breaking news
Krishna Murthy janga
-
బీసీలకు ప్రత్యేక కమిషన్ ను ఏర్పాటు ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది
-
జగన్ దీక్షను జయప్రదం చేయండి
గురజాల: ప్రజల సమస్యలపై పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ైవె ఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టే దీక్షను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గురజాల మాజీ శాసనసభ్యుడు జంగా కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం ఇక్కడ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. అన్ని రకాల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలుచేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. మొదటి విడత జాబితాలో 20శాతం మందికి కూడ పూర్తిగా రుణమాఫీ కాలేదని ,రెండో విడత జాబితా అసంపూర్తిగా విడుదల చేసి లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రైతులు మొదట్లో ఇచ్చిన పత్రాలనే పదేపదే బ్యాంకుల్లో, తహశీల్దార్ కార్యాలయాల్లో ఇవ్వమని కాళ్లరిగేలా తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో జగన్మోహన్రెడ్డి ప్రస్తావించిన ప్రతిసారి మాట్లాడనీయకుండా తెలుగుతమ్ముళ్లు అడ్డుకున్నారన్నారు. తణుకులో ఈనెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో జగన్మోహన్రెడ్డి చేపట్టే దీక్ష కు పార్టీ నాయకులు,కార్యకర్తలు అధికసంఖ్యలో తరలివెళ్లాలని సూచించారు.