breaking news
khammam arban
-
కొడుకుతో కలిసి భర్తను..
సాక్షి, తిరుమలాయపాలెం: మండలంలోని బీరోలులో ఈ నెల 19న రాత్రి, కట్టుకున్న భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్యను, ఆమెకు సహకరించిన కొడుకుని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి, కోర్టు కు అప్పగించారు. తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో కూసుమంచి సీఐ మురళి తెలిపిన వివరాలు... మండలంలోని బీరోలు గ్రామస్తుడు బుడిగె సీతారాములు(65)కు భార్య సోమలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తీవ్ర అనారోగ్యంతో సోమలక్ష్మి మృతిచెందడంతో సత్యవతిని రెండోవివాహం చేసుకున్నాడు. ఈమెకు కుమారుడు, కుమార్తె కలి గారు. కొన్నేళ్ల క్రితం, సత్యవతి తన భర్తను వదిలేసి ఖమ్మం వెళ్లింది. రెండేళ్ల క్రితం భర్త వద్దకు తిరిగొచ్చింది. కుమారుడు శ్రీధర్, కోడలితో కలిసి భర్త సీతారాములు ఇంట్లోనే ఓ గదిలో ఉంటోంది. భర్త సీతారాములుకు చెందిన 15 కుంటల భూమిలో ఏడు కుంటల భూమిని తన పేరిట పట్టా చేయించాలని భార్య సత్యవతి పట్టుబట్టింది. తనను ఏమాత్రం పట్టించుకోని సత్యవతి పేరిట భూమిని పట్టా చేసేందుకు సీతారాములు ససేమిరా అన్నాడు. దీంతో, అతడిపై ఆమె కక్ష పెంచుకుంది. తన కుమారుడు శ్రీధర్‌తో కలిసి ఈ నెల 19న అర్ధరాత్రి వేళ సీతారాములును గొడ్డలి తో నరికి చంపింది. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులైన సత్యవతిని, ఆమె కుమారు డు శ్రీధర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచా రు. సమావేశంలో ఎస్ఐ సర్వయ్య పాల్గొన్నారు. -
రైతన్నకు విజయమ్మ బాసట
‘మీకు అండగా మేమున్నాం...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది...జగన్‌బాబు ఉన్నారు...’ అంటూ విజయమ్మ రైతులను ఓదార్చారు. మధిర, బోనకల్, వైరా, కొణిజర్ల, ఖమ్మంఅర్బన్, ముదిగొండ, నేలకొండపల్లి మండలాల్లో దెబ్బతిన్న పంటచేలను ఆమె గురువారం పరిశీలించారు. కార్యకర్తలు, అభిమానులు ఊరూరా ఆమెను ఘనంగా స్వాగతించారు. కొణిజర్ల మండలం పల్లిపాడులో పత్తి రైతులు రాచబట్టి బకీరన్న, సుశీలతో మాట్లాడుతున్న వైఎస్ విజయమ్మకొణిజర్ల మండలం పల్లిపాడులో విజయమ్మ ఎదుట గోడు వెళ్లబోసుకుంటున్న మహిళముదిగొండ : వెంకటాపురంలో పత్తిచేనును పరిశీలిస్తున్న విజయమ్మబోనకల్ మండలం కలకోటలో మహిళా రైతులను ఓదారుస్తున్న విజయమ్మకొణిజర్ల మండలం పల్లిపాడులో పాడైన పత్తిని విజయమ్మకు చూపుతున్న మహిళా రైతు సామ్రాజ్యంమధిరలో విజయమ్మకు పొంగులేటి, మెండెం స్వాగతంనేలకొండపల్లిలో విజయమ్మను చూసేందుకు వచ్చిన ప్రజలుముదిగొండ: వెంకటాపురంలో మాట్లాడుతున్న విజయమ్మముదిగొండ మండలం వెంకటాపురంలో విజయమ్మకు తమ బాధలు చెప్పుకుంటూ విలపిస్తున్న రైతు కూలీలు, చిత్రంలో మచ్చా, పొంగులేటిముదిగొండ : వెంకటాపురంలో దెబ్బతిన్న పత్తిని చూపుతున్న రైతు రాయల నాగేశ్వరరావువీవీపాలెంలో ప్రజలకు అభివాదం చేస్తున్న విజయమ్మవీవీపాలెంలో విజయమ్మకు స్వాగతం పలుకుతున్న ప్రజలుఖమ్మం అర్బన్ : ఉల్లిగడ్డల ధరలు బాగా పెరిగాయంటున్న వీవీ పాలెం వాసి శాంతముదిగొండ: వెంకటాపురంలో మాట్లాడుతున్న విజయమ్మసత్తుపల్లి నియోజకవర్గంలో నష్టాల గురించి చెబుతున్న నంబూరిమధిరలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేస్తూ.. , కలకోటలో మిర్చిరైతు బగ్గూరి ఆదాంను ఓదారుస్తున్న విజయమ్మ కలకోటలో మిర్చి పంటను పరిశీలిస్తూ.. , సిరిపురంలో చిన్నారుల ఉత్సాహంనేలకొండపల్లి మండలం పైనంపల్లి శివారులో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న విజయమ్మ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నల్లగొండ జిల్లా పార్టీ కన్వీనర్ బీరవల్లి సోమిరెడ్డిపైనంపల్లి శివారులో జనాలను చెదరగొడుతున్న పోలీసులునేలకొండపల్లి : పైనంపల్లి శివారులో అరెస్ట్కమ్మని విజయమ్మను కోరుతున్న పోలీసులువైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకురాలు వాసిరెడ్డి పద్మను అరెస్ట్ చేస్తున్న పోలీసులునేలకొండపల్లి : పైనంపల్లి శివారులో నల్లగొండ జిల్లా పార్టీ కన్వీనర్ సోమిరెడ్డి అరెస్టు.. -
అనస్థీషియా వైద్యమే కీలకం: డాక్టర్ చక్రరావు
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: వైద్యరంగంలో అనస్థీషియా వైద్యం చాలా కీలకమైందని, విప్లవాత్మకంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా దానిని వినియోగించుకోవాలని ఇండియన్ అనస్థీషియా సొసైటీ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ చక్రరావు పేర్కొన్నారు. ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలలో మూడు రోజుల పాటు జరుగనున్న రాష్ర్టస్థాయి అనస్థీషియా వైద్యుల (ఐఎస్ఏ ఏపికాన్ 2013) సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా 450 మంది వైద్యులు, వైద్య విద్యార్థులు హాజరయ్యారు. సదస్సులో చక్రరావు మాట్లాడుతూ రోజురోజుకు వస్తున్న మార్పులను వైద్యులకు తెలియజేసేందుకు ఇలాంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. ఈ సదస్సుకు హాజరైన ప్రతినిదులు నూతన వైద్య విధానాన్ని తెలుసుకుని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఏ చిన్న సర్జరీ చేయాలన్నా అనస్థీషియా ముఖ్యమని, ముందుముందు ఈ వైద్యం ప్రధాన భూమిక అవుతుందని అన్నారు. ఈ సదస్సులో రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దయాల్‌సింగ్, డాక్లర్లు బి దామోదర్‌రావు, రాజగోపాల్రావు, మమత ఆస్పత్రి ప్రిన్సిపాల్ డాక్టర్ కోటేశ్వరరావు, కిరణ్‌కుమార్, మమత ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ బాగం కిషన్‌రావు, బండారుపల్లి నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. తొలుత సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మమత వైద్య కళాశాల చైర్మన్ పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సెమినార్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, ఖమ్మం నియోజకవర్గ కార్యదర్శి జానిమియా, ప్రసాద్, గాంధీ తదితరులు పాల్గొన్నారు. అనస్థీషియాలో వచ్చిన అనేక నూతన మార్పులపై శని, ఆదివారాల్లో జరుగనున్న కార్యక్రమాల్లో బెంగళూరు, చెన్నైల నుంచి వచ్చిన డాక్టర్లు వివరించనున్నారు. రోగికి నొప్పిలేకుండా వైద్యం అందించడమే లక్ష్యం ఖమ్మం అర్బన్: రోగికి ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మత్తు (అనస్థీషియా) ఇంజక్షన్ కీలకమని, నూతన వైద్యం విధానంలో మత్తు వైద్యం అందించే విధానంపై అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వైద్యులను తీర్చిదిద్దుతున్నట్లు ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియా అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ఎస్సీ చక్రరావు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఖమ్మంలో జరుగనున్న అనస్థీషియా రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొనేం దుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో 20వేల మంది అనస్థీషియాలజిస్ట్‌లు ఉన్నారని, వైద్యరంగంలో రోజురోజుకు వస్తున్న మార్పులపై వారికి అవగాహన కల్పిం చేందుకు ప్రతీ ఏడాది సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనస్థీషియా వైద్యం పై ప్రతీ ఏడాది నాలుగు రోజుల పాటు దేశస్థాయిలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. ఈ సారి డిసెంబర్ 25 నుంచి 29 వరకు గౌహతిలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. ఈ సమావేశంలో ఇండియన్ అనస్థీషియా అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ దయాల్‌సింగ్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ దామోదర్‌రావు, కార్యదర్శి వి.రాజగోపాల్, కిరణ్, మమత ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ భాగం కిషన్‌రావు పాల్గొన్నారు. ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలలో మూడు రోజుల పాటు జరుగనున్న రాష్ర్టస్థాయి అనస్థీషియా వైద్యుల (ఐఎస్ఏ ఏపికాన్ 2013) సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా 450 మంది వైద్యులు, వైద్య విద్యార్థులు హాజరయ్యారు. సదస్సులో చక్రరావు మాట్లాడుతూ రోజురోజుకు వస్తున్న మార్పులను వైద్యులకు తెలియజేసేందుకు ఇలాంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. ఈ సదస్సుకు హాజరైన ప్రతినిదులు నూతన వైద్య విధానాన్ని తెలుసుకుని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఏ చిన్న సర్జరీ చేయాలన్నా అనస్థీషియా ముఖ్యమని, ముందుముందు ఈ వైద్యం ప్రధాన భూమిక అవుతుందని అన్నారు. ఈ సదస్సులో రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దయాల్‌సింగ్, డాక్లర్లు బి దామోదర్‌రావు, రాజగోపాల్రావు, మమత ఆస్పత్రి ప్రిన్సిపాల్ డాక్టర్ కోటేశ్వరరావు, కిరణ్‌కుమార్, మమత ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ బాగం కిషన్‌రావు, బండారుపల్లి నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. తొలుత సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మమత వైద్య కళాశాల చైర్మన్ పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సెమినార్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, ఖమ్మం నియోజకవర్గ కార్యదర్శి జానిమియా, ప్రసాద్, గాంధీ తదితరులు పాల్గొన్నారు. అనస్థీషియాలో వచ్చిన అనేక నూతన మార్పులపై శని, ఆదివారాల్లో జరుగనున్న కార్యక్రమాల్లో బెంగళూరు, చెన్నైల నుంచి వచ్చిన డాక్టర్లు వివరించనున్నారు. రోగికి నొప్పిలేకుండా వైద్యం అందించడమే లక్ష్యం ఖమ్మం అర్బన్: రోగికి ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మత్తు (అనస్థీషియా) ఇంజక్షన్ కీలకమని, నూతన వైద్యం విధానంలో మత్తు వైద్యం అందించే విధానంపై అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వైద్యులను తీర్చిదిద్దుతున్నట్లు ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియా అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ఎస్సీ చక్రరావు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఖమ్మంలో జరుగనున్న అనస్థీషియా రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొనేం దుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో 20వేల మంది అనస్థీషియాలజిస్ట్‌లు ఉన్నారని, వైద్యరంగంలో రోజురోజుకు వస్తున్న మార్పులపై వారికి అవగాహన కల్పిం చేందుకు ప్రతీ ఏడాది సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనస్థీషియా వైద్యం పై ప్రతీ ఏడాది నాలుగు రోజుల పాటు దేశస్థాయిలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. ఈ సారి డిసెంబర్ 25 నుంచి 29 వరకు గౌహతిలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. ఈ సమావేశంలో ఇండియన్ అనస్థీషియా అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ దయాల్‌సింగ్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ దామోదర్‌రావు, కార్యదర్శి వి.రాజగోపాