breaking news
kristofer
-
టీవీ5పై చర్యలు తీసుకుంటాం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, అమరావతి: శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన టీవీ5 ఛానల్ వెబ్‌సైట్‌పై చర్యలు తీసుకుంటామన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. టీటీడీ డీఈవోగా క్రిస్టోఫర్‌ను నియమించారంటూ వస్తోన్న వార్తలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రిస్టోఫర్‌ను టీటీడీ డీఈవోగా నియమించారంటూ టీవీ5 ఛానల్ తన వెబ్సైట్లో తప్పుడు వార్తలు పెట్టి భక్తులను రెచ్చగొట్టడానికి ప్రయత్నించిందన్నారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీవీ5 ఛానల్ వెబ్‌సైట్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.. కేసు కూడా పెడతామని హెచ్చరించారు. టీటీడీలో వీఐపీ సంస్కృతిని నిర్మూలించడానికి చేస్తోన్న ప్రయత్నాలను స్వాగతించలేకపోతున్నారని సుబ్బా రెడ్డి మండి పడ్డారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ యాభై రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత దిగజారిందని విమర్శించారు. అబద్ధాలు, దుష్ప్రచారాలతో ప్రభుత్వ ప్రతిష్టను, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎల్లో మీడియాను వాడుకొని ప్రజలను తప్పుదోవ పట్టించాలని యత్నిస్తున్నారు. ఇలాంటి ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సుబ్బా రెడ్డి హెచ్చరించారు. -
రైల్వే ట్రాక్ వద్ద మృతదేహం
హైదరాబాద్: హైదరాబాద్ నేరేడ్మెట్ పరిధిలోని రామకృష్ణాపురం రైల్వే ట్రాక్ వద్ద శనివారం ఉదయం క్రిస్టోఫర్ అనే చిట్టీల వ్యాపారి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన చిట్టీల వ్యాపారి క్రిస్టోఫర్ శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అయితే రాత్రి 11 గంటల సమయంలో ఫోన్ రావడంతో అతను ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి మరుసటి రోజు ఉదయం రామకృష్ణాపురం రైల్వే ట్రాక్ వద్ద శవమై తేలాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎవరో చంపి పట్టాలపై పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్రిస్టోఫర్‌కు భార్యా,ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
దేశం కోసం 15 వేల కిలోమీటర్లు!
మనదేశ బలం ప్రజాస్వామ్యం.ఆ ప్రజాస్వామ్యం బలం ఓటు. ఈ దేశం ఎవరి ఏలికలో ఉండాలో చెప్పాల్సింది ఓటరు. చిత్రమైన విషయం ఏంటంటే... ఓటు విలువ ఓటరుకు తెలియడం లేదు. ఒకవేళ తెలిసినా తన ఓటును వినియోగించుకునేటంత గొప్ప వ్యక్తులు ఎవరూ లేరన్న భావన కావచ్చు. అందుకే నోటాకైనా వేయండి గానీ ఓటు మాత్రం తప్పనిసరిగా వేయండని చెప్పడానికి ఓ యువ సమూహం పెద్ద ప్రయత్నమే చేసింది. ఎపుడూ లేనట్లు ఈసారి ఎన్నికలు ఓ యజ్ఞంలా జరిగాయి. ప్రజలు ఒక వేడుకలో పాల్గొన్నట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిసారి ఎన్నికలు వేరు, ఈసారి ఎన్నికలు వేరు. ఎన్నో మార్పులు, ఎన్నో విశేషాలు, కొత్త ఓటర్ల ఉత్తేజం అన్నీ కలసి దేశ తలరాతను నిర్దేశించాయి. స్వాతంత్య్రం తర్వాత మొదటి సారి కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలు అత్యధికంగా ఓటు వేశారు. మొదటి సారి యువత ఏకమొత్తంగా కదలివచ్చి ఓటువేసింది. అలాగే తొలిసారి ‘నోటా’ ఆప్షన్ చేరింది. మరి ఇదంతా ఉత్తినే సాధ్యమయ్యిందా?! అంటే కాదు. ఈ ఫలితం వెనుక ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. అలాంటి ప్రయత్నాల్లో ఒక విజయవంతమైన ప్రయత్నమే ‘వందేమాతరం బైక్ రైడర్స్’ సుదూర ప్రయాణం. ఇంతకాలం ఓటు వేసే పనిని తప్పించుకోవడానికి చాలా మంది ఒక సాకు చెప్పేవారు. పళ్లు ఊడగొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏం అనేవారు. ఎందుకంటే అభ్యర్థుల్లో ఎవరూ మంచివాళ్లు లేనపుడు ఎవరో ఒక రౌడీనో/అవినీతి పరుడినో/వ్యాపారినో ఎన్నుకోవాల్సిన అవసరం ఏముంది? అనే ప్రశ్న చాలామంది విద్యావంతులైన ఓటర్ల నుంచి వచ్చేది. కానీ ఈసారి వారందరి నోళ్లు మూత పడ్డాయి. ఎందుకంటే నీకు ఎవరూ ఇష్టం లేదు అని చెప్పడానికి కూడా ఓటువేయొచ్చు. అంటే నాకు ఈ దేశం కోసం ఓటువేయాలని ఉంది.. కానీ సరైన అభ్యర్థులు లేరు అని ఓటర్లు ఫీలైనప్పుడు వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేయడానికి ‘నోటా’ అనే బలమైన ఆయుధం దొరికింది. ఈసారి దీనికి 60 లక్షల ఓట్లు పడ్డాయి. అంటే దేశం మొత్తం మీద పోలైన ఓట్లలో 1.1 శాతం ఓట్లు. వందే మాతరం బైక్ రైడర్స్ ‘ఓటు వేయండి... నోటాకైనా పర్లేదు’ అన్న నినాదంతో దేశంలోని నలుమూలలను సందర్శించడం కూడా ఇందుకొక కారణం. ‘ఓటు వేయడానికి కదలండి’ అంటూ ఆ యువ గుంపు అందరినీ కదిలించింది. అనేక నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రామాలు తిరుగుతూ ప్రతిచోటా ఆగుతూ ఓటర్లను అప్రమత్తం చేసింది. ఓటేయాలనే ఉత్సాహం నింపింది. చాలామంది వ్యక్తులు, సంస్థలు ఎన్నో క్యాంపెయిన్లు నడిపినా వందేమాతరం రైడ్ మాత్రం చాలా శక్తివంతమైన క్యాంపెయిన్ అయింది. ఎందుకంటే వీరు నేరుగా విషయాన్ని ఓటరుకే చెప్పారు. ఓటరును ప్రత్యక్షంగా కలిసి ఓటు గురించి తెలిపారు. ఈ టీమ్‌కు మరో ప్రత్యేకత ఉంది. దేశంలో ప్రతి రాష్ర్ట రాజధానిని కలుపుతూ పర్యటించి ఒక సంపూర్ణమైన ప్రచారం నిర్వహించిన ఏకైక గ్రూపు వందేమాతరం రైడర్స్. ఇప్పటి వరకు జరిగిన యూత్ క్యాంపెయిన్లలో ఇదే అతిపెద్దది. విశాఖపట్నం నగరానికి చెందిన భరద్వాజ్ దాయల్కు వచ్చిన ఆలోచన నుంచి ఈ గ్రూపు ఆవిర్భవించింది. ఇందులో ముంబైకి చెందిన క్రిస్టోఫర్, నాడార్ నవీన్ నాయర్, బీదర్‌కు చెందిన జస్ప్రీత్ సింగ్ మోంటీ, గుర్గావ్కు చెందిన రమన్ బాల్యన్ సభ్యులు. మార్చి 15న ప్రారంభమై ఏప్రిల్ 27న ముగిసిన వీరి క్యాంపెయిన్ ఎన్నో ర్యాలీలు, ప్రచార సభలు, శిబిరాలు నిర్వహిస్తూ 15 వేల కిలోమీటర్లు సాగింది. అన్నివేల కిలోమీటర్లు తిరగాలంటే ఎంతో ఖర్చవుతుంది. అదంతా వీరు సొంతంగా పెట్టుకున్న డబ్బే. ఒక్కొక్కరికి లక్షకు పైగా ఖర్చయ్యింది. కానీ దానికి వచ్చిన స్పందన, అది సాధించిన ఫలితాల ముందు ఖర్చు చాలా తక్కువ. దేశంలోని ప్రతి రాష్ర్టంలో ప్రజలను కలిసి, వారిలో ఉత్తేజాన్ని నింపే అవకాశం అందరికీ వస్తుందా? ‘‘ముఖ్యంగా మేము భిన్న రాష్ట్ర్రాల విద్యార్థులకు పోలింగ్ బూత్‌కు వెళ్లే ఉత్సాహాన్నిచ్చాం. ఇంతకుమించిన సామాజిక సేవ, ప్రయత్నం ఏముంటుందిక’’ అంటారు రైడర్స్ సభ్యులు.