మరో లేడీ ఓరియంటెడ్‌ మూవీలో... | Nayanthara next lady oriented movie updates | Sakshi
Sakshi News home page

మరో లేడీ ఓరియంటెడ్‌ మూవీలో...

Jul 2 2024 3:03 AM | Updated on Jul 2 2024 12:04 PM

Nayanthara next lady oriented movie updates

విజయ్‌ సేతుపతి కెరీర్‌లోని 50వ సినిమా ‘మహారాజ’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వం వహించారు. ‘మహారాజ’కు బాక్సాఫీస్‌ పరంగా మంచి వసూళ్లు, సినీ విమర్శకుల పరంగా అభినందనలు రావడంతో నితిలన్‌కు అవకా శాలు క్యూ కడుతున్నాయి.

ఈ క్రమంలోనే నయనతారకు నితిలన్‌ ఓ లేడీ ఓరియంటెడ్‌ స్టోరీ చెప్పారని, బేసిక్‌ ప్లాట్‌ నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు ఆమె సానుకూలంగా ఉన్నారని టాక్‌. దీంతో స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారట నితిలన్‌. సో.. నయనతార మరో లేడీ ఓరియంటెడ్‌ మూవీలో కనిపిస్తారన్న మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement