breaking news
labour department funds
-
బోగస్‌పై చెరోదారి
కార్మీకుల బీమా పథకం అక్రమాల విచారణ అటకెక్కేసింది. శక్తి (కార్మిక) శాఖ మంత్రి లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ..ఆ శాఖ కార్యదర్శి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఈ విచారణ ప్రక్రియ నిలిచిపోయింది. కార్మీక బీమా పథకాల విచారణ విషయంలో మంత్రి పేషీ, కార్యదర్శి పేషీ మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. మరోవైపు మంత్రి స్వయంగా ఆదేశించినా.. వాటితో ఏమాత్రం సంబంధం లేకుండా శక్తి శాఖకు చెందిన పలు అంశాల విషయంలో శాఖ కార్యదర్శి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుండటంతో ఆ శాఖలో పరిస్థితి గందరగోళంగా మారింది. కొంత కాలంగా మంత్రి– కార్యదర్శి పేషీల మధ్య సమాచార వ్యవస్థలో అంతరాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లు సచివాలయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ఇంకోవైపు.. ఈ రెండు కార్యాలయాల మధ్య ఏర్పడిన అంతరంతో శక్తి శాఖలోని పలు విభాగాల్లో అక్రమాలు ఒక్కొక్కటి వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మీకుల సంక్షేమ బోర్డు (టీబీఓసీడబ్ల్యూడబ్ల్యూబీ) ద్వారా కార్మీకులకు వివిధ బీమా పథకాలు అమలవుతున్నాయి. ప్రమాదానికి గురై మరణించిన కార్మికులు, ప్రమాదంలో వైకల్యానికి గురైన వారికి ఈ బీమా పథకం కింద ఆర్థిక సాయం అందిస్తారు. అయితే ఈ పథకాల్లో గత కొంతకాలంగా నకిలీలు చొరబడ్డారు. ప్రమాదానికి గురి కాకు న్నా భారీగా బీమా డబ్బులు దండుకున్నారు.ఇందులో కొందరు అసిస్టెంట్ లేబర్ కమిషనర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ స్థాయి మొదలు జిల్లా స్థాయి అధికారులు కూడా ఉన్నారు. ఈ అంశంపై పత్రికల్లో వరుస కథనాలు రావడంతో యంత్రాంగం కదిలింది. మంచిర్యాల జిల్లాలో ఈ పథకాల అమలుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కార్మిక శాఖ ప్రాథమిక విచారణ చేపట్టింది. ఈ క్రమంలో పరిశీలించిన 15 వైకల్య ప్రయోజన క్లెయిమ్‌లూ బోగస్‌వని విచారణలో తేలింది.అలాగే 91 ప్రమాద మరణ ప్రయోజన క్లెయిమ్‌లను పరిశీలించగా 11 మాత్రమే వాస్తవమైనవిగా గుర్తించారు. మిగిలిన 80 క్లెయిమ్‌లు బోగస్‌గా నిర్ధారించారు. దీంతో అప్పటి మంచిర్యాల సహాయ కార్మిక కమిషనర్, మంచిర్యాల–1 సహాయ కార్మీక అధికారిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్ వేటు వేశారు. అదేవిధంగా టీబీఓసీడబ్ల్యూడబ్ల్యూబీ బోర్డు సీఈఓగా ఉన్న గంగాధర్‌ను బదిలీ చేయడంతో సరిపుచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా బోగస్ క్లెయిమ్‌లు..! కార్మీకుల ప్రమాద మరణ, వైకల్య ప్రయోజన బీమా పథకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం మంచిర్యాల జిల్లలో కొన్ని అనుమానాస్పద క్లెయిమ్‌లను ప్రాథమికంగా పరిశీలిస్తేనే దాదాపు రూ.4 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. వాస్తవానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లోనూ నకిలీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాలోనూ పెద్ద ఎత్తున బోగస్లున్నట్లు ఫిర్యాదులున్నాయి.ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ అవకతవకల నిగ్గు తేల్చాలని రాష్ట్ర శక్తి శాఖ మంత్రి జి.వివేక్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా కార్యదర్శికి నోటు పంపారు. అయితే శక్తి శాఖ కార్యదర్శి మాత్రం ఆ నోటును కేవలం మంచిర్యాల జిల్లాకు మాత్రమే పరిమితం చేస్తూ ఉత్తర్వులు రూపొందించారు. దీంతో ఆగ్రహించిన మంత్రి.. తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా విచారణకు మరోసారి ఆదేశించారు. మంత్రి ఆదేశించి రెండు నెలలైనా విచారణ ప్రక్రియ ప్రారంభం కాలేదు. అసలు విచారణ ఉత్తర్వులు సైతం రూపొందించకపోవడం గమనార్హం.అక్రమాలపై చర్యలేవీ?!శక్తి శాఖలోని పలు విభాగాల్లో వరుసగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో, డిస్పెన్సరీల్లో క్లీనింగ్, సెక్యూరిటీ కాంట్రాక్టులు, మందుల కొనుగోలు, రోగులకు కిట్ల పంపిణీ తదితరాల కొనుగోలులో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో భారీగా అక్రమాలు చోటుచేసుకున్న అంశాలను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. కార్మికుల కనీస వేతనాల అమలుపై ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపట్టినా అమలు కాకపోవడం, వీడీఏ పెంపు ప్రక్రియపై ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడంతో కార్మీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మంత్రి, శాఖ కార్యదర్శి మధ్య ఏర్పడిన గ్యాప్‌తో ఈ అక్రమాలపై చర్యలు తీసుకునేవారే కరువయ్యారు. కార్యదర్శికి సీఎంతో ఉన్న పరపతి కారణంగానే మంత్రిని, ఆయన ఆదేశాలను ఖాతరు చేయడం లేదని శక్తి శాఖ వర్గాల సమాచారం. కాగా శక్తి కమిషనరేట్‌లో ఉన్నతాధికారుల వర్గ పోరుతో కిందిస్థాయి ఉద్యోగులు ఆందోళనకు, ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవన్నీ శాఖలో చికాకు కలిగిస్తున్నప్పటికీ, శక్తి మంత్రి పెద్దగా పట్టించుకోవడం లేదని, కార్యదర్శి సైతం అదే తీరున వ్యవహరిస్తుండటంతో శాఖలో పరిస్థితులు గందరగోళంగా తయారయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సంసారం ఇక్కడ.. సోకులు అక్కడా: నాయిని
-
సంసారం ఇక్కడ.. సోకులు అక్కడా: నాయిని
సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, అధికారులు మొత్తం అంతా ఇక్కడే ఉంటే మరి కార్మికశాఖ సొమ్ములను విజయవాడకు ఎందుకు పంపారని తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రశ్నించారు. సంసారం ఇక్కడ చేసి.. సోకులు అక్కడ పెతారా అంటూ ఎద్దేవా చేశారు. కార్మిక శాఖలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాను ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసినట్లు నాయిని తెలిపారు. అయితే.. ఆయన అహంకార పూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. ముఖ్య కార్యదర్శి రామాంజనేయులు ఆగమేఘాల మీద డబ్బును మళ్లించారని ఆయన అన్నారు. నిదులు విడుదల చేయొద్దంటూ ఆంధ్రాబ్యాంకుకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.


