మళ్లీ కాంగ్రెస్లో చేరిన కొండా దంపతులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో కొండా సురేఖ, మురళీ దంపతులు, కెకె మహేంద్ర రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ తమకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు.
కార్యకర్తల కోరిక మేరకే తాము కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి తన ప్రాంత ప్రజల మనోభావాలు వెల్లడిస్తున్నారని, అందులో తప్పేమీలేదని అన్నారు.