breaking news
krishnamohan reddy
-
సహ నిందితుల వాంగ్మూలం ఆధారమా?
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై అక్రమ కేసులో కె.ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసే సమయంలో సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. భారతీయ సాక్ష్యాల చట్టం 1872 సెక్షన్ 30 కింద తుది విచారణ (ట్రయల్) సందర్భంగా ఏ వాంగ్మూలాలను అయితే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందో, వాటిని ముందస్తు బెయిల్, బెయిల్ మంజూరు సమయంలో కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని హైకోర్టు చెప్పడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.హైకోర్టు అభిప్రాయంతో తాము ఎంతమాత్రం ఏకీభవించలేమని స్పష్టం చేసింది. సహ నిందితుల వాంగ్మూలాలను ముందస్తు బెయిల్, బెయిల్ మంజూరు సమయంలో పరిగణనలోకి తీసుకోవడానికే వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సీఆర్పీసీ సెక్షన్ 161 కింద వాంగ్మూలం ఇచ్చింది సాక్షా? లేక నిందితుడా? లేక నిందితుడిగా మారే వ్యక్తా? అన్న విషయాన్ని బెయిల్, ముందస్తు బెయిల్ మంజూరు సమయంలో కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొన్ని సందర్భాల్లో 161 వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి నిందితుడు కాకపోవచ్చు.. ఆ తరువాత నిందితుడు కావొచ్చని పేర్కొంది. నేర విచారణ ప్రక్రియలో ఓ నిందితుడి వాంగ్మూలాన్ని సహ నిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించరాదన్నది ప్రాథమిక సూత్రమని తెలిపింది. రాజకీయ దురుద్దేశాలున్నట్లు పిటిషనర్లు ప్రాథమిక ఆధారాలు చూపారు.. ప్రభుత్వం న్యాయపరమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.. మద్యం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కృష్ణమోహన్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, వికాట్ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ జంషేడ్ బొర్జూర్ పారీ్థవాలా, జస్టిస్ మహాదేవన్‌ల ధర్మాసనం వాటిని కొట్టేసింది.దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున దాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదంటూ పిటిషన్లు కొట్టేసింది. ఇదే సమయంలో మద్యం కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలున్నట్లు పిటిషనర్లు ప్రాథమిక ఆధారాలను చూపారని, ఇందుకు ప్రభుత్వం న్యాయపరమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పునకు సంబంధించిన కాపీ తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఈ తీర్పులో ధర్మాసనం నిందితుల వాంగ్మూలాల గురించి పూర్తిస్థాయిలో చర్చించింది. కస్టడీలో పోలీసులకిచ్చిన వాంగ్మూలానికి ఆమోద యోగ్యత లేదు... ‘భారతీయ సాక్ష్యాల చట్టం సెక్షన్ 24 ప్రకారం సహ నిందితుడిపై మరో నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు.. ఆ వాంగ్మూలాన్ని ఆ వ్యక్తికి వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యంగా రుజువు చేయాల్సి ఉంటుంది. ఈ వాంగ్మూలం భయపెట్టి, బెదిరించి, ప్రలోభపెట్టి తీసుకున్నదై ఉండకూడదు. పోలీసు అధికారికి ఇచ్చిన వాంగ్మూలాన్ని నిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించడానికి వీల్లేదు. పోలీసు అధికారికి ఇచ్చిన వాంగ్మూలం భారతీయ సాక్ష్యాల చట్టం సెక్షన్ 25 ప్రకారం పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదు. ఈ అంశాలన్నింటినీ కూడా కేసు ట్రయల్ సందర్భంగా పరిశీలించాల్సి ఉంటుంది. నిందితులందరినీ ఉమ్మడిగా విచారించినప్పుడు (జాయింట్ ట్రయల్) మాత్రమే సహ నిందితుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వారిని ఒకే కేసులో, ఒకే కోర్టులో కలిపి విచారిస్తున్న సమయంలోనే వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యమవుతుంది.సెక్షన్ 30 కింద అభియోగాలు నమోదు కానప్పుడు, నిందితులను విచారణకు హాజరుపరచనప్పుడు భారతీయ సాక్ష్యాల చట్టం వర్తించదు. ఈ నేపథ్యంలో నిందితుల వాంగ్మూలాన్ని కోర్టులు పరిగణనలోకి తీసుకోజాలవు. ఒకవేళ సహ నిందితుల వాంగ్మూలాన్ని బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవచ్చని అనుకున్నా కేవలం నేరాంగీకార వాంగ్మూలమే కాకుండా సహ నిందితుడిపై ఉన్న ఇతర స్వతంత్ర సాక్ష్యాలను కూడా కోర్టు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. సెక్షన్ 25 ప్రకారం కస్టడీలో పోలీసులకిచ్చిన వాంగ్మూలాలకు ఆమోద యోగ్యత లేనందున ఆ వాంగ్మూలాలను సహ నిందితులకు వ్యతిరేకంగా ఉపయోగించరాదు. సెక్షన్ 26 ప్రకారం మేజి్రస్టేట్ సమక్షంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని మాత్రమే సహ నిందితులకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. పోలీసు అధికారికి నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదు‘నిందితుడి వాంగ్మూలం సహ నిందితుడిని ఇరికించేలా ఉంటే ఆ వాంగ్మూలాన్ని సీఆర్పీసీ సెక్షన్ 161 ప్రకారం పరిగణనలోకి తీసుకోవచ్చా అనే విషయంలో ఎలాంటి అయోమయానికి, గందరగోళానికి తావులేకుండా స్పష్టతనివ్వదలిచాం. ఎఫ్ఐఆర్లో పేరున్న వ్యక్తిని, నేరం చేసిన వ్యక్తిని పోలీసులు విచారించి సీఆర్పీసీ సెక్షన్ 161 కింద అతడి వాంగ్మూలాన్ని నమోదు చేయవచ్చు. అయితే అలా నమోదు చేసిన వాంగ్మూలానికి ఎంతమాత్రం ఆమోదయోగ్యత లేదు. ఇదే విషయాన్ని సాహిబ్ సింగ్‌తో పాటు పలు కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.2022లో ఇంద్రేష్ కుమార్ కేసులో సీఆర్పీసీ సెక్షన్ 161 కింద ఇచ్చిన వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకోరాదని, అయితే బెయిల్ మంజూరు సందర్భంగా పరిగణనలోకి తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు, చెప్పింది. ఈ కేసులో పూర్వాపరాల ఆధారంగా ఆ తీర్పునివ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పు కేవలం సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలకే వర్తిస్తుంది గానీ నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలకు కాదు. ఆ తీర్పులో ఎక్కడా కూడా నిందితులు పోలీసులకిచ్చిన వాంగ్మూలాలను బెయిల్ మంజూరు సందర్భంగా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పలేదు. సెక్షన్ 161 కింద ఓ సాక్షి ఇచ్చిన వాంగ్మూలానికి, ఓ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలానికి చాలా తేడా ఉంది.పోలీసు అధికారికి నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని విస్మరించవచ్చు. నిందితుడి వాంగ్మూలాన్ని సహ నిందితుడికి వ్యతిరేకంగా వాడకూడదన్న న్యాయ సూత్రానికి ఓ మినహాయింపు ఉంది. నిందితుడి వాంగ్మూలం నేరాన్ని రుజువు చేసేదే కాక, అది విశ్వసించేదిగా, ఆధార సహితంగా ఉన్నప్పుడు ఆ వాంగ్మూలాన్ని సహ నిందితుడికి వ్యతిరేకంగా వాడొచ్చు. అయితే నిందితుడి వాంగ్మూలమొక్కటే సరిపోదు. సహ నిందితుడి పాత్రను రుజువు చేసేందుకు ఇతర సాక్ష్యాలు కూడా కావాల్సి ఉంటుంది. ఆ సాక్ష్యాలు నిందితుడి వాంగ్మూలానికి మద్దతునిచ్చేవిగా ఉండాలి. అందువల్ల సహ నిందితుడికి వ్యతిరేకంగా ముఖ్యంగా పోలీసు అధికారి ముందు ఇచ్చిన వాంగ్మూలాలను న్యాయస్థానాలు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. నిందితుడి వాంగ్మూలం సహ నిందితుడిని ఇరికించేలా ఉంటే ఆ వాంగ్మూలాన్ని సీఆర్పీసీ సెక్షన్ 161 ప్రకారం పరిగణనలోకి తీసుకోవచ్చా? అనే విషయంలో ఎలాంటి అయోమయానికి, గందరగోళానికి తావులేకుండా స్పష్టతనివ్వదలిచాం. ఎఫ్ఐఆర్లో పేరున్న వ్యక్తిని, నేరం చేసిన వ్యక్తిని పోలీసులు విచారించి సీఆర్పీసీ సెక్షన్ 161 కింద అతడి వాంగ్మూలాన్ని నమోదు చేయవచ్చు. అయితే అలా నమోదు చేసిన వాంగ్మూలానికి ఎంతమాత్రం ఆమోదయోగ్యత లేదు. - సుప్రీంకోర్టుకేవలం సహ నిందితుని కన్ఫెషన్ స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తి బెయిల్‌పై నిర్ణయం తీసుకోరాదని తన జడ్జిమెంట్‌లో పలు పేరాల్లో అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అందులోని కొన్ని ...34. ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం, ఒక వ్యక్తి తనకు వ్యతిరేకంగా అలాగే మరొకరిని కూడా దోషిగా సూచిస్తూ చేసిన అంగీకారాన్ని (కన్ఫెషన్), వారు ఇద్దరూ ఒకే సమయంలో ఒకే కేసులో సంయుక్తంగా విచారణకు లోనవుతున్నప్పుడు, ఆ కోర్టు ఆ అంగీకారాన్ని పరిశీలనలోకి తీసుకోవచ్చు. అయితే, ఈ అంగీకారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని మరొకరిని శిక్షించకూడదు. దానిని మిగతా ఆధారాలతో కలిపి పరిశీలించాలి.39. ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 30పై హైకోర్టు తనదైన అర్థాన్ని కలిగి ఉంది. సెక్షన్ 30 కింద అంగీకరించదగినదిగా (కన్ఫెషన్) ఉన్న విషయం, ముందస్తు బెయిల్ లేదా సాధారణ బెయిల్ పిటిషన్ పరిశీలన సమయంలో కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే, హైకోర్టు వ్యక్తపరిచిన అభిప్రాయంతో మేము ఏకీభవించడం లేదు. మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్న అభిప్రాయం ఏమిటంటే– అటువంటి ఒప్పుకోలు ఏదైనా ఉన్నా, అది ముందస్తు బెయిల్ లేదా సాధారణ బెయిల్ ఇచ్చే దశలో పరిగణనలోకి తీసుకోరాదు. దీనికి ప్రధాన కారణాలు ఇవే:(1) ఒక సహ–ఆరోపితుడిపై ఒప్పుకోలు (కన్ఫెషన్) ఆధారంగా నిర్ణయం తీసుకోవాలంటే, ఆ ఒప్పుకోలు చేసిన వ్యక్తిపై ముందు నేరం నిరూపితమవ్వాలి. అది సెక్షన్ 24 వీగిపోకూడదు. లేదా సెక్షన్ 25 ప్రకారం చట్టవిరుద్ధంగా ఉండకూడదు. ఇది పూర్తిగా కోర్టు విచారణ సమయంలోనే తేలుతుంది. కేసు నిరూపణ కోసం విశ్వసనీయ, బలమైన సాక్ష్యాలు కోర్టులో ఉంచాల్సి ఉంటుంది, తద్వారా నేరం స్పష్టంగా నిరూపితం కావాలి. ‘దీపక్ భాయ్ జగదీష్ చంద్ర పటేల్ (వర్సెస్) స్టేట్ ఆఫ్ గుజరాత్ అండ్ అదర్స్ (2019) 16 ఎస్సీసీ 547’లో అత్యున్నత న్యాయస్థానం ఇదే విషయాన్ని చెప్పింది. పోలీసు అధికారుల ముందు ఇచ్చిన ఒప్పుకోలు, కోర్టులో సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకోరాదు. సెక్షన్ 30 ప్రకారం పరిగణనలోకి తీసుకునే స్టేట్మెంట్ సరైనదై ఉండాలి, చట్టబద్ధమైనదై ఉండాలి. ఇది ఈ సెక్షన్ మూల లక్ష్యం.49. (10) ముందస్తు (యాంటిసిపేటరీ) లేదా సాధారణ (రెగ్యులర్) బెయిల్ విచారణకు సంబంధించి కోర్టు సీఆర్పీసీ 161 ప్రకారం పోలీసుల ముందు ఒక వ్యక్తి ఇచ్చిన ప్రకటనను పరిశీలించే ముందు, ఆ వ్యక్తి వాస్తవంగా సాక్షినా, నిందితుడా, లేక భవిష్యత్తులో నిందితుడిగా మారే అవకాశం ఉన్నవాడా అనే విషయాన్ని మొదట తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి. ఎందుకంటే 161‑సెక్షన్ ప్రకటన‑ సమయంలో ఆ వ్యక్తి నిందితుడి జాబితాలో లేకపోయినా, దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో తర్వాత అతను నిందితుడిగా చేర్చబడే పరిస్థితులు ఏర్పడవచ్చు.ఈ నేపథ్యంలో, మొదట సాక్షిగా ఉన్న వ్యక్తి తర్వాత నిందితుడిగా మారవచ్చన్న భావాన్ని కోర్టులు ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. ఎఫ్ఐఆర్లో పేరు లేదని మాత్రమే కారణం చెప్పుకుని ఆ వ్యక్తి ప్రకటనపై ఆధారపడితే, అతన్ని నిందితుడిగా చేర్చే దశ వచ్చే వరకు ఆ ప్రకటనను నమ్ముకునే అసంబద్ధ పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే, రికార్డుల ప్రకారం ఆ వ్యక్తిని నిందితుడిగా చేర్చే అవకాశముందని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తే, దర్యాప్తు ఏ విధంగానూ ప్రభావితం కాకుండా కోర్టులు ఏ విధమైన అభిప్రాయాన్ని ప్రకటించకుండా జాగ్రత్తగా ఉండాలని మేము హెచ్చరిస్తున్నాము. -
IAS, IPSల అరెస్టులు సరికావు.. అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి
-
కూటమి నేతలు దిగజారిపోతున్నారు.. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ పై సీరియస్
-
రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు
ఈ కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు..పక్షపాతం ఉందని పిటిషనర్లు కొంతమేర ప్రాథమికంగా రుజువు చేయగలిగారు. రాజకీయ దురుద్దేశాలు.. పక్షపాతానికి న్యాయపరమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తగిన సమయంలో తేలుస్తాం.థర్డ్ డిగ్రీ ఉపయోగించినా.. బెదిరించినా.. ఒత్తిడి చేసినా.. ప్రలోభపెట్టినా వీటిని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాం. నిందితులు, సహ నిందితుల నుంచి వాంగ్మూలాలను సేకరించే సమయంలో దర్యాప్తు సంస్థ కొన్ని సందేహాస్పద పద్ధతులను అనుసరిస్తోంది. పిటిషనర్లు, ఇతర సహ నిందితుల విషయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించడం, బెదిరించడం, ఒత్తిడి తేవడం, ప్రలోభపెట్టడం చెయ్యడానికి వీల్లేదు. సాక్షి, అమరావతి: ఏపీ మద్యం వ్యవహారంలో కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, వాటిని ఎంతమాత్రం కొట్టిపారేయలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజకీయ పక్షపాతం, దురుద్దేశాలకు న్యాయపరంగా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయితే, రాజకీయ దురుద్దేశాల కారణంతో.. నిందితులను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయకుండా దర్యాప్తు అధికారిని నిరోధించలేమని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జంషేడ్ బుర్జోర్ పార్థివాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.\మద్యం వ్యవహారంలో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చెబుతూ, వారి పిటిషన్లను కొట్టివేసింది. పిటిషనర్లపై థర్డ్ డిగ్రీ ఉపయోగించడానికి వీల్లేదని ఏపీ సీఐడీ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, ఫలానా విధంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయరాదంది. దర్యాప్తును నిష్పాక్షికంగా, పారదర్శకంగా కొనసాగించాలని ఆదేశించింది. పిటిషనర్లు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే, కేసు పూర్వాపరాల ఆధారంగా విచారించి తగిన నిర్ణయం వెలువరించాలని కింది కోర్టు, హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయంలో న్యాయవాదులు ఉండాలనుకుంటే, ఆ అభ్యర్థనతో హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది. సీఐడీ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నారు మద్యం కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం జస్టిస్ పార్థివాలా ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. మద్యం కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, ప్రభుత్వం మారగానే కేసు నమోదైందని వారు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సీఐడీ దర్యాప్తునకు పిటిషనర్లు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 13 గంటల చొప్పున వీరిని దర్యాప్తు అధికారి ప్రశి్నంచారన్నారు. ఎలాంటి అక్రమాల్లేవనీ సీసీఐ తేల్చింది... కొత్త మద్యం కంపెనీలకు అవకాశం కల్పించడం వెనుక అక్రమాలు జరిగాయని సీఐడీ ఆరోపిస్తోందని.. కానీ, ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తేల్చిందని అభిషేక్ మను సింఘ్వీ, వికాస్ సింగ్ పేర్కొన్నారు. సీఐడీ రిమాండ్ రిపోర్టులో ఇప్పుడు చేస్తున్న ప్రతి ఆరోపణ.. గతంలో సీసీఐకి చేసిన ఫిర్యాదులో ఉన్నవేనని గుర్తు చేశారు. నాటి ఫిర్యాదును సీసీఐ క్షుణ్నంగా పరిశీలించి క్లీన్చిట్ ఇచ్చిందని వివరించారు.ఈ మేరకు సీసీఐ ఉత్తర్వులను వారు ధర్మాసనం ముందు ఉంచారు. అక్రమాలే లేవని తేలిన వ్యవహారంలో సీఐడీ కేసు నమోదు చేసిందని, రాజకీయ కక్ష సాధింపులకు ఈ కేసు ఓ ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. ఈ కేసులో సాక్షులను సీఐడీ పలు రకాలుగా భయపెడుతోందన్నారు. కావాల్సిన విధంగా వాంగ్మూలం ఇవ్వకుంటే నిందితులుగా చేర్చేందుకు కూడా వెనుకాడడం లేదని తెలిపారు. వాంగ్మూలాలు తప్ప సాక్ష్యాలు ఏమీ చూపడం లేదని నివేదించారు. పిటిషనర్లకు మద్యం వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని, వారు కేవలం ప్రభుత్వ అధికారులుగా సమావేశాల్లో మాత్రమే పాల్గొన్నారని చెప్పారు. ఇదే నేరం అంటూ కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. పారదర్శక విధానాన్ని పూర్తిగా మార్చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ, ఇదో భారీ కుంభకోణమన్నారు. గతంలో మద్యం కొనుగోళ్లు చాలా పారదర్శకంగా జరిగేవని, గత ప్రభుత్వ హయాంలో దానిని పూర్తిగా మార్చేశారన్నారు. కీలక స్థానాల్లో కావాల్సిన వ్యక్తులను నియమించుకున్నారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ... రాజకీయ దురుద్దేశాలను, ప్రాథమిక ఆధారాలను ఎలా సమతుల్యం చేస్తారని ప్రశ్నించింది. దీంతో ఇది విచారణకు స్వీకరించదగ్గ నేరమే కాదని వికాస్ సింగ్ సమాధానం ఇచ్చారు.ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. అలాగైతే ఎఫ్ఐఆర్ కొట్టివేతకు పిటిషన్ దాఖలు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది. ఆ పని కచి్చతంగా చేస్తామని వికాస్ తెలిపారు. సింఘ్వీ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్లు ప్రభుత్వాధికారులుగా పదవీ విరమణ చేశారని, వారు ఎక్కడికీ పారిపోయే అవకాశం లేదని అన్నారు. ఆ అవసరం కూడా వారికి లేదన్నారు. కావాలంటే పాస్‌పోర్ట్ జప్తునకు ఆదేశాలు ఇవ్వొచ్చునన్నారు. అలాంటప్పుడు దేశం విడిచివెళ్లిపోతారన్న ఆందోళన అనవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ, ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఈసీఆర్ నమోదు చేసిందన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం, పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమంటూ పిటిషన్లు కొట్టేసింది. బెయిల్ పిటిషన్ దాఖలుకు గోవిందప్పకు అనుమతి వికాట్ సంస్థ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ నేపథ్యంలో తాము దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే సుప్రీంకోర్టుకు వివరించారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌కు అనుమతి కోరగా.. ధర్మాసనం అనుమతిచ్చింది. బాలాజీ గోవిందప్ప రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే కేసు పూర్వాపరాల ఆధారంగా నిర్ణయం వెలువరించాలని కింది కోర్టు, హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సమయంలో దవే స్పందిస్తూ, ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే గోవిందప్పను అరెస్ట్ చేశారన్నారు. ఇది ఏమాత్రం సహేతుకం కాదని, ఇలా అరెస్ట్ చేయడం తగదంటూ ఇదే కోర్టు గతంలో స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పరిశీలించాలంటూ సంబంధిత తీర్పు కాపీని ధర్మాసనం ముందు ఉంచారు. ఇప్పుడు ఈ అంశాలన్నీ అవసరం లేదని, తాము బాలాజీ గోవిందప్పకు ముందస్తు బెయిల్ ఇవ్వలేదని ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టు హెచ్చరికలు ఇవీ... రాష్ట్ర ప్రభుత్వానికి... ఏపీ మద్యం వ్యవహారంలో కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి. వాటిని ఎంతమాత్రం కొట్టిపారేయలేం. రాజకీయ పక్షపాతం, దురుద్దేశాలు ఉంటే, వాటికి న్యాయపరంగా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.సీఐడీ అధికారులకు..పిటిషనర్లపై థర్డ్ డిగ్రీ ఉపయోగించడానికి వీల్లేదు. ఫలానా విధంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయరాదు. దర్యాప్తును నిష్పాక్షికంగా, పారదర్శకంగా కొనసాగించాలి.రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై... పిటిషనర్లు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే, కింది కోర్టులు కేసు పూర్వాపరాల ఆధారంగా విచారించి తగిన నిర్ణయం వెలువరించాలి. విచారణ సమయంలో న్యాయవాదులు ఉండాలనుకుంటే, ఆ అభ్యర్థనతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించాలి. -
విచారణ పేరుతో వేధింపులు
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసుకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ తీవ్ర వేధింపులకు గురి చేస్తోంది. గురువారం 13 గంటలకుపైగా విచారణ పేరుతో ప్రహసనం సాగించడం సిట్ కుట్రలకు అద్దం పడుతోంది. రిటైర్డ్ అధికారులైన వారిని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11.15 గంటల వరకు విచారణ పేరుతో విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉంచడం గమనార్హం. తాము తదుపరి విచారణ చేపట్టేవరకు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సిట్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరూ బుధవారం స్వచ్ఛందంగా సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. తొలిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వారిని విచారించిన సిట్ అధికారులు మరుసటి రోజు గురువారం కూడా రావాలని పేర్కొన్నారు. దీంతో వారిద్దరూ వరుసగా రెండో రోజు గురువారం కూడా విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకే విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు.మళ్లీ మళ్లీ.. అవే ప్రశ్నలుసిట్ చీఫ్‌గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఇతర అధికారులు వారిని విడివిడిగా రోజంతా విచారించారు. మొదటి రోజు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడగడం గమనార్హం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సీఎంవో కార్యదర్శి, ఓఎస్డీలకు మద్యం విధానం రూపకల్పన, అమలుతో ఎలాంటి సంబంధం ఉండదని నిబంధనలను ఉటంకిస్తూ తేల్చి చెప్పారు. ఆ అంశం పూర్తిగా ఎక్సైజ్ శాఖ, బెవరేజస్ కార్పొరేషన్‌కు సంబంధించినదని పేర్కొన్నారు. అయినా సరే సిట్ అధికారులు పదే పదే అవే ప్రశ్నలు వేస్తూ వారిని వేధించారు. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తూ వారిపై మానసిక ఒత్తిడికి గురి చేసేందుకు యత్నించారు. ఇక మెయిల్ ఐడీలు, పాస్ వర్డ్ చెప్పమని సిట్ అధికారులు అడిగారు. అందుకు వారిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు.వెళ్లిపోవచ్చంటూ.. మళ్లీ రప్పించి..ఎట్టకేలకు రాత్రి 9.30 గంటల సమయంలో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి నుంచి సెల్ ఫోన్లు తీసుకుని విచారణ ముగిసిందని, వెళ్లవచ్చని సిట్ అధికారులు చెప్పారు. అయితే బయటకు వెళుతున్న వారిని మరోసారి వెనక్కి రప్పించారు. సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్‌బాబు మరోసారి విచారిస్తారని, వేచి ఉండాలని సూచించారు. అయితే రాజశేఖర్‌బాబు పనుల మీద బయటకు వెళ్లినందున ఆయన వచ్చే వరకు వేచి ఉండాలంటూ మరో గంటన్నరకుపైగా కాలహరణం చేశారు. వారిద్దరినీ మానసికంగా, శారీరకంగా వేధించడమే లక్ష్యంగా వ్యవహరించారు. సిట్ అధికారుల తీరుపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా సిట్ అధికారులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దాంతో ఎట్టకేలకు రాత్రి 11.15 గంటల సమయంలో విచారణ ముగిసిందంటూ ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ అధికారులు పంపించేశారు. ఇలా ఉద్దేశపూర్వకంగా వేధించాలని ముందుగానే రూపొందించుకున్న ప్రణాళికను అమలు చేశారు. శుక్రవారం కూడా మళ్లీ విచారణకు రావాలని వారికి సిట్ అధికారులు సూచించారు.సిట్ తీరు దారుణందర్యాప్తు పేరుతో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ వేధింపులకు గురి చేస్తోంది.రాజ్యాంగం, న్యాయస్థానాల తీర్పులు అంటే ఏమాత్రం లెక్కలేనట్లు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. సీనియర్ సిటిజన్లు అయిన వారిద్దరినీ 12 గంటలకు పైగా విచారణ పేరుతో వేధించడం ప్రభుత్వ కుట్రకు తార్కాణం. పౌరుల స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు. ఈ అక్రమ కేసులో గతంలో ఓ నిందితుడి పట్ల సిట్ అధికారులు ఇలాగే వ్యవహరిస్తే న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఇంటికి వెళ్లి విచారించాలని, సాయంత్రం 5 గంటల తరువాత విచారించవద్దని ఆదేశించింది. అయినా సరే సిట్ తీరు ఏమాత్రం మారలేదు. సిట్ అధికారులు రాజకీయ పార్టీ నేతల్లా వ్యవహరించడం సరికాదు. ఈ వ్యవహారాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళతాం. – మనోహర్ రెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడురాజకీయ వేధింపులు...రాజకీయ కారణాలతోనే ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ వేధిస్తోంది. కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. ఈ అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళతాం. – మొండితోక అరుణ్‌కుమార్, దేవినేని అవినాశ్, వైఎస్సార్సీపీ నేతలు మద్యం విధానంపై కేసు... ముందస్తు బెయిల్‌పై నేడు ‘సుప్రీం’ విచారణ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ఇప్పటికే అరెస్టు నుంచి తాత్కాలిక ఊరట బాలాజీ గోవిందప్ప అరెస్ట్‌పైనా తేలుస్తామన్న ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: మద్యం విధానానికి సంబంధించి అక్రమ కేసు ఎదుర్కొంటున్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి విచారించనుంది. తాము తదుపరి విచారణ చేపట్టేవరకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని అరెస్టు చేయరాదని ఆదేశిస్తూ ఈ నెల 13న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి ముందస్తు బెయిల్ పిటిషన్లు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు నేడు మరోసారి విచారణకు రానున్నాయి. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ఇప్పటికే స్వచ్ఛందంగా సిట్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. మరింత మురికిగా మార్చవద్దంటూ ఘాటు వ్యాఖ్యలు..ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుందని తెలిసి కూడా అదే రోజు తెల్లవారుజామున బాలాజీ గోవిందప్పను ఆగమేఘాలపై అరెస్ట్ చేశారని గత విచారణ సందర్భంగా ఆయన న్యాయవాది సిద్ధార్థ్ దవే ధర్మాసనం దృష్టికి తెచ్చారు. గోవిందప్ప అరెస్ట్ అక్రమమని నిరూపిస్తామని, దర్యాప్తు సంస్థ తీరును పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ.. తదుపరి విచారణలో బాలాజీ గోవిందప్ప అరెస్ట్ సంగతి కూడా తేలుస్తామని ప్రకటించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ అభ్యంతరం వ్యక్తం చేయగా... జస్టిస్ పార్దీవాలా ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని మరింత మురికిగా మార్చవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే గోవిందప్ప అరెస్ట్ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్ధకమవుతుందంటూ వాదన వినిపించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం... ఈ మొత్తం వ్యవహారంలో మీరేం చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తోందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. -
మద్యం విధానంతో సంబంధమే లేదు
సాక్షి, అమరావతి: మద్యం విధానం రూపకల్పనలో గానీ, అమలుతో గానీ తమకు ఏమాత్రం సంబంధం లేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎ.ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి విస్పష్టంగా పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై టీడీపీ కూటమి ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులో వీరిద్దరూ బుధవారం స్వచ్ఛందంగా సిట్ విచారణకు హాజరయ్యారు. వీరిపై శుక్రవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ విచారణకు హాజరయ్యారు. వీరిని విడివిడిగా మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 వరకు విచారించారు. చెరో 60 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అన్ని ప్రశ్నలకు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణ మోహన్‌రెడ్డి దీటుగా సమాధానం ఇస్తూ తమపై నమోదు చేసింది అక్రమ కేసేనని తేల్చిచెప్పారు. మద్యం విధానం రూపొందించడం, అమలుతో తమకు ఏమాత్రం సంబంధం ఉండదని నిబంధనలను ఉటంకిస్తూ స్పష్టం చేశారు. డిస్టిలరీలతో వ్యవహారాలన్నీ బెవరేజస్ కార్పొరేషన్ ఎండీనే పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. ఈ కేసులో సాక్షులు కొందరు మీ పేర్లు చెప్పారని సిట్ అధికారులు పేర్కొనగా, తాము కూడా ఏమాత్రం సంబంధం లేనివారి పేర్లను చెబితే వారినీ నిందితులుగా చేరుస్తారా అని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ఎదురు ప్రశ్నించడంతో సిట్ అధికారులు మౌనం దాల్చారు. రాజ్ కేసిరెడ్డితో గానీ డిస్టిలరీల ప్రతినిధులతో గానీ తాము ఎలాంటి అధికారిక, అనధికారిక వ్యవహారాలు నిర్వహించలేదని అన్నారు. తమపై నమోదు చేసింది పూర్తిగా అక్రమ కేసని న్యాయ పోరాటం ద్వారా ఆ విషయాన్ని నిరూపిస్తామని తేల్చిచెప్పారు. కాగా, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను గురువారం కూడా విచారణకు రావాలని సిట్ అధికారులు కోరారు. -
‘నేను బీఆర్ఎస్లోనే ఉన్నా’.. పోలీసుల్ని ఆశ్రయించిన ఎమ్మెల్యే
సాక్షి,హైదరాబాద్: తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ ఆ పార్టీ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (Bandla Krishnamohan Reddy) జోగులాంబ గద్వాల టౌన్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ నెల 11న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగులాంబ గద్వాల టౌన్ పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో తాను పార్టీ మారానని, అనుమతి అనుమతి లేకుండా తన ఫోటోను కొందరు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలపై ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, తన ప్రతిష్టకు భంగం కలిగేలా తన ఫొటోలతో ఫ్లెక్సీలు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉన్నారు
గద్వాల రూరల్: ‘అసెంబ్లీలో పాతమిత్రులు కనిపిస్తే వెళ్లి మాట్లాడినంత మాత్రాన పార్టీ మారినట్లు మీడియా కథనాలు రాయడం సరైంది కాదు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు’అని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలసి గద్వాలలోని ఎమ్మెల్యే బండ్ల నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్‌రెడ్డితో మంతనాలు చేయడంతో పాటు ఆయనతో కలసి అల్పాహారం చేశారు.అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గద్వాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారన్నారు. పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యం ఉంటుందని, ఎక్కడా ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నెట్టెంపాడు, ర్యాలంపాడు ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు లేకపోవడంతో కొంత మనస్తాపానికి గురైనట్లున్నారని పేర్కొ న్నారు.కాగా, కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమాన అవకాశాలుంటాయని, పార్టీలో ఎలాంటి వర్గపోరు లేదని చెప్పారు. గద్వాల అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికే ప్రథమ ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పార్టీ మారారనే ప్రచారం కేవలం అపోహ మాత్రమేనన్నారు. అనంతరం ఆయన కృష్ణమోహన్‌రెడ్డిని తన వాహనంలో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. -
బీఆర్ఎస్కు నేను చాలు..
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి విదేశాలకు వెళ్తే చూసుకోవడానికి తానున్నానని, బీఆర్ఎస్కు తాను చాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ముగ్గురూ కలిసి రేవంత్‌రెడ్డిని ఓడించలేకపోయారని, ఆయనకు వాళ్లు ఎలా సరిపోతారని ప్రశ్నించారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఎక్కడకూ వెళ్లడని, చాంబర్‌కు వెళ్లినంత మాత్రాన పారీ్టలో చేరినట్టా అని అన్నారు.మంగళవారం అసెంబ్లీ లాబీల్లో కోమటిరెడ్డి విలేకరులతో చిట్‌చాట్ మాట్లాడారు. కేటీఆర్ కూడా తన చైర్ దగ్గరకు వచ్చి మాట్లాడారని, అంతమాత్రాన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు అవుతుందా అని చెప్పారు. ‘కేసీఆర్ సభకు ఎందుకు రావడంలేదు. సభలో ముఖ్యమంత్రి ఎలాగో ప్రతిపక్షనేత కూడా అలాగే.. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదంటే రాజకీయాలు వదులుకున్నట్లే.ఆయన వైఖరి చూస్తోంటే త్వరలోనే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేలా కనిపిస్తోంది’అని కోమటిరెడ్డి అన్నారు. అసెంబ్లీలో తాను చెప్పిన మాటలను జగదీశ్‌రెడ్డి అంగీకరించారన్నారు. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతానని చెప్పిన కోమటిరెడ్డి.. బీఆర్ఎస్ ఎత్తేసిన అన్ని వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఉప్పల్–నారపల్లి ఫ్లైఓవర్‌కు త్వరలోనే రీటెండర్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. -
మళ్లీ బీఆర్ఎస్ గూటికి..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో చేరి కనీసం నెల రోజులు తిరగకమునుపే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తిరిగి సొంత పార్టీ బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంగళవారం కృష్ణమోహన్‌రెడ్డి లాబీలోని బీఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యాలయానికి వచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయిన కృష్ణమోహన్‌రెడ్డి తాను పారీ్టలో కొనసాగాలనుకుంటున్న విషయాన్ని వెల్లడించారు. ఎమ్మెల్యేలు పద్మారావుగౌడ్, శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డి తదితరులు కృష్ణమోహన్‌రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించారు.తాను త్వరలో పార్టీ అధినేత కేసీఆర్‌ను కలుస్తానని ఆయన వెల్లడించారు. జూలై 6న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో కాంగ్రెస్‌లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా మంగళవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి వచ్చారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డితో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. అయితే బీఆర్ఎస్లో తిరిగి చేరే అంశంపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.‘బీఆర్ఎస్లో కొందరు అల్ప సంతోషులు ఉన్నారు. నా ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టి పార్టీ మారతారని ప్రచారం చేస్తున్నారు. అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రుల చాంబర్లలోకి వెళ్లి కలుస్తున్నారు. వారంతా పార్టీ మారేవారేనా?’ అని వెంకటరావు మీడియాతో అన్నారు. తాను టీ తాగేందుకు బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి వచి్చనట్లు స్పష్టం చేశారు. అయితే, బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకే రోజు పార్టీ శాసనసభాపక్షం కార్యాలయానికి రావడంతో ఒక్కసారి గా రాజకీయ ఊహాగానాలు జోరందుకున్నాయి.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కృష్ణమోహన్‌రెడ్డి బాటలో తిరిగి సొంత గూటికి చేరుకుంటారని సమాచారం. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు వేర్వేరు సందర్భాల్లో కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ను వీడిన ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్ (జగిత్యాల), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్చెరు), కాలే యాదయ్య (చేవెళ్ల) తిరిగి అదే పార్టీలో చేరతారని సమాచారం. అయితే తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని కాలే యాదయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక్కొక్కరిదీ ఒక్కో పరిస్థితి పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఓ వైపు బీఆర్ఎస్ హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తోంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు అనర్హత వేటు కోసం దాఖలైన కేసులో మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. తదుపరి విచారణ ఆగస్టు 1కి వాయిదా పడగా, సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన తీర్పు మేరకు తమపై అనర్హత వేటు పడుతుందనే ఆందోళనలో బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన పలువురు ఎమ్మెల్యేలున్నారు.మొత్తం 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాను కనీసం 26 మంది కాంగ్రెస్‌లో చేరితేనే ఆ పార్టీ శాసనసభాపక్షం అధికార పక్షంలో విలీనమవుతుంది. అయితే ఇప్పటివరకు 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్ఎస్ శాసనసభా పక్షం విలీనానికి అవసరమైన మేజిక్ ఫిగర్ ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించకపోవడం ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కలవరం రేపుతోంది. తమపై అనర్హత వేటు పడితే జరిగే ఉప ఎన్నికలో తమ పరిస్థితి ఏంటనే ఆందోళనలో వారున్నారు.ఇదిలాఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ స్థానిక శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పారీ్టలో చేరిక సందర్భంగా ఇచి్చన హామీలు అమలు కావడం లేదని, పారీ్టలో ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తి కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరికొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
అఫిడవిట్లో అలసత్వం వద్దు
తాము ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవడం ఓటర్ల హక్కుగా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అందువల్లే పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పులు, ఉన్న కేసులు, జైలు జీవితం అనుభవిస్తే ఆ వివరాలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు, కుటుంబ సభ్యుల వివరాలన్నీ నామినేషన్ సందర్భంగా లిఖితపూర్వకంగా ఎన్నికల అధికారికి తెలపాలని పేర్కొంది. అయితే కొందరు అభ్యర్థులు అఫిడవిట్లో అన్ని వివరాలు తెలపడంలో అవలంబిస్తున్న నిర్లక్ష్యంపై సుప్రీం కోర్టులో కేసు దాఖలైంది. దీనిపై 2013లో న్యాయస్థానం తీర్పును వెలువరించింది. దాని ప్రకారం అఫిడవిట్లో ఏ ఒక్క కాలమ్‌ను నింప కుండా ఖాళీగా ఉంచవద్దంటూ పేర్కొంది. ఎవరైనా అభ్యర్థి పొరపాటున ఎక్కడైనా ఖాళీగా వదిలేస్తే దాన్ని పూర్తిగా నింపాలంటూ తేల్చి చెప్పింది. ఓటర్ల హక్కు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సతీమణి వనమా పద్మావతి పేరిట ఉన్న ఇన్నోవా వాహనంపై హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.135 ట్రాఫిక్ చలాన్ పెండింగ్‌లో ఉంది. ఆయన కుటుంబం పాల్వంచ మున్సిపాలిటీకి రూ.3,120 వాటర్ బిల్లు బకాయి ఉంది. వీటితో పాటు వివిధ ఆస్తులు, తనపై నమోదైన పోలీసు కేసుల వివరాలను 2018 ఎన్నికల్లో నామినేషన్ దాఖలు సందర్భంగా వనమా అఫిడవిట్లో పేర్కొనలేదు. పారదర్శకత పాటించడంలో విఫలమైనందున వనమా ఎన్నికను రద్దు చేయాలంటూ ఆయన ప్రత్యర్థి జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించి చుక్కలు చూపించారు. చిన్న ట్రాఫిక్ చలానాయే కదా అనే నిర్లక్ష్యం, ప్రజాజీవితంలో ఉన్నోళ్లపై పోలీసు కేసులు సహజమే అనే ఏమరుపాటు ఇబ్బంది తెచ్చి పెట్టగా కేసు ఇంకా సుప్రీంలో కొనసాగుతోంది. ప్రజా జీవితంలో ఉన్నోళ్లు ప్రతీ అంశాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందే. ఆస్తులు, అప్పులు, కేసుల వివరాల వెల్లడిలో అలసత్వముంటే ఇబ్బందులు ఎదురవుతాయనేందుకు వనమా ఉదంతం ఉదాహరణగా నిలుస్తోంది. వనమా తరహాలోనే నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో వివరాలను టాంపరింగ్ చేశారనే ఆరోపణలతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి సైతం న్యాయపరమైన చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. పత్రికా ప్రకటనలు అభ్యర్థులు తమపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను ప్రజలకు బహిరంగా తెలపాలనే నిబంధన సైతం 2013 నుంచి అమల్లోకి తెచ్చారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత పోలింగ్‌కు రెండు రోజుల ముందులోపు స్థానికంగా ఉన్న పేపర్లు/టీవీల్లో ప్రకటనల ద్వారా క్రిమినల్ కేసుల వివరాలను ప్రజలకు తెలపాల్సి ఉంటుంది. అది కూడా ఏ మూలనో కాకుండా ప్రముఖంగా కనిపించేలా మూడు సార్లు ప్రకటనలు ఇవ్వాలి. ఇలా ప్రజలకు అన్ని వివరాలను తెలియజేయకుండా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్టయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం –1951 ప్రకారం అనర్హతకు గురవుతారు. బీ ఫామ్ అందుకోగానే బీ ఫామ్ అందుకోవడమే ఆలస్యం నామినేషన్ దాఖలు చేయడం, ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడమే తరువాయి అనుకుంటే పొరపాటే. నామినేషన్ సందర్భంగా అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్ (లిఖిత వాంగ్మూలం) విషయంలో జాగ్రత్త పడకపోతే చిక్కులు తప్పవు. అక్కడ రాసే ప్రతీ అక్షరం, పొందు పరిచే ప్రతీ విషయం ఆ అభ్యర్థిని నీడలా వెంటాడుతాయి. ఏమైనా పొరపాట్లు జరిగితే ఎన్నిక రద్దవ్వడమే కాదు తదుపరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వీలుండదు. -
