breaking news
kondapally seetharamaiah
-
కొండపల్లి కోటేశ్వరమ్మ ఇకలేరు
సాక్షి, విశాఖపట్నం/బీచ్‌రోడ్డు/సాక్షి, అమరావతి: పీపుల్స్‌వార్ గ్రూప్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య సతీమణి కొండపల్లి కోటేశ్వరమ్మ కన్నుమూశారు. కొన్నేళ్లుగా విశాఖ నగరం మద్దిలపాలెంలోని కృష్ణా కాలేజీ ఎదురుగా మనవరాలు అనురాధ ఇంట్లో ఉంటున్నారు. గత నెల 5న నూరేళ్ల పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఆమె కొద్దిరోజులక్రితం బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురవగా.. నగరంలోని కేర్ ఆస్పత్రిలో చేర్చించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచనల మేరకు ఐదు రోజులక్రితం ఇంటికి తీసుకొచ్చారు. బుధవారం వేకువజామున ఆమె తుదిశ్వాస విడిచారు. కోటేశ్వరమ్మ పార్థివదేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు మనవరాలి ఇంటివద్దే ఉంచారు. అనంతరం ఆమె దేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనకోసం ఆంధ్ర మెడికల్ కళాశాలకు అప్పగించారు. కోటేశ్వర మ్మ పార్థివదేహానికి పలు ప్రజాసంఘాలు నేతలు, సీపీఐ, సీపీఎం నేతలు నివాళులర్పించారు. ఐదేళ్లకే పెళ్లి.. ఏడేళ్లకే వితంతువు.. కృష్ణా జిల్లా పామర్రులో సుబ్బారెడ్డి, అంజమ్మ దంపతులకు 1918లో కోటేశ్వరమ్మ జన్మించారు. ఐదేళ్ల వయస్సులోనే మేనమామ వీరారెడ్డితో బాల్యవివాహం చేశారు. పెళ్లయిన రెండేళ్లకే భర్త మరణించటంతో వితంతువుగా మారారు. టీచర్ల సలహాతో తండ్రి ఆమెను హైస్కూల్లో చేర్చారు. చిన్న వయస్సులోనే తన తల్లి మేనమామతో కలిసి జాతీయోద్యమంలో ఆమె పాల్గొన్నారు. ఆ సమయంలోనే కమ్యూనిస్టు భావజాలానికి ఉత్తేజితుడై కార్యకర్తగా పనిచేస్తున్న కొండపల్లి సీతారామయ్యతో పరిచయ మేర్పడింది. అప్పటి సంప్రదాయాలు, ఊళ్లోవారి మనోభావాలకు వ్యతిరేకంగా సీతారామయ్యను తన 18వ ఏట పెళ్లి చేసుకున్నారు. వారికి కుమార్తె కరుణ, కుమారుడు(చంద్రశేఖర్ ఆజాద్) జన్మించారు. భర్తతోపాటు తానూ పార్టీ కార్యకర్తగా పనిచేసి అనేకసార్లు జైలుకెళ్లారు. వివాహమైన కొన్నేళ్లకు సీతారా మయ్య పీపుల్స్‌వార్ గ్రూప్‌ను స్థాపించారు. అనంత రం కొన్నాళ్లకు సీతారామయ్య.. కోటేశ్వరమ్మను ఒం టరిగా విడిచిపెట్టి పిల్లలతోపాటు వరంగల్ వెళ్లిపోయారు. తన కాళ్లపై తాను నిలబడాలని నిశ్చయించు కున్న ఆమె 37 ఏళ్ల వయస్సులో హైదరాబాద్‌లోని ఆంధ్ర మహిళాసభలో మెట్రిక్ చదవడానికి చేరారు. ప్రభుత్వమిచ్చిన స్టైఫండ్ సరిపోక రేడియో నాటకా లు, కథలు రాశారు. ఇలా వచ్చిన ఆదాయంలో నెల కు రూ.10 కమ్యూనిస్టు పార్టీకి ఫండ్‌గా ఇచ్చేవారు. కాకినాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల మహిళాæ హాస్టల్లో మేట్రిన్‌గా చేరారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సీతారామయ్య నుంచి పిలుపు వచ్చినా.. కొండపల్లి సీతారామయ్య స్థాపించిన పీపుల్స్‌వార్ పార్టీ ఆయన్నే బయటకు నెట్టింది. ఆ సమయంలో కరుణ కుమార్తెలు(అనురాధ, సుధ) దగ్గరున్న సీతారామయ్య భార్యను చూడాలని ఉందని చెప్పగా అందుకు కోటేశ్వరమ్మ తనకు చూడాలని ఉండాలిగా అంటూ తిరస్కరించారు. తర్వాత స్థిమితపడి సీతారామయ్య వద్దకు వెళ్లారు. జ్ఞాపకశక్తి తగ్గిన ఆయన్ను చూసి ఎంతో బాధపడ్డారు. సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం ఇలా నాలుగు ఉద్యమాలతో ప్రత్యక్ష సంబంధాలున్న జీవితాన్ని గడిపిన ఆమె ప్రజానాట్యమండలి కార్యక్రమాలు, మహిళాసంఘాల నిర్వహణ లో చురుగ్గా పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో మహిళా బుర్రకథ దళాన్ని ఏర్పాటు చేశారు. అమ్మ చెప్పిన ఐదు(గేయ) కథలు, అశ్రు సమీక్షణం, సంఘమిత్ర, నిర్జన వారధి వంటి పుస్తకాలను రాశా రు. ఇందులో 92వ ఏట రాసిన నిర్జన వారధి పుస్త కంలో తన జీవితానికి దర్పణం పట్టారు. ప్రజలను చైతన్యపరిచేవి కళలూ, సాహిత్యమంటూ 2008లో ఓ వ్యాసం రాశారు. 2001లో రంగవల్లి, 2002లో పులుపుల శివయ్య అవార్డులు అందుకున్నారు. కాగా, కొండపల్లి కోటేశ్వరమ్మ మృతి పట్ల సీపీఐ, సీపీఎం రాష్ట్ర కమిటీలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. కొడుకు కడసారి చూపునకూ నోచక.. వరంగల్ ఆర్ఈసీలో చదివిన కుమారుడు చంద్రశేఖర్ ఆజాద్ విప్లవోద్యమంలో చేరాడు. పార్వతీపురం కుట్రకేసులో కొంతకాలం జైలులో ఉండి విడుదలయ్యాక ఒకరోజు కనిపించకుండా పోయాడు. కొన్నాళ్లకు చందు ఆత్మహత్య చేసుకున్నాడంటూ పోలీసులు చెప్పారు. కనీసం కుమారుడి కడసారి చూపునకూ ఆమె నోచుకోలేకపోయారు. భర్త విడిచిపెట్టి వెళ్లాక ఒంటరిగా విజయవాడలో కోటేశ్వరమ్మ ఉన్నప్పుడు ఆమెను చూడటానికి కుమార్తె కరుణ భర్త రమేష్‌బాబుతో వచ్చి వెళ్తుండేవారు. రమేష్‌బాబుకు వడదెబ్బ తగిలి ఆకస్మికంగా మరణించగా అతని మృతి నుంచి కోలుకోలేకపోయిన కరుణ ఆత్మహత్య చేసుకోవడం, తన తల్లి అంజమ్మ మరణించడం కోటేశ్వరమ్మను కలిచివేసిన సంఘటనలు. -
ఎటాకింగ్ స్నాప్
నక్సల్స్ ఉద్యమ నేత కొండపల్లి సీతారామయ్య ఇంటర్వ్యూకు ఆయన తీసిన ఫొటోనే హైలెట్.. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఈ కెమెరా క్లిక్ చేసిన ఫొటోలు విభిన్న కోణాలను ఆవిష్కరించాయి. లాతూర్‌లో భూకంపం మిగిల్చిన బీభత్సాన్ని ఆయన ఫొటోల్లో మరింత వాస్తవికంగా చూపించాడు ఫొటో జర్నలిస్ట్ రవీందర్‌రెడ్డి. ఆయన తీసిన ఫొటోలు 2004లో డీకే పబ్లికేషన్ తీసుకొచ్చిన ‘1858 ఫొటోగ్రాఫ్ హిస్టరీ ఆఫ్ ఇండియా’లో చోటు దక్కించుకున్నాయి. మోస్ట్ సెలబ్రేట్ ఫొటోగ్రాఫర్ల ఫొటోలు ప్రచురించే ఈ సంస్థ అప్పటి ఆంధ్రప్రదేశ్ నుంచి దుగ్గంపూడి రవీందర్‌రెడ్డికి అవకాశం కల్పించింది. ప్రముఖ దినపత్రికల్లో పని చేసిన ఈఫొటో జర్నలిస్ట్ లెన్స్‌లో క్లిక్ అయిన ఓ ఫొటో గురించి ఆయన మాటల్లోనే.. దుగ్గంపూడి రవీందర్‌రెడ్డి ravistudios@gmail.com 1992, డిసెంబర్ 5న అయోధ్య చేరుకున్నా. అప్పటికే అక్కడ లాఠీచార్జీ, పోలీస్ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. గొప్ప ఫొటో జర్నలిస్ట్ నితిన్ రాయ్‌ని కలిసే అవకాశంతోపాటు ఆయన పనితీరు దగ్గరగా చూడొచ్చని నేను అక్కడికి వెళ్లాను. ముందుగా సరయూ నదీ తీరానికి వెళ్లాను. మధ్యాహ్నం అయోధ్య వీధుల్లో కొందరు బాణాలు పట్టుకుని కనిపించారు. సాయంత్రం మళ్లీ నా కెమెరాకు పని చెప్పాను. ఆరో తేదీ ఉదయం మళ్లీ సరయూ నది వరకూ వెళ్లొచ్చాను. ఉదయం 9.30 గంటలకు సుమారు నాలుగైదు లక్షల మంది బాబ్రీ మసీద్ వైపు వెళ్లడం కనిపించింది. అప్పటికే నితిన్ రాయ్.. కెమెరా ఫ్లాష్‌లు కొడుతూనే ఉంది. కరసేవకుల్లో ఒకరిగా.. బాబ్రీ మసీదు ప్రవేశ ద్వారం నుంచి కరసేవకులతో కలసి వెళ్లేందుకు ప్రయత్నించాను. వారితో కలసి నినాదాలు చేస్తూ ముందుకు వెళ్లాను. ఇదే సమయంలో నా బ్యాగ్‌లోని కెమెరా తీసి కరసేవకుల ఫొటోలు తీశాను. తర్వాత బాబ్రీ మసీదు వెనుక నుంచి లోపలికి వెళ్లి అటాకింగ్ ఫొటోలు తీశాను. ఇది గమనించిన ఓ కరసేవకుడు నాపై దాడికి దిగాడు. నా బ్యాగ్ లాక్కునే ప్రయత్నం చేశాడు. అతడిని నిలువరించి అయోధ్య రైల్వే స్టేషన్ చేరుకున్నా. మరుసటి రోజు ఫరీదాబాద్‌కు, అక్కడి నుంచి వారణాసి వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నా. ఇండియాటుడే, టైమ్స్ వాళ్లకు నేను తీసిన ఫొటోలిచ్చాను. ఆ పత్రికల్లో ఈ ఫొటోలు ప్రముఖంగా రావడం నాకు ఎంతో పేరును తెచ్చిపెట్టాయి. టెక్నికల్‌గా.. ఈ ఫొటోకి నేను వాడిన కెమెరా కెనాన్ ఏ వన్. ఫిక్స్డ్ లెన్సెస్. షట్టర్ స్పీడ్ 60. అంతా మాన్యువలే కాబట్టి లైట్ ఎంత ఉండాలో కూడా మాన్యువల్‌గానే అడ్జెస్ట్ చేసి తీశాను. చాలెంజింగ్ జాబ్.. ఫొటోగ్రఫీ జర్నలిజం అంటేనే చాలెంజింగ్ జాబ్. ఇందులో రిస్క్ ఎక్కువ. పనిని ఎంత ఆరాధిస్తే అంత ముందుకు వెళ్తారు. ఈ ఫీల్డ్‌లో ఎన్నో కొత్త ప్రాంతాలు, వ్యక్తులను కలిసే అవకాశముంటుంది. సమాజంలో మంచి హోదా లభిస్తుంది. నేను తీసిన ఫొటోలు చూడాలంటే http://www.dravinderreddy.com/లో చూడవచ్చు. ప్రస్తుతం వావ్ హైదరాబాద్ మేగజైన్‌కు ఫొటోలు అందిస్తున్నాను. -ప్రజెంటర్: వాంకె శ్రీనివాస్