breaking news
Kidari Sarveswara Rao
-
'ఆదిమ జాతి అంతరిస్తుంది'
చింతపల్లి: బాక్సైట్ తవ్వకాలతో నీరు కలుషితమవుతుందని వైఎస్సార్ సీపీ అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వరరావు తెలిపారు. విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బాక్సైట్ తవ్వకాలతో 250 గ్రామాలు ప్రమాదంలో పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. విషపూరిత రసాయనాలు విడుదలయి, భూగర్భ జలాలు కలుషితవుతాయని చెప్పారు. చట్టుపక్కల ప్రాంతాల్లో ప్రవసిస్తున్న నదీజలాలు కూడా కలుషితం అవుతాయని, గిరిజన ప్రజలకు కొత్త రకాల రోగాలు వచ్చి ఆదిమ జాతి అంతరిస్తుందని అన్నారు. తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల వాసులకు తాగునీరు సంక్షోభం తప్పదని, విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని వివరించారు. -
'గిరిజన ద్రోహి మంత్రి రావెల'
పాడేరు(విశాఖపట్నం): ఏపీ సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు గిరిజన ద్రోహి అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వర రావులు విమర్శించారు. ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయకపోవడంతో వారు నిరసన తెలిపారు. పాడేరులో ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.