
శ్రీ కమల్, శివాని
‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు’ వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన కె. విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జిలేబి’. అంజు అశ్రాని సమర్పణలో పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ నిర్మించారు.
విజయభాస్కర్ తనయుడు శ్రీ కమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివానీ రాజశేఖర్ కథానాయికగా, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర చేశారు. ఈ చిత్రం ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ‘‘ఫన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంది. మణిశర్మ సంగీతం ఓ ప్రధాన ఆకర్షణ’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ నెల 18న ఈ చిత్రం విడుదల కానుంది.