి జీవిత కథ. దర్శక - నిర్మాత గుణశేఖర్ దాదాపు మూడేళ్ళు చేసిన భారీ 3డీ యజ్ఞం. లేడీ ఓరియెంటెడ్ కథలకు, క్లిష్టమైన పాత్రపోషణకు కొత్త చిరునామా అనుష్క కెరీర్లో కొత్త శిఖి పింఛం! -
మీనాకుమారిగా మనీషా!
-
స్త్రీ గొప్పతనం తెలిపే కథ
నేటి సమాజంలో పురుషుల కంటే స్త్రీలు అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు. ప్రేమ, త్యాగం, ధైర్యం, సహనం, సాహసం ఇవన్నీ మగవారి కంటే ఆడవారిలోనే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంతో రూపొందుతోన్న చిత్రం ‘లాక్’. సంతోష్, సారిక జంటగా నటిస్తున్నారు. పార్గవన్ దర్శకత్వంలో కె.లక్ష్మణమూర్తి నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి తమిళ నిర్మాత శ్రీమతి సెల్వి కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు చంద్రసిద్ధార్థ్ క్లాప్ ఇచ్చారు. వినోదంతో కూడిన చక్కని లేడీ ఓరియెంటెడ్ చిత్రమిదని నిర్మాత అన్నారు. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేస్తామనీ, వైజాగ్, అరకు, హైదరాబాద్‌ల్లో చిత్రీకరణ జరుపుతామనీ, తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాను విడుదల చేస్తామనీ దర్శకుడు తెలిపారు. చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కథ: రాజ్దొరై, మాటలు: కేశవ్ పప్పుల, సంగీతం: విజయ్ కూరాకుల, కెమెరా: శ్రవణ్‌కుమార్.