breaking news
K.vijay bhaskar
-
ఫన్... థ్రిల్
‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు’ వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన కె. విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జిలేబి’. అంజు అశ్రాని సమర్పణలో పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ నిర్మించారు. విజయభాస్కర్ తనయుడు శ్రీ కమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివానీ రాజశేఖర్ కథానాయికగా, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర చేశారు. ఈ చిత్రం ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ‘‘ఫన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుంది. మణిశర్మ సంగీతం ఓ ప్రధాన ఆకర్షణ’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ నెల 18న ఈ చిత్రం విడుదల కానుంది. -
ఏసు బోధనలు ఆచరణీయం
ఆత్మకూరు(మంగళగిరి రూరల్) ఏసుక్రీస్తు ప్రేమ స్వరూపి అని, ఆయన బోధనలు ఆచరణీయమని అంతర్జాతీయ సువార్తీకులు బ్రదర్ ఎం.అనిల్‌కుమార్ అన్నారు. క్రిస్టియన్ రివైవల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలను గురు వారం రాత్రి ఆత్మకూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వాక్యోపదేశం చేస్తూ సువార్తను అందించేందుకు ఏసు ఈ లోకానికి వచ్చినట్టు తెలిపారు. ఏసు క్రీస్తు కొందరికే కాదు అందరికీ రక్షకుడన్నారు. సర్వసృష్టికి సువార్తను అందించడమే మన బాధ్యత అని, ఏసు ప్రేమ స్వరూపి అని మనకోసమే మరణించాడన్నారు. మన కోసం మతాలను సష్టించేందుకు రాలేదన్నారు. ఆయనపైవిశ్వాసం వుంచితే నిత్య జీవం ఇస్తాడని చెప్పారు. సాధారణంగా క్రైస్తవులు భయంతో వుంటారని, ప్రేమతో వుండటం లేదన్నారు. దేవుడు గురించి తెలిసిన వారికి భయం వుండదన్నారు. లోకాన్ని రక్షించడానికే ఏసు ప్రభువు భూమి మీదకు వచ్చారన్నారు ప్రతి ఒక్కరూ ఏసు మార్గంలో నడుచుకోవాలన్నారు. అనంతరం సినీనటి దివ్యవాణి వాక్యోపదేశం చేస్తూ తాను ఏసు ప్రభువును నమ్ముకున్నట్టు చెప్పారు. ఎంతటి కోటీశ్వరులైనా క్రీస్తు లేకపోతే బీదవారేనని చెప్పారు. గ్రాండ్ క్రిస్మస్ కన్వీనర్ పాస్టర్ బి.రవిప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎంపీపీ పచ్చల రత్నకుమారి, రెవరెండ్ కె.విజయభాస్కర్, రివైవల్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్ష, కార్యదర్శులు రెవరెండ్ పి.సుందరయ్య, రెవరెండ్ పి. దయారత్నకుమార్, పాస్టర్ ఎం.శేఖర్‌బాబు, పాస్టర్ ఆర్. అబ్రహామ్, కె.సుధాకర్ బాబు, కె భాస్కర్, బి. రాజు, వి. ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.