breaking news
kurupam mla
-
కురుపానికి నిధుల వరద పారింది
గత తెలుగుదేశం పాలనలో అన్నింటా నిర్లక్ష్యానికి గురైన కురుపాం నియోజకవర్గానికి నిధుల వరద పారింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి చొరవతో నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు కలెక్టర్ హరిజవహర్‌లాల్ ఏసీఏ నిధులు రూ.1.95కోట్లు మంజూరు చేశారు. వీటితో తాగు, సాగు, రహదారుల పనులు చేపట్టనున్నారు. సాక్షి, జియ్యమ్మవలస(విజయనగరం) : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి చొరవతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న కురుపాం నియోజకవర్గానికి కలెక్టర్ భారీగా అదనపు కేంద్ర సహాయక నిధులు (ఏసీఏ) మంజూరయ్యాయి. ఈ మేరకు కోటి 94 లక్షల 96వేల రూపాయిలు ఏసీఏ నిధులు మంజూరు చేసినట్టు కలెక్టర్ నుంచి కాపీ అందినట్టు మంత్రి పుష్పశ్రీవాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాగునీటికి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ ఈఈ పార్వతీపురం వారి నుంచి 39 పనులకు మంజూరు అనుమతులు వచ్చినట్టు పేర్కొన్నారు. మంజూరైన నిధుల వివరాలను పరిశీలిస్తే... కొమరాడ మండలంలో శివిని గ్రామంలో ఎస్సీ కాలనీకి రూ.4లక్షలు, కోటిపాం పంచాయతీ గదబవలసకు రూ.2.50 లక్షలు, దేవకోన గ్రామానికి రూ.3లక్షలు, పాలెం పంచాయతీ పూజారిగూడకు రూ.3లక్షలు, సీహెచ్ గంగరేగువలసకు రూ.5లక్షలు, కొరిసిల గ్రామానికి రూ.3లక్షలు, మసిమండకు రూ.3లక్షలు, అర్తాం పంచాయతీ సీతమాంబపురానికి రూ.75వేలు మంజూరు చేసినట్టు తెలిపారు. సీసీ రోడ్లు, కాలువ పనులకు కళ్లికోట గ్రామానికి రూ.4.99లక్షలు, మసిమండ పంచాయతీ బల్లపాడు గ్రామానికి రూ.4.99లక్షలు, పెదశాఖ పంచాయతీ చినశాఖకు రూ.4.99లక్షలు మంజూరయ్యాయి. జియ్యమ్మవలస మండలం గవరమ్మపేట పంచాయతీ గవరమ్మపేట కాలనీకి రూ.1.50 లక్షలు, గడసింగుపురం పంచాయతీ ఏనుగులగూడకు రూ.2.50 లక్షలు, బల్లేరుగూడకు రూ.2.50లక్షలు, కుందరతిరువాడ పంచాయతీ నీచుకవలసకు రూ.రూ.5లక్షలు, పిప్పలబద్ర పంచాయతీకి రూ.4.50లక్షలు, పిప్పలబద్ర బీసీ కాలనీకి రూ.4లక్షలు, చినమేరంగి పీడబ్ల్యూఎస్ స్కీం మరమ్మతు పనులకు రూ.3లక్షలు, తుంబలి పంచాయతీ పందులవానివలస గ్రామానికి రూ.1.50లక్షలు, చినమేరంగి ఎస్సీ కాలనీ(పీడబ్ల్యూఎస్) తాగునీటి పథకం మరమ్మతులకు రూ.2లక్షలు మంజూరు అయ్యాయి. సీసీ రోడ్లు, కాలువ పనులకు పెదతోలుమండకు రూ.4.99లక్షలు, పెదదోడిజ గ్రామానికి రూ.4.99 లక్షలు మంజూరయ్యాయి. కురుపాం మండలానికి తాగునీరు పనులు బియ్యాలవలస పంచాయతీ దిమిటిగూడ గ్రామానికి రూ.1.50లక్షలు, గుజ్జువాయి పంచాయతీ వూటచవకగూడ, మరుపల్లి పంచాయతీ వంతరగూడ, మొండెంఖల్ పంచాయతీ మంగళగిరి గ్రామాలకు రూ.2లక్షలు చొప్పున, నీలకంఠాపురం పంచాయతీ కేదారిగూడ గ్రామానికి రూ.1.50లక్షలు, చుక్కుగడిగూడ గ్రామానికి రూ.2లక్షలు, కుంబుమానుగూడ గ్రామానికి రూ.2లక్షలు, నీలకంఠాపురం ఇందిరమ్మ కాలనీకి రూ.3లక్షలు, పెదగొత్తిలి పంచాయతీ జగ్గన్నదొరవలస, కొలిస గ్రామాలకు రూ.2లక్షలు చొప్పున మంజూరు చేశారు. పొడి పంచాయతీ రాజీపేట(తచ్చిడి)కురూ.2లక్షలు, తిత్తిరి పంచాయతీ సీడిగూడ గ్రామానికి రూ.2.50లక్షలు, వలసబల్లేరు పంచాయతీ బండిమానుగూడ గ్రామానికి రూ.1.50లక్షలు మంజూరయ్యాయి. సీసీ రోడ్లు, కాలువలకు మొండెంఖల్లు బస్టాప్ వరకు రూ.4.99 లక్షలు, టీజీ రోడ్డు నుంచి గాంధీనగర్ కాలనీ కురుపాం చివర వరకు రూ.4.99 లక్షలు, దండుసూరకు రూ.4.99 లక్షలు మంజూరు చేశారు. సాగునీటి పనుల కోసం గుజ్జువాయి రిజర్వాయరు పనులకు రూ.20 లక్షలు,గుమ్మలక్ష్మీపురం మండలం కేదారిపురం పంచాయతీ జోబుగూడకు రూ.3లక్షలు, పీ.ఆమిటి కాలనీకి రూ.3లక్షలు, ఎన్‌ఎన్‌పేట కాలనీకి రూ.2.50లక్షలు, చెముడుగూడ పంచాయతీ మసిడిగూడకు రూ.3లక్షలు, దుడ్డుఖల్లు పంచాయతీ కిల్లిగూడకు రూ.2.50లక్షలు, ఎల్విన్‌పేట పంచాయతీ పీబీ కాలనీకి రూ.3లక్షలు, గుమ్మలక్ష్మీపురం పంచాయతీ గడ్డికాలనీకి రూ.4లక్షలు, డుమ్మంగి పంచాయతీ కోరాటగూడకు రూ.3లక్షలు, ఎల్విన్‌పేట పంచాయతీ ఎస్టీ కాలనీకి రూ.3లక్షలు తాగునీటికి మంజూరయ్యాయని తెలిపారు. సీసీ రోడ్ల కోసం కొండవీధి వయా మెట్టవీది టూ గడ్డి కాలనీకి రూ.4.99 లక్షలు, ఏపీఆర్ఎస్ పాఠశాల నుంచి ఆర్‌ఆండ్‌బీ రోడ్డుకు రూ.4.99 లక్షలు మంజూరు చేశారు. గుమ్మలక్ష్మీపురం మండలం బొద్దిడి చెక్‌డ్యాం పనులకు రూ.10లక్షలు, మురడగెడ్డ పనులకు రూ.6లక్షలు, సీమలగూడ ఆనకట్ట పనులకు రూ.6లక్షలు మంజూరు చేసినట్టు పుష్పశ్రీవాణి తెలిపారు. -
‘కట్టే కాలేవరకు వైఎస్సార్ సీపీలోనే’
సాక్షి, కురుపాం: జీవితాంతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. జగనన్న వెంట నడుస్తానని తెలిపారు. కురుపాం గడ్డ.. వైఎస్సార్ కుటుంబానికి అడ్డ అని పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా కురుపాంలో మంగళవారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ... ‘వైఎస్సార్ అభిమానులు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు. కట్టె కాలే వరకు వైఎస్సార్ కుటుంబంతోనే ఉంటామని అంటుంటారు. అధికార పార్టీ నన్ను ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నించింది. నా చేతిపై వైఎస్సార్ పచ్చబొట్టు పొడిపించుకున్నాను. ఎప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. కురుపాం నియోజకవర్గంలో చాలా సమస్యలున్నాయి. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే మన సమస్యలు జగనన్న పరిష్కరిస్తారు. కురుపాం ప్రజలు, కార్యకర్తలు, జిల్లా పెద్దల ఆశీస్సులు, జగన్ ఆశీస్సులు మాకు మెండుగా ఉన్నాయి. జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం మేము దేనికైనా రెడీ’ అని పుష్పశ్రీవాణి అన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురించి లొంగకుండా ఉన్న పుష్పశ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్ రాజుకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైఎస్ జగన్‌తోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంట్ సమన్వయకర్త మాధవి అన్నారు. విజయనగరం జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిందేమి లేదని విమర్శించారు.. -
విఐపి రిపోర్టర్ - కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
-
మరో పార్టీతో సన్నిహితంగా ఉంటూ విమర్శలా?
విజయనగరం: అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై కురుపాం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంచి గౌరవం ఇస్తున్నారని ఆమె బుధవారమిక్కడ అన్నారు. మరో పార్టీతో సన్నిహితంగా ఉంటూ సొంతపార్టీపై విమర్శలు చేయటం సరికాదని పుష్పశ్రీవాణి వ్యాఖ్యానించారు. అరకు ఎంపీగా ఉంటూ మీ నియోజకవర్గ పరిధిలో ....చెన్నై భవనం కూలిన ఘటనలో బాధితులను ఇప్పటివరకూ ఎందుకు పరామర్శించలేదని కొత్తపల్లి గీతాను పుష్పశ్రీవాణి సూటిగా ప్రశ్నించారు. రాజకీయాలు మాట్లాడటానికి ఉన్న సమయం ప్రజా సమస్యలపై స్పందించలేరా అని అన్నారు. పార్టీని విమర్శించాలనుకుంటే బయటకు వెళ్లి ఆ పని చేయాలని కొత్తపల్లి గీతకు సూచించారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)