breaking news
krishnachaithanya
-
నవ్వుకోవడానికి మా సినిమాకి రండి – నితిన్
‘‘నేను ఇండస్ట్రీకొచ్చిన 16 ఏళ్లలో 25సినిమాలు చేశా. ఇన్నేళ్లు నాపై ఇంత ప్రేమను చూపించిన అభిమానులకు థ్యాంక్స్. ప్రతి సినిమాకీ నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటా. ‘ఛల్ మోహన్‌రంగ’ గొప్ప కథ అని చెప్పను. ప్రేక్షకులు హ్యపీగా ఎంజాయ్ చేయటానికి తీశాం. హాయిగా నవ్వుకోవటానికి మా సినిమాకు రండి’’ అని నితిన్ అన్నారు. నితిన్, మేఘా ఆకాశ్ జంటగా కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఛల్ మోహన్‌రంగ’. నిఖితారెడ్డి సమర్పణలో సుధాకర్ రెడ్డి, పవన్ కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో కృష్ణ చైతన్య మాట్లాడుతూ–‘‘ఏ ఉద్దేశంతో సినిమా తీశామో దాన్ని చేరుకున్నాం అనిపిస్తోంది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులు నవ్వుతూనే ఉన్నారు. పెద్ద కథ ఉన్నప్పుడ్డు పని సులువు అవుతుంది. చిన్న కథను చెప్పేటప్పుడు ప్రేక్షకులను ఎంగేజింగ్‌గా చేయాలంటే కష్టం. మా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారంటే ఆనందంగా ఉంది. టీమ్ అందరికీ చాలా థ్యాంక్స్’’ అన్నారు. ‘‘చిన్న పాయింట్‌ని తీసుకుని అందంగా చెప్పి హిట్ అందుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు నటుడు నరేశ్. ‘‘మా సినిమాపై ఇంత ప్రేమను చూపిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. నాకు ఈ అవకాశమిచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, నితిన్‌కి కృతజ్ఞతలు’’ అన్నారు మేఘా ఆకాశ్. సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి, నటులు మధునందన్, శ్రీను పాల్గొన్నారు. -
ఎస్బీఐలో భారీ స్కాం : కష్ణచైతన్య అరెస్ట్
సాక్షి, విజయవాడ : విజయవాడలోని గాయత్రీనగర్‌లో ఉన్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారు ఆభరణాలను బ్యాంకులో పనిచేసే సిబ్బందే మాయం చేసినట్టు వెల్లడైంది. మొత్తం 10.2 కిలోల బంగారు ఆభరణాలు బ్యాంకు లాకర్ నుంచి మాయమైనట్టు గుర్తించారు. బ్యాంకు హెడ్‌క్లర్క్ కృష్ణ చైతన్య.. బ్యాంకు సిబ్బంది దిలీప్, ఫణికుమార్ సహాయంతో లాకర్ నుంచి బంగారు నగలను తీసి నగరంలోని మాచవరంలో ఉన్న మణప్పురంలో తనఖా పెట్టి రూ.3 కోట్లు రుణం తీసుకున్నట్టు సీఐడీ విచారణలో తేలింది. కృష్ణచైతన్య ఆ నగదును షేర్ మార్కెట్లో పెట్టినట్లు సమాచారం. పలువురు ఖాతాదారులు తమ గోల్డ్ లోన్లు చెల్లించి ఆభరణాలు తిరిగి ఇవ్వమని బ్యాంకు హెడ్ క్లర్క్‌ను అడగగా ఆయన ఆభరణాల కోసం రేపు రమ్మని.. తర్వాత రమ్మని తిప్పుతున్నారు. దీంతో అనుమానమొచ్చిన ఖాతాదారులు బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాంకు అధికారులు సీఐడీ విభాగానికి ఫిర్యాదు చేశారు. సీఐడీ ఎస్పీ కాళిదాసు వెంకట రంగారావు ఆధ్వర్యంలో సిబ్బంది విచారణ నిర్వహించారు. బ్యాంకు సిబ్బందే సూత్రధారులని తేలడంతో కృష్ణచైతన్య, దిలీప్, ఫణికుమార్‌లను అరెస్టు చేశారు.