సుప్రీంకోర్టులో కృష్ణమోహన్‌రెడ్డికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. గద్వాల ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కృష్ణమోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించింది. హైకోర్టులో ఎందుకు వాదనలు వినిపించలే దని ధర్మాసనం కృష్ణమోహన్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సుందరాన్ని ప్రశ్నించింది. పిటిషనర్ సంతకం ఫోర్జరీ చేసి నోటీసులు అందినట్లు హైకో ర్టును మభ్యపెట్టారని, తామెక్కడా వివరాలు దాచ లేదని సుందరం తెలిపారు. అఫిడవిట్లో ఫిక్స్డ్ డిపాజిట్లు అని మాత్రమే ఉందని, సేవింగ్స్ ఖాతా ల గురించి కాదన్నారు. అయితే, సేవింగ్స్ ఖాతాల గురించి వెల్లడించకపోవడం తప్పేనని తెలి పారు. మొత్తం ఆరు ఖాతాలకు సంబంధించి వివా దం చేశారని అందులో తొలి మూడు వివాదరహిత మని చెప్పారు. వివాదాస్పద రూ.1.80 కోట్లు వ్యవ సాయ భూమికి సంబంధించినవని, ఎన్నికలకు ముందుగానే ఆ భూమి అమ్మి వేసినట్లు వివరించారు. ఎన్నికల చట్టాలకు సంబంధించి అన్ని ఖాతాల వివ రాలు వెల్లడించాల్సిందేనని డీకే అరుణ తరఫు సీని యర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తెలిపారు. డీకే అరుణను ఎమ్మె ల్యేగా గుర్తించాలని కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫి కేషన్ ఇచ్చినట్లు ధర్మాస నం దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ఎన్నికల సంఘం, ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేస్తూ హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నట్లు పేర్కొంది. రెండు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ తేదీ వీలైనంత త్వరగా ఇవ్వాలని రవిశంకర్ కోరగా విచారణ నాలుగు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. వెన్నుపోటు రాజకీయాలు: కృష్ణమోహన్‌రెడ్డి ప్రజా క్షేత్రంలో గెలవలేకనే ఫోర్జరీ సంతకాలతో వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యే కావాలని డీకే అరుణ చూస్తున్నారని బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో కృష్ణమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనకు నోటీసులు అందలేని అందుకే హైకోర్టుకు వెళ్లలేదన్నారు. తన సంతకం ఫోర్జరీ చేశారని తెలిసి తమ వాదనలు వినాలని హైకోర్టును అభ్యర్థించినా వినలేదన్నారు. ఎన్నికలకు ముందుగానే కొన్ని భూములు విక్రయించానని, వివరాలు అఫిడవిట్లో చూపాల్సిన అవసరం లేదన్నారు. -
గద్వాల ఎమ్మెల్యే DK అరుణ.! హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో శాసనసభ్యుడి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. ఎన్నికల్లో ఆయన తర్వాత రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణను 2018 డిసెంబర్ 12 నుంచీ ఎమ్మెల్యేగా పరిగణించాలని ఆదేశించింది. తప్పుడు ఎన్నికల అఫిడవిట్ సమర్పించిన కృష్ణమోహన్‌రెడ్డికి రూ.2,50,000 జరిమానా విధించింది. మరో రూ.50,000ను పిటిషనర్‌కు పరిహారంగా చెల్లించాలని సూచించింది. డీకే అరుణ పిటిషన్‌తో.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కృష్ణమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యరి్థగా డీకే అరుణ పోటీ చేశారు. ఇందులో కృష్ణమోహన్‌రెడ్డికి 1,00,057 ఓట్లు, అరుణకు 71,612 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే ఎన్నికల సమయంలో కృష్ణమోహన్‌రెడ్డి సమర్పించిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని.. ఆయన ఎన్నికను రద్దు చేసి, తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరుతూ డీకే అరుణ తరఫున న్యాయవాది యోగితా ప్రకాశ్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ వినోద్‌కుమార్ గురువారం తీర్పు వెలువరించారు. భూములు, ఖాతాల వివరాలు చెప్పలేదని.. అంతకుముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపిస్తూ.. కృష్ణమోహన్‌రెడ్డి, ఆయన భార్య పేరుతో ఉన్న వాహనాలకు ట్రాఫిక్ చలానాలు ఉన్నా చెల్లించలేదని, ఈ వివరాలను అఫిడవిట్లో పేర్కొన లేదని కోర్టుకు వివరించారు. గద్వాల ఎస్బీఐ, ఏడీబీ బ్యాంకుల్లో కృష్ణమోహన్‌రెడ్డి, ఆయన భార్య జ్యోతికి ఉన్న ఖాతాల వివరాలను చెప్పలేదన్నారు. సిబిల్ వివరాల ప్రకారం ఎమ్మెల్యే బ్యాంకులకు రూ.1,09,67,737 రుణాలు బకాయిలు ఉన్నా వెల్లడించలేదని, అలాగే జాతీయ బ్యాంకుల్లో మరో రూ.1.22 కోట్ల రుణాలున్నా పేర్కొనలేదని వివరించారు. అదే విధంగా పుద్దూరులో వారికి ఉన్న 24 ఎకరాల భూమిని అఫిడవిట్లో చూపలేదన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినా స్పందన రాలేదు. పత్రికా ప్రకటన ఇచ్చినా స్పందించలేదు. దీంతో న్యాయమూర్తి తీర్పును జూన్ 22న తీర్పును రిజర్వు చేసి గురువారం వెల్లడించారు. అయితే ఈ కేసులో కృష్ణమోహన్‌రెడ్డి తరఫున వాదనలు వినిపించేందుకు ఆగస్టు 18న న్యాయవాది మనోహర్ వచ్చారని, ఈ మేరకు అప్లికేషన్ దాఖలు చేశారని రిజిస్ట్రీ హైకోర్టుకు వివరించింది. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. జూన్ 22నే తీర్పు రిజర్వు చేశామని, ఈ నేపథ్యంలో మధ్యంతర అప్లికేషన్‌ను అనుమతించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా..బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని, తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు అనంతరం బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తీర్పు వెలువరించిందన్నారు. తన రాజకీయ ప్రత్యర్థులు నాలుగు అభియోగాలతో కోర్టుకు వెళ్లారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని, కొందరికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేక దొడ్డిదారి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తాను గత ఎన్నికల్లో 37వేల మెజారీ్టతో గెలిచానని, ఈసారి 50వేల మెజారీ్టతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా న్యాయం జరిగింది: డీకే అరుణ తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తూ ఎన్నికల ప్రక్రియను అపహస్యం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ, అభ్యర్థులకు ఈ రోజు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చెంపపెట్టు వంటిదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. ఈ తీర్పు మూడేళ్ల ముందే రావాల్సిందని.. ఇప్పటికైనా తనకు న్యాయం జరిగిందని భావిస్తున్నామని చెప్పారు. హైకోర్టు తీర్పును గద్వాల ప్రజలకు అంకితం చేస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఘన విజయం సాధిస్తుందనే దానికి ఇది సంకేతమని పేర్కొన్నారు. -
ఆలస్యమైనా న్యాయం జరిగింది: డీకే అరుణ
సాక్షి, మహబూబ్ నగర్: గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై అనర్హత వేటు వేసిన తెలంగాణ హైకోర్టు.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఈ తీర్పుపై డీకే అరుణ స్పందించారు. తీర్పు ఆలస్యమైనా న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉందని అన్నారామె. ‘‘తీర్పు ఆలస్యమైన న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరు ఈ తీర్పును స్వాగతిస్తారు.. గౌరవిస్తారు. ప్రభుత్వం కూడా బేషజాలకి పోకుండా కోర్టు తీర్పును గౌరవించాలి. కోర్టు ఆర్జర్ కాపీ రాగానే ఎలక్షన్ కమీషనర్, అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ ను కలుస్తాను’’ అని తెలిపారామె. ఇక.. అనర్హత వేటుపడిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సాక్షి టీవీతో మాట్లాడుతూ.. ‘‘ఈవీఎం వివిపాట్లను మానిప్లేట్ చేయటం, స్థిర చరస్తుల వివరాలు సరిగా ప్రకటించకపోవడం, వాహనంపై ఉన్న చలాన్ ను కట్టకపోవడం పై కోర్టు నాపై అనార్హత వేటు వేసింది. ఈ వ్యవహారంలో నాకు ఎలాంటి నోటీసులు ముందుగా అందలేదు. కోర్టు తీర్పు కూడా ఏకపక్షంగా వచ్చింది. ఈ అనర్హత వేటుపై పైకోర్టుకు వెళ్తాను’’ అని తెలిపారాయన. గద్వాలకు పొలిటికల్ టూరిస్టులు ఎక్కువని.. గద్వాల కచ్చితంగా తన అడ్డేనన్న కృష్ణమోహన్‌రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. సంబంధిత వార్త: గద్వాల ఎమ్మెల్యేపై అనర్హత.. తీర్పు కాపీలో ఏముందంటే.. -
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో భారీ వర్షం
సాక్షి, గద్వాల : గత వారం రోజులుగా భారీ వర్షం కురుస్తుండటంతో పట్టణం తడిసి ముద్దయింది. భారీ వర్షంతో గద్వాల పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. గతంలో ఎన్నడు లేని విధంగా ముఖ్యంగా గంజి పేట, కుంట వీధి , రాజీవ్ మార్గ్, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ గుండా భారీ వర్షపునీరు నిల్వ ఉంది. దీంతో కాలనీలోని ప్రజలతో పాటు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనంటున్నారు. భారీ వర్షం వల్ల కాలనీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీధులను, ప్రధాన కూడళ్లను ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్‌తో కలిసి పరిశీలించారు. మున్సిపల్ సిబ్బందితో డ్రైనేజీ వ్యవస్థ మెరుగు పరచడంతో పాటు మురుగునీరు నిల్వ ఉండకుండా చూసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల దగ్గర పునరావాసం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చెరువులు వాగులు, వంకలు నిండుకుండలా ఉన్న దృష్టి ఆ వైపు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గత రెండు రోజులుగా కురిసిన వర్షాల వల్ల గద్వాలలో 82.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. -
గులాబీలో గలాటా..!
సాక్షి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో రాజకీయ అలజడి రేగింది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం తారాస్థాయికి చేరింది. దళిత వర్గానికి చెందిన తనపై పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారంటూ అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. శుక్రవారం హైదరాబాద్ వెళ్లిన అబ్రహం.. నియోజకవర్గంలో తాను ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడ మీడియాకు వివరించారు. రెండురోజుల క్రితం తన నియోజకవర్గ పరిధిలోని అయిజ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలోనూ అబ్రహం.. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా ఇలాకాలో ఇతరుల జోక్యం తగదు. నేనూ ఎమ్మెల్యేనే.. ఆయనా ఎమ్మెల్యేనే.. పక్క నియోజకవర్గానికి చెందిన ఆయన ఇక్కడ నాపై పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై పరోక్షంగా ఫైర్ అయ్యారు. దీంతో అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న ఇరువురు మధ్య విభేదాలు ఎట్టకేలకు బట్టబయలయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లో ఏకంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేరును ప్రస్తావిస్తూ అబ్రహం ఆరోపణలు చేశారు. తన నియోజకవర్గంలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. దళితవర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టే తనపై పెత్తనం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన నియోజవకర్గంలో కాలుపెడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. తన నియోజకవర్గంలో గద్వాల ఎమ్మెల్యేపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ పరిణామాలు ఎటూ దారి తీస్తాయోననే ఆందోళన ఆ జిల్లాలోని గులాబీ కార్యకర్తల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. చిచ్చుపెట్టిన ‘పుర’ టికెట్లు.. త్వరలోనే జరగనున్న మున్సిపల్ ఎన్నికలే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య విభేదాలు సృష్టించాయి. అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని అయిజ మున్సిపాలిటీలో ఈ సారి తను సూచించిన అభ్యర్థులకే బీ ఫారాలు ఇవ్వాలని.. లేకపోతే ఆయా స్థానాల్లో రెబెల్స్‌ను బరిలోకి దింపి వారిని గెలిపించుకుని తీరుతానంటూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఫోన్లో తనను బెదిరించారని ఎమ్మెల్యే అబ్రహం ఆరోపిస్తున్నారు. మంచి తనాన్ని చేతకాని తనంగా భావించిచొద్దని సూచించిన అబ్రహం.. పార్టీకి నష్టం చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోనని హెచ్చరించారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటానని ఎవరికీ అన్యాయం జరగనీయబోనని కార్యకర్తల సమావేశంలో తేల్చి చెప్పారు. ఇదీలా ఉంటే.. ఇరువురి ఎమ్మెల్యేల మధ్య చిచ్చుకు అదే పార్టీకి చెందిన మరో నేత కారణమనే చర్చ జరుగుతోంది. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ తన ఆధిపత్యం కోసం తను చెప్పిన వారికి టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేసి విఫలమైన సదరు నాయకుడు తాజాగా ‘పుర’పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో అబ్రహంకు ఫోన్ చేయించినట్లు అధికార పార్టీలోనే చర్చ హాట్‌టాపిక్‌గా మారింది. ఏదేమైనా ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న విభేదాలు.. ప్రస్తుతం గద్వాల జిల్లాలో ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పరిస్థితి ఇలానే ఉంటే త్వరలోనే జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో అనే ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఇద్దరు ఎమ్మెల్యే మధ్య నెలకొన్న విభేదాలపై అధిష్టానం ఏ మేరకు స్పందిస్తుంది? ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. మరోవైపు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం తనపై చేసిన విమర్శలపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అంతగా స్పందించలేదు. ఆయన వివరణ కోసం సాక్షి ఫోన్లో సంప్రదించగా... ‘అలంపూర్ ఎమ్మెల్యే చేసిన విమర్శలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఎవరి గురించి అన్నారో తెలియదు. ఏమున్నా... పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా’ అని సమాధానం చెప్పారు. -
డిష్యుం.. డిష్యుం
గద్వాల : గద్వాల రాజకీయ ఆధిపత్యం డిప్యూటీ సీఎం సాక్షిగా తోపులాటలు, అరుపులు, కేకలు నినాదాలతో అట్టుడికింది. రెండువర్గాలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయన్న విషయాన్ని పోలీసులు అంచనా వేయలేక బలగాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోలేకపోయారు. దీంతో డిప్యూటీ సీఎం సభ వద్ద ఆందోళనలు ఎక్కువయ్యాయి. గద్వాల నియోజకవర్గంలో డీకే కుటుంబానికి రెండు పర్యాయాలుగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పోటీనిస్తున్నారు. వీరిరువురి మధ్య రెండు ఎన్నికలు జరిగాయి. ఇంతటి పోటీ ఉన్న గద్వాలలో ఆసుపత్రుల కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య శనివారం గద్వాలకు వచ్చారు. ఆయన వస్తున్న కార్యక్రమానికి స్వాగతం చెప్పే ఏర్పాట్లు, ప్రకటనల్లోనూ రెండు పార్టీల మధ్య పోటాపోటీ కనిపించింది. అదేవిధంగా కార్యక్రమాల్లోనూ ఆధిపత్యం కొరకు ఎవరి ప్రయత్నం వారు చేశారు. ఇరువురి ప్రయత్నాలతో కార్యక్రమం కేకలు, అరుపులు, తోపులాటలతో అర్థంతరంగా ముగిసింది. డిప్యూటీ సీఎం కార్యక్రమంలో ఇలా... ఏరియా ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన వేదికపైకి ముందే చేరుకున్న ఎమ్మెల్యే డీకే అరుణ డిప్యూటీ సీఎంకు స్వాగతం చెప్పారు. అదే ప్రసంగంలోనే వేదికపై ప్రజాప్రతినిధులు కానివారు ఉండరాదని డిమాండ్ చేశారు. కనీసం మాజీ ఎమ్మెల్యే కాని వ్యక్తులు కూడా వేదికపై కూర్చోవడం సరికాదని, అలాంటి వారి ని వేదికపై నుంచి పంపాలని పదే పదే కోరారు. డిప్యూటీ సీఎం రాజయ్య జో క్యం చేసుకొని ఎమ్మెల్యే అరుణకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ఎమ్మెల్యే తన పట్టును వీడకపోవడంతో పెద్ద ఎత్తున నినాదాలు, ఈలలు, అరుపులు జరిగాయి. ఒక దశలో వేదికపై ఉన్న నేతల మధ్య వాగ్వాదం పెరిగిన సందర్భంలో అక్కడికి వేదిక దిగువన ఉన్న నాయకులు చొరబడి తోపులాటకు దిగా రు. అక్కడే ఉన్న డీఎస్పీ బాలకోటి ఆ ధ్వర్యంలోని పోలీసుల బృందం వేదిక పై ఉన్న డిప్యూటీ సీఎం, ఇతర నేతలకు పోలీసులు రక్షణగా నిలిచారు. కింద ఉన్న వారిని చెదరగొట్టేలా లాఠీలను గాల్లోకి విసురుతూ జనాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఎంతకూ పరిస్థితి సద్దుమణగకపోవడం, వేదికలో ఉన్న జనం చెల్లాచెదురు కావడం, సభ జరిగే పరిస్థితులు లేని పరిస్థితి ఏర్పడింది. డిప్యూటీ సీఎం సభావేదికను దిగి వెళ్లిపోవడంతో వేదికపైనే ఉన్న అరుణ అనంతరం కార్యకర్తలకు అభివాదం చేసి వెళ్లిపోయారు. అరుణ, కృష్ణమోహన్‌ల మధ్య ఆరేళ్లుగా రాజకీయ పోరు... ఒకే ఇంటి నాయకత్వంలో పనిచేసిన డీకే అరుణ, కృష్ణమోహన్‌రెడ్డిలు 2004 ఎన్నికల అనంతరం వేర్వేరు పార్టీల్లోకి మారారు. డీకే అరుణ భర్త డీకే భరతసింహారెడ్డి సోదరి కుమారుడైన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి 2005 ఎన్నికల్లో గద్వాల జెడ్పీటీసీగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. నాటి నుంచి అరుణ, కృష్ణమోహన్‌రెడ్డిల మధ్య రాజకీయ విమర్శలు ప్రారంభమయ్యాయి. 2009 ఎన్నికల్లో కృష్ణమోహన్‌రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం రావడంతో ఆ ఎన్నికల్లో గెలుపు కోసం రెండు కుటుంబాల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు పెరిగాయి. ఆ ఎన్నికల్లోనూ అరుణ తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. భరతసింహారెడ్డికి చెందిన క్రస్సింగ్ యూనిట్లో నీలి కిరోసిన్ ఉందంటూ కృష్ణమోహన్‌రెడ్డి మీడియాకు చూపించడంతో పాటు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెండువర్గాల మధ్య వ్యక్తిగత విమర్శలు ప్రారంభమయ్యాయి. ఆస్తులపై విచారణలు, వాటిని కూలగొట్టడానికి ప్రయత్నాలు చేశారు. క్రస్సింగ్ ప్లాంట్‌లో అనుమతికి మించి గుట్టలను కబ్జా చేసుకున్నారని కృష్ణమోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో విచారణలు, సర్వేలు జరిగాయి. ఈ సందర్భంలోనూ కృష్ణమోహన్‌రెడ్డి, భరతసింహారెడ్డిల మధ్య తిట్ల దండకం జరిగింది. కృష్ణమోహన్‌రెడ్డికి చెందిన పూడూరు గోదాములలో రోడ్డు కబ్జాలను చూపి ప్రొక్లెయినర్లతో కూలగొట్టించారు. ఇలా కొనసాగుతున్న వైరం మరోసారి 2014 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే ఎన్నికల రంగం వేదికైంది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కృష్ణమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా డీకే అరుణలు పోటీ పడ్డారు. ఈ సందర్భంలోనూ పోటాపోటీ విమర్శలు జరిగాయి. ఇలా అరుణ, కృష్ణమోహన్‌రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. ఈ క్రమంలో అధికార పార్టీలో ఉన్న కృష్ణమోహన్‌రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో తన ప్రత్యేకతను చాటుకునేలా ప్రయత్నిస్తుండగా ఎమ్మెల్యేగా ఉన్న అరుణ తాను ప్రజాప్రతినిధి కనుక కార్యక్రమాల్లో తన గుర్తింపు ఉండాలనే పట్టు ఉంది. ఈ తరుణంలోనే గద్వాల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ భాస్కర్, డీకే అరుణల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రతి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆధిపత్యం కోసం రెండు వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మొదటిసారిగా డిప్యూటీ సీఎం కార్యక్రమం గద్వాలకు ఖరారు కావడం, ఆధిపత్యం కోసం రెండు వర్గాలు ప్రయత్నించడం వల్లే గద్వాలలో డిప్యూటీ సీఎం కార్యక్రమం రసాభాసగా మారిందన్న చర్చ జరుగుతుంది. -
భయపెట్టి పాలించలేరు
గద్వాల/న్యూటౌన్, న్యూస్‌లైన్: అక్రమ కేసులతో ఇరికించి ఇబ్బం దులకు గురిచేస్తూ ప్రజలందరినీ గుప్పి ట్లో పెట్టుకొని పాలన చేయాలని చూడ టం సరికాదని, తన భార్య మంత్రి కావడంతో డీకే భరతసింహారెడ్డి చేస్తున్న దుష్టపాలన పోయే రోజులు ఇక ఎన్నోరోజులు లేవని వైఎస్ఆర్ సీపీ గద్వాల సమన్వయకర్త కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. వ్యాపారాలను కబ్జా చేసుకుని పోటీకి వచ్చే వ్యక్తులపై అక్రమకేసులు బనాయిస్తూ అనగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. జిల్లాలో భరతసింహారెడ్డి అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుందన్నారు. ఇటిక్యాల మాజీ ఎంపీపీ ఖగనాథ్రెడ్డిపై భరతసింహారెడ్డి అక్రమంగా కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ శనివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ, టీఆర్ఎస్, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు సైతం భరతసింహారెడ్డి చేస్తున్న అక్రమాలను చూస్తూ ఉండటం పట్ల ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. గద్వాలకు డీఎస్పీగా ఒక మహిళాను నియమిస్తే ఎర్రవల్లి చౌరస్తా నుంచి గద్వాలకు రాకుండానే పంపేసిన చరిత్ర గద్వాల మంత్రిది అన్నారు. భరతసింహారెడ్డి కేవలం సంపాదన కోసమే ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజల క్షేమం కోసం కాదన్నారు. ఇటిక్యాల మాజీ ఎంపీపీ ఖగనాథ్‌రెడ్డి క్రషింగ్ యూనిట్‌ను పెట్టారన్న ఈర్ష్యతోనే అతనిపై భరతసింహారెడ్డి బనాయించారని ఆరోపించారు. ఇకనైనా అక్రమకేసును ఉపసంహరించుకోవాలని కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు. వేధించడమే వారికి తెలుసు: గట్టు తిమ్మప్ప టీఆర్ఎస్ నేత, డీసీసీబీ మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప మాట్లాడుతూ.. తప్పు పట్టేందుకు ప్రయత్నించే వ్యక్తులను గుర్తించి మరీ అనగదొక్కేందుకు డీకే కుటుంబం ప్రయత్నించడం నాటి నుంచి నేటి వరకు జరుగుతుందన్నారు. గట్టు భీముడు కుటుంబం ఎదుగుతుందన్న అక్కస్సుతోనే ఎన్నో కేసులు పెట్టించారన్నారు. అయినా తాము భయపడలేదన్నారు. ఎంత వేధిస్తే అంతపైకి వచ్చేలా ప్రయత్నించామన్నారు. ప్రజలంతా ఏకమైతే డీకే కుటుంబ పాలన ఎన్నాళ్లూ ఉండదన్న వాస్తవాన్ని గమనించాలన్నారు. అందరు ఒక్కటై ఎదురుతిరిగితేనే డీకే కుటుంబ పాలనకు తెరపడుతుందన్నారు. అనంతరం ఆర్డీఓ నారాయణరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాలో టీఆర్ఎస్ నాయకులు గంప గోవర్ధన్, టీఆర్ఎస్వీ నాయకులు మోనేష్, టీజేఏసీ నాయకులు భీమేశ్వర్రెడ్డి, డీటీఎఫ్ నాయకులు ప్రభాకర్, షేక్‌పల్లి సర్పంచ్ రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు నారాయణ, సర్పంచ్ జయరామయ్య, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, నాయకులు భీంసేన్‌రెడ్డి, లోకారెడ్డి, తిమ్మారెడ్డి, నాగబలిమి, మాణిక్యరెడ్డి, బలరాముడు తదితరులు ప్రసంగించారు.