breaking news
korrapadu
-
ఎంపీపీగా కొర్రపాడు MPTC వెన్నపూస పుష్పలత ఎన్నిక
-
‘డీఎన్ఆర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం’
రాజుపాలెం(వైఎస్ఆర్ జిల్లా): స్వర్గీయ దొంతిరెడ్డి నారాయణరెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలని పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పిలుపు నిచ్చారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి కార్యకర్తా కృషి చేయాలని కోరారు. శుక్రవారం వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం కొర్రపాడులో దొంతిరెడ్డి నారాయణరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన ప్రథమ వర్థంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమళ్ల శివప్రసాదరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వైఎస్సార్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


