నవ్వుకోవడానికి మా సినిమాకి రండి – నితిన్‌ | Director Krishna Chaitanya Speech at Chal Mohana Ranga Success meet | Sakshi
Sakshi News home page

నవ్వుకోవడానికి మా సినిమాకి రండి – నితిన్‌

Apr 9 2018 12:37 AM | Updated on Apr 9 2018 12:37 AM

Director Krishna Chaitanya Speech at Chal Mohana Ranga Success meet - Sakshi

కృష్ణచైతన్య, నితిన్, మేఘా ఆకాశ్, సుధాకర్‌రెడ్డి

‘‘నేను ఇండస్ట్రీకొచ్చిన 16 ఏళ్లలో 25సినిమాలు చేశా. ఇన్నేళ్లు నాపై ఇంత ప్రేమను చూపించిన అభిమానులకు థ్యాంక్స్‌. ప్రతి సినిమాకీ నా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటా. ‘ఛల్‌ మోహన్‌రంగ’ గొప్ప కథ అని చెప్పను. ప్రేక్షకులు హ్యపీగా ఎంజాయ్‌ చేయటానికి తీశాం. హాయిగా నవ్వుకోవటానికి మా సినిమాకు రండి’’ అని నితిన్‌ అన్నారు. నితిన్, మేఘా ఆకాశ్‌ జంటగా కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఛల్‌ మోహన్‌రంగ’. నిఖితారెడ్డి సమర్పణలో సుధాకర్‌ రెడ్డి, పవన్‌ కల్యాణ్‌ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో కృష్ణ చైతన్య మాట్లాడుతూ–‘‘ఏ ఉద్దేశంతో సినిమా తీశామో దాన్ని చేరుకున్నాం అనిపిస్తోంది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులు నవ్వుతూనే ఉన్నారు. పెద్ద కథ ఉన్నప్పుడ్డు పని సులువు అవుతుంది. చిన్న కథను చెప్పేటప్పుడు ప్రేక్షకులను ఎంగేజింగ్‌గా చేయాలంటే కష్టం. మా సినిమాని ఎంజాయ్‌ చేస్తున్నారంటే ఆనందంగా ఉంది. టీమ్‌ అందరికీ చాలా థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘చిన్న పాయింట్‌ని తీసుకుని అందంగా చెప్పి హిట్‌ అందుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు నటుడు నరేశ్‌.  ‘‘మా సినిమాపై ఇంత ప్రేమను చూపిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌. నాకు ఈ అవకాశమిచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, నితిన్‌కి కృతజ్ఞతలు’’ అన్నారు మేఘా ఆకాశ్‌. సుధాకర్‌ రెడ్డి, నిఖితారెడ్డి, నటులు మధునందన్, శ్రీను పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement