breaking news
kodala sivaprasadrao
-
నరసరావు పేటలో అధికారపార్టీనేతల అగడాలు
-
ఏపీ స్పీకర్ కోడెలకు రఘువీరా లేఖ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు నీలకంఠాపురం రఘువీరా రెడ్డి లేఖ రాశారు. అసెంబ్లీ లాంజ్ నుంచి తొలగించిన వైఎస్ఆర్ చిత్రపటాన్న పునఃప్రతిష్టించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ లేఖలో ఏముందంటే.. 'ముఖ్యమంత్రి హోదాలో మరణించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాన్ని ఆనాటి సభాపతి అనుమతితో ప్రతిష్టించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అసెంబ్లీ అధికారులు వైఎస్సార్ చిత్రపటాన్ని తొలగించడమనేది సీఎం హోదాను అవమానపరచడమే. రాజకీయాలకు అతీతంగా సీఎం హోదాను గౌరవించడం సంప్రదాయం. అధికార టీడీపీ ఒత్తిడికి లోను కాకుండా స్పీకర్గా స్వతంత్రంగా వ్యవహరించి.. వైఎస్సార్ ఫొటోను పునఃప్రతిష్టించాలి' అని లేఖలో రఘువీరా రెడ్డి కోరారు.