-
ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి పంత్.. ఖర్చు మొత్తం వాళ్లదే
BCCI To airlift Rishabh Pant To Mumbai: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఆరోగ్య పరిస్థితిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి మరో అప్డేట్ అందించింది. అతడిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైకి తరలించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం మీడియాకు ప్రకటన విడుదల చేసింది. ‘‘రిషభ్ పంత్‌ను ముంబై తరలించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను బీసీసీఐ పూర్తి చేసింది. డిసెంబరు 30న డెహ్రాడూన్‌లో జరిగిన కారు ప్రమాదంలో గాయపడ్డ రిషభ్ ప్రస్తుతం మాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎయిర్‌లిఫ్ట్ అతడిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరిగాయి. పంత్‌ను కోకిలాబెన్ ధీరూబాయి అంబాని ఆస్పత్రి మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అడ్మిట్ చేస్తాం. ఆర్థోస్కోపీ& షోల్డర్ సర్వీస్, సెంటర్ ఫర్ స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ డైరెక్టర్, హెడ్ డాక్టర్ దీన్షా పర్దీవాలా పంత్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తారు. ఆ డాక్టర్ పర్యవేక్షణలో రిషభ్ లిగమెంట్ టియర్‌కు సర్జరీ చేయాల్సి ఉంది. ఆ తర్వాత అతడిని బీసీసీఐ వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది. తను కోలుకునేంత వరకు ఇక్కడే ఉంటాడు. రిషభ్ పంత్‌కు మెరుగైన చికిత్స అందించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం సహా.. ఈ కఠిన సమయంలో అతడికి అన్ని విధాలా అండగా ఉంటాం’’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా పేరిట బోర్డు నోట్ విడుదల చేసింది. వైద్య ఖర్చులు మొత్తం కాగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన రిషభ్ పంత్.. స్వదేశానికి వచ్చిన తర్వాత కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో డిసెంబరు 30న ఢిల్లీ నుంచి స్వస్థలం ఉత్తరాఖండ్‌కు వస్తుండగా అతడి కారుకు యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇక పంత్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి వైద్య ఖర్చులు మొత్తం బోర్డు భరిస్తుందని జై షా పేర్కొన్నారు. చదవండి: Sanju Samson: క్యాచ్ డ్రాప్ చేసిన సంజూ! హార్దిక్ పాండ్యా రియాక్షన్ వైరల్ Deepak Hooda: అసభ్య పదజాలం వాడిన హుడా! ఇంత నీచంగా మాట్లాడతావా అంటూ.. -
బాలీవుడ్ నటుడు సదాశివ్ అమ్రాపుర్కర్ కన్నుమూత!
ముంబై: బాలీవుడ్ నటుడు సదాశివ్ అమ్రాపుర్కర్ ఆదివారం అర్ధరాత్రి ముంబైలోని కోకిలాబెన్ ధిరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కన్నుమూశారు. సదాశివ్ వయస్సు 64 సంవత్సరాలు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో ఆస్పత్రిలో చేరిన సదాశివ్ అమ్రాపుర్కర్ ఆదివారం అర్ధరాత్రి 2.45 నిమిషాలకు మృతి చెందారని ఆయన కూతురు రీమా అమ్రాపుర్కర్ మీడియాకు తెలిపారు. అంత్యక్రియలు ఆయన స్వగ్రామం ఆహ్మద్ నగర్ లో నిర్వహిస్తామని రీమా వెల్లడించారు. సదాశివ్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్ధం బైదాస్ ఆడిటోరియంలోని ఉంచుతామని ఆమె తెలిపారు. 'అర్ధ్' చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి ప్రవేశించిన సదాశివ్ అమ్రాపుర్కర్ 'సడక్' చిత్రం ద్వారా విలన్ గా బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంఖే, ఇష్క్, కూలీ నెంబర్ 1, గుప్త్ చిత్రాల్లో విలన్ గా, కారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన శైలితో అభిమానులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన మరాఠీ చిత్రరంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. 1984లో అర్ధ్ సత్య, 1991 లో సడక్ చిత్రానికి ఆయన ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. సదాశివ్ 2012లో నిర్మించిన 'బాంబే టాకీస్' చిత్రంలో చివరిసారిగా కనిపించారు. ఇటీవల కాలంలో చిత్రాల్లో నటించడం తగ్గించుకుని.. సామాజిక సేవకే ప్రాధాన్యత ఇచ్చారు. సదాశివ్ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. Follow @sakshinews
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement