breaking news
kirana bazar
-
కిరాణా వర్తకులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: కిరాణా వర్తకుల మూలధన నిధుల అవసరాలకు మద్దతుగా నిలిచేందుకు ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ నూతనంగా ఒక ‘క్రెడిట్ ప్రోగ్రామ్’ను ప్రకటించింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు భాగస్వామ్యంతో సులభ రుణాలను సమకూర్చనుంది. కిరాణా వర్తకుల ఇబ్బందులను పరిష్కరించేందుకు, వ్యాపార వృద్ధికి నిధుల అవసరాలను తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ ప్రకటించింది. ఇందులో భాగంగా కిరాణా వర్తకులు ఎటు వంటి వ్యయాలు లేకుండానే రుణ సాయాన్ని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు, ఇతర ఫిన్‌టెక్ సంస్థల నుంచి పొందొచ్చని తెలిపింది. ఈ రుణాలు రూ.5,000 నుంచి రూ.2 లక్షల వరకు.. 14 రోజుల కాలానికి ఎటువంటి వడ్డీ లేకుండా లభిస్తాయని పేర్కొంది. చదవండి : ఆ పేరు మార్చండి, అమెజాన్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు -
కిరాణా కొట్టుకు నిప్పు
రాయదుర్గం రూరల్: మల్లాపురంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిరాణా కొట్టుకు నిప్పంటించారు. ఎగసిపడుతున్న మంటలను గమనించిన స్థానికులు కిరాణాకొట్టు నిర్వామకుడు రవికుమార్‌కు సమాచారమందించారు. ఆయన వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కొట్టుపపూర్తిగా కాలిపోయింది. దాదాపు రూ.70 వేల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.