breaking news
killed youth
-
మృత్యు గెడ్డ
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్: ఊట గెడ్డ ఉధృతిని చూడాలన్న సరదా ఇద్దరు యువకు లను ప్రమాదంలోకి నెట్టింది. తమ కళ్లముందే ఇద్దరు కొట్టుకుపోతుంటే కాపాడలేని నిస్సహాయత స్నేహితులను విషాదంలో ముంచింది. ఈ ఘటనతో కుప్పిలి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కొంతకాలంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కుప్పిలి ఊట గెడ్డ ఉద్ధృతంగా ప్రహిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం ఏడుగురు స్నేహితులు సరదాగా గెడ్డ ఉద్ధృతిని చూసేందుకు వెళ్లారు. అందరికీ ఈత వచ్చు. అయినా ఫలితం లేకపోయింది. వర్షాలు, వరదలతో ఊట గెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గెడ్డ నీరు సముద్రంలో కలిసేచోట కెరటాలు ఎగిసి పడుతున్నాయి. ఆసక్తిగా ఉన్న ఈ దృశ్యాలు చూస్తూ స్నేహితులు సరదాగా గడిపారు. ప్రమాదకరంగా పరిస్థితి ఉంది. కుప్పలికి చెందిన సంతోష్ కుమార్ (20) జేసీబీ ఆపరేటర్‌గా జీవనం సాగిస్తున్నారు. గెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నా సరదాగా దిగాడు. దీంతో కొట్టుకుపోయాడు. పక్కన ఉన్న బోర రమణారెడ్డిని కూడా గెడ్డ కెరటాలు లాక్కు వెళ్లాయి. ఈ యన పెంట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. ఉద్ధృతంగా వరద నీరు వెళుతుంది. ప్రమాదక పరిస్థితిలో ఉండటంతో స్థానికంగా ఉన్న జాలరులు, స్నేహితులు రక్షించే ప్రయత్నం చేయలేక పోయారు. కళ్ల ముందే స్నేహితులు కొట్టుకుపోయారు. గెడ్డ చూసేందుకు వెళ్లినవారిలో నాయని నాగు, నిమ్మ సంతోష్, ఉప్పాడ హరి బాబు, ఉప్పాడ కుప్పేస్, బూష రమణలు సురక్షితంగా బయట పడా ్డరు. స్నేహితులను రక్షించేందుకు గెడ్డలో దిగి ఉంటే వీరు సైతం కోట్టుకు పోయే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం సంతోష్, రమణారెడ్డిల కోసం గాలిస్తున్నారు. అయితే అనుకూల పరిస్థితి లేదు. సంతోష్ కుమార్ తల్లిదండ్రులు దాలప్పడు, సీతమ్మ, రమణారెడ్డి తల్లి దండ్రులు అప్పన్న, సూరమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటన పరిస్థితిని మాజీ ఎంపీపీ, వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి బల్లాడ జనార్దనరెడ్డి పోలీసులకు తెలియ జేశారు. ఎచ్చెర్ల ఎస్సై జి.రాజేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇద్దరు మిత్రుల కోసం తీరంలో వెదుకు తున్నారు. బంధువులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వినోదం.. అంతలోనే విషాదం.. ఏడుగురు స్నేహితులు సరదాగా స్నా నాలు చేయాలని, సెల్ఫోన్లతో సెల్ఫీలు తీసుకోవా లని వెళ్లి ప్రమాదవశాత్తు కొట్టుకుపోయారు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గల్లంతైన ఇద్దరూ ప్రాణ స్నేహితులు. మరోపక్క కుటుంబ పోషణలో కీలకమ యిన సంపాదించే వ్యక్తులు. వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఎలాగైనా తిరిగిరా వాలని తల్లిదండ్రులు, మిత్రులు వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. -
చిన్న వివాదం.. ప్రాణం తీసింది
బెంగళూరు: చిన్ననాటి నుంచి కలిసిమెలిసి తిరిగిన ఆ యువకులిద్దరూ ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. అయితే, వారి మధ్య తలెత్తిన చిన్న వివాదం క్షణికావేశంలో ఒకరి ప్రాణాలు తీసేదాకా వెళ్లింది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి కర్ణాటకలోని మంగళూరు జిల్లా బంట్వాళ పట్టణంలో జరిగింది. సోదరుల పిల్లలైన రంజిత్ (26), రాజేశ్ (24) చిన్నప్పటి నుంచి పక్కపక్క ఇళ్లల్లోనే పెరిగారు. ఇద్దరి మధ్య ఎంతో ఆప్యాయత, చనువు ఉండేది. అయితే, కొంతకాలంగా ఇద్దరి మధ్య ఏదో విషయమై మనస్పర్థలు చోటుచేసున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇద్దరూ కలసి బార్‌కు వెళ్లారు. అక్కడ మద్యం మత్తులో గొడవపడగా బార్ సిబ్బంది ఇద్దరికి సర్దిచెప్పి ఇళ్లకు పంపారు. అయితే, రంజిత్‌ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్న రాజేశ్ అర్థరాత్రి కరెంట్ పోవడంతో ఇదే అదునుగా భావించి రంజిత్ ఇంట్లోకి చొరబడి అతడిని కత్తితో పొడిచి పారిపోయాడు. రంజిత్ అరుపులు విని బయటకు వచ్చిన కుటుంబ సభ్యులు కత్తిపోట్లకు గురైన బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం నిందితుడు రాజేశ్‌ను అరెస్ట్ చేశారు.