రూ.1.95కోట్ల ఏసీఏ నిధుల మంజూరు

ACA Funds Released To Kurupam With Initiative Of MLA Pushpa Srivani - Sakshi

గత తెలుగుదేశం పాలనలో అన్నింటా నిర్లక్ష్యానికి గురైన కురుపాం నియోజకవర్గానికి నిధుల వరద పారింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి చొరవతో నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఏసీఏ నిధులు రూ.1.95కోట్లు మంజూరు చేశారు. వీటితో తాగు, సాగు, రహదారుల పనులు చేపట్టనున్నారు. 

సాక్షి, జియ్యమ్మవలస(విజయనగరం) : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి చొరవతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న కురుపాం నియోజకవర్గానికి కలెక్టర్‌ భారీగా అదనపు కేంద్ర సహాయక నిధులు (ఏసీఏ) మంజూరయ్యాయి. ఈ మేరకు కోటి 94 లక్షల 96వేల రూపాయిలు ఏసీఏ నిధులు మంజూరు చేసినట్టు కలెక్టర్‌ నుంచి కాపీ అందినట్టు మంత్రి పుష్పశ్రీవాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాగునీటికి సంబంధించి ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ పార్వతీపురం వారి నుంచి 39 పనులకు మంజూరు అనుమతులు వచ్చినట్టు పేర్కొన్నారు. మంజూరైన నిధుల వివరాలను పరిశీలిస్తే... కొమరాడ మండలంలో శివిని గ్రామంలో ఎస్సీ కాలనీకి రూ.4లక్షలు, కోటిపాం పంచాయతీ గదబవలసకు రూ.2.50 లక్షలు, దేవకోన గ్రామానికి రూ.3లక్షలు, పాలెం పంచాయతీ పూజారిగూడకు రూ.3లక్షలు, సీహెచ్‌ గంగరేగువలసకు రూ.5లక్షలు, కొరిసిల గ్రామానికి రూ.3లక్షలు, మసిమండకు రూ.3లక్షలు, అర్తాం పంచాయతీ సీతమాంబపురానికి రూ.75వేలు మంజూరు చేసినట్టు తెలిపారు. సీసీ రోడ్లు, కాలువ పనులకు కళ్లికోట గ్రామానికి రూ.4.99లక్షలు, మసిమండ పంచాయతీ బల్లపాడు గ్రామానికి రూ.4.99లక్షలు, పెదశాఖ పంచాయతీ చినశాఖకు రూ.4.99లక్షలు మంజూరయ్యాయి.

జియ్యమ్మవలస మండలం గవరమ్మపేట పంచాయతీ గవరమ్మపేట కాలనీకి రూ.1.50 లక్షలు, గడసింగుపురం పంచాయతీ ఏనుగులగూడకు రూ.2.50 లక్షలు, బల్లేరుగూడకు రూ.2.50లక్షలు, కుందరతిరువాడ పంచాయతీ నీచుకవలసకు రూ.రూ.5లక్షలు, పిప్పలబద్ర పంచాయతీకి రూ.4.50లక్షలు, పిప్పలబద్ర బీసీ కాలనీకి రూ.4లక్షలు, చినమేరంగి పీడబ్ల్యూఎస్‌ స్కీం మరమ్మతు పనులకు రూ.3లక్షలు, తుంబలి పంచాయతీ పందులవానివలస గ్రామానికి రూ.1.50లక్షలు, చినమేరంగి ఎస్సీ కాలనీ(పీడబ్ల్యూఎస్‌) తాగునీటి పథకం మరమ్మతులకు రూ.2లక్షలు మంజూరు అయ్యాయి.  సీసీ రోడ్లు, కాలువ పనులకు పెదతోలుమండకు రూ.4.99లక్షలు, పెదదోడిజ గ్రామానికి రూ.4.99 లక్షలు మంజూరయ్యాయి.

కురుపాం మండలానికి తాగునీరు పనులు
బియ్యాలవలస పంచాయతీ దిమిటిగూడ గ్రామానికి రూ.1.50లక్షలు, గుజ్జువాయి పంచాయతీ వూటచవకగూడ, మరుపల్లి పంచాయతీ వంతరగూడ, మొండెంఖల్‌ పంచాయతీ మంగళగిరి గ్రామాలకు రూ.2లక్షలు చొప్పున, నీలకంఠాపురం పంచాయతీ కేదారిగూడ గ్రామానికి రూ.1.50లక్షలు, చుక్కుగడిగూడ గ్రామానికి రూ.2లక్షలు, కుంబుమానుగూడ గ్రామానికి రూ.2లక్షలు, నీలకంఠాపురం ఇందిరమ్మ కాలనీకి రూ.3లక్షలు, పెదగొత్తిలి పంచాయతీ జగ్గన్నదొరవలస, కొలిస గ్రామాలకు రూ.2లక్షలు చొప్పున మంజూరు చేశారు. పొడి పంచాయతీ రాజీపేట(తచ్చిడి)కురూ.2లక్షలు, తిత్తిరి పంచాయతీ సీడిగూడ గ్రామానికి రూ.2.50లక్షలు, వలసబల్లేరు పంచాయతీ బండిమానుగూడ గ్రామానికి రూ.1.50లక్షలు మంజూరయ్యాయి. సీసీ రోడ్లు, కాలువలకు మొండెంఖల్లు బస్టాప్‌ వరకు రూ.4.99 లక్షలు, టీజీ రోడ్డు నుంచి గాంధీనగర్‌  కాలనీ కురుపాం చివర వరకు రూ.4.99 లక్షలు, దండుసూరకు రూ.4.99 లక్షలు మంజూరు చేశారు.

సాగునీటి పనుల కోసం గుజ్జువాయి రిజర్వాయరు పనులకు రూ.20 లక్షలు,గుమ్మలక్ష్మీపురం మండలం కేదారిపురం పంచాయతీ జోబుగూడకు రూ.3లక్షలు, పీ.ఆమిటి కాలనీకి రూ.3లక్షలు, ఎన్‌ఎన్‌పేట కాలనీకి రూ.2.50లక్షలు, చెముడుగూడ పంచాయతీ మసిడిగూడకు రూ.3లక్షలు, దుడ్డుఖల్లు పంచాయతీ కిల్లిగూడకు రూ.2.50లక్షలు, ఎల్విన్‌పేట పంచాయతీ పీబీ కాలనీకి రూ.3లక్షలు, గుమ్మలక్ష్మీపురం పంచాయతీ గడ్డికాలనీకి రూ.4లక్షలు, డుమ్మంగి పంచాయతీ కోరాటగూడకు రూ.3లక్షలు, ఎల్విన్‌పేట పంచాయతీ ఎస్టీ కాలనీకి రూ.3లక్షలు తాగునీటికి మంజూరయ్యాయని తెలిపారు. సీసీ రోడ్ల కోసం కొండవీధి వయా మెట్టవీది టూ గడ్డి కాలనీకి రూ.4.99 లక్షలు, ఏపీఆర్‌ఎస్‌ పాఠశాల నుంచి ఆర్‌ఆండ్‌బీ రోడ్డుకు రూ.4.99 లక్షలు మంజూరు చేశారు. గుమ్మలక్ష్మీపురం మండలం బొద్దిడి చెక్‌డ్యాం పనులకు రూ.10లక్షలు, మురడగెడ్డ పనులకు రూ.6లక్షలు, సీమలగూడ ఆనకట్ట పనులకు రూ.6లక్షలు  మంజూరు చేసినట్టు పుష్పశ్రీవాణి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top