రైల్వే ట్రాక్ వద్ద మృతదేహం | dead body found near railway track | Sakshi
Sakshi News home page

రైల్వే ట్రాక్ వద్ద మృతదేహం

Mar 28 2015 5:30 PM | Updated on Sep 2 2017 11:31 PM

హైదరాబాద్ నేరేడ్‌మెట్ పరిధిలోని రామకృష్ణాపురం రైల్వే ట్రాక్ వద్ద శనివారం ఉదయం క్రిస్టోఫర్ అనే చిట్టీల వ్యాపారి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది.

హైదరాబాద్: హైదరాబాద్ నేరేడ్‌మెట్ పరిధిలోని రామకృష్ణాపురం రైల్వే ట్రాక్ వద్ద శనివారం ఉదయం క్రిస్టోఫర్ అనే చిట్టీల వ్యాపారి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. హైదరాబాద్కు  చెందిన చిట్టీల వ్యాపారి క్రిస్టోఫర్ శుక్రవారం రాత్రి  స్నేహితులతో కలిసి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అయితే రాత్రి 11 గంటల సమయంలో ఫోన్ రావడంతో అతను ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి మరుసటి రోజు ఉదయం రామకృష్ణాపురం రైల్వే ట్రాక్ వద్ద శవమై తేలాడు. సమాచారం అందుకున్న  పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎవరో చంపి పట్టాలపై పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్రిస్టోఫర్‌కు భార్యా,ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement