breaking news
Korea district
-
వీడెంత దుర్మార్గుడో చూడండి
రాయ్‌పూర్: బాలింత అని కూడా చూడకుండా మహిళను దారుణంగా రోడ్డు మీదకు ఈడ్చిపారేసిన అమానవీయ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. కొరియా జిల్లా జానక్‌పూర్ బ్లాక్‌లోని బార్వానీ కన్య ఆశ్రమంలో ఈ దారుణం జరిగింది. హాస్టల్ సూపరింటెండెంట్ సుమిళ సింగ్ భర్త రంగ్లాల్ సింగ్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సుమిళ సింగ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆమె స్థానంలో లీలావతి అనే మహిళను కొత్త సూపరింటెండెంట్‌గా నియమించారు. అసలేం జరిగింది..? హాస్టల్లో పనిచేస్తున్న ఓ మహిళ తన 3 నెలల బిడ్డతో కలిసి అక్కడే ఓ గదిలో ఉంటోంది. రూము ఖాళీ చేయాలని ఈనెల 10న ఆమెకు రంగ్లాల్ హుకుం జారీ చేశాడు. ఖాళీ చేసేందుకు ఆమె నిరాకరించడంతో బలప్రయోగానికి దిగాడు. మంచం మీద కూర్చున్న ఆమెను దుప్పటితో సహా కిందికి ఈడ్చిపాడేశాడు. అంతటితో ఆగకుండా బాధితురాలిని బలవంతంగా బయటకు లాక్కుపోయాడు. సుమిళ సమక్షంలో ఈ దారుణమంతా జరిగినా భర్తను ఆమె వారించకపోవడం గమనార్హం. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈనెల 11న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆదివారం బాధితురాలిని పరామర్శించి, ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. #WATCH Chhattisgarh:Ranglal Singh,husband of School Superintendent Sumila Singh misbehaved with a cleaner at Barwani Kanya Ashram in Korea, after she took shelter at students' hostel with her 3-month-old baby.Police says,“FIR filed.Probe on.Accused will be arrested soon.” (18.08) pic.twitter.com/NFayVvh8GZ — ANI (@ANI) August 19, 2019 -
విద్యార్థులకు టీచర్ 'మందు' పాఠాలు
రాయపూర్: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు 'మందు' పాఠాలు బోధిస్తున్నాడు. విద్యార్థులకు మార్గదర్శిగా నిలవాల్సిన ఉపాధ్యాయుడు తాగుడు పాఠాలు నేర్పుతూ దొరికిపోయాడు. ఛత్తీస్ గఢ్ కొరియా జిల్లా ప్రభుత్వ పాథమిక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న శివబరన్ మద్యం పాఠాలు చెబుతూ వీడియోలో చిక్కారు. డీ ఫర్ దారు(మద్యం), పీ ఫర్ పియో(తాగు) అంటూ కొత్త భాష్యాలు చెప్పారు. వీటిని బ్లాక్ బోర్డుపై రాసి పదేపదే విద్యార్థులతో వల్లించారు. జర్నలిస్ట్ ఒకరు వీడియో తీయడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. మందు పాఠాలు బోధించే సమయంలో గురువుగారు మద్యం మత్తులో ఉండడం గమనార్హం. అయితే సిలబస్ ప్రకారమే పాఠాలు చెబుతున్నానని సమర్థించుకున్నాడు శివబరన్. అయితే మందు పుచ్చుకుని పాఠశాలకు రావడం తప్పేనని ఒప్పుకున్నాడు. మద్యం తాగొచ్చి ఇంకేప్పుడు పాఠాలు చెప్పబోనని చెంపలు వాయించుకున్నాడు. శివబరన్ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సంజీవ్ ఝా విచారణకు ఆదేశించారు.