breaking news
Koil Alwar
-
28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈనెల 29న ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు. 28న ఉదయం 6 గంటలకు స్వామివారి దర్శనం నిలిపివేసి ఆలయ శుద్ధి కార్యక్రమం చేపడతారు. అనంతరం ఉదయం 11 గంటలకు భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా ఆరోజు నిర్వహించాల్సిన అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేశారు. -
వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వేడుకగా సాగింది. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం నిలిపివేసి ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు దంపతులు శ్రీవారికి నూతన పరదాలు సమర్పించారు. చివరగా అర్చకులు అంతకుముందు గర్భాలయ మూలమూర్తిపై కప్పిన వస్త్రాన్ని తొలగించి ఆగమోక్తంగా పూజలు, నైవేద్య కైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 11 గంటల తర్వాత భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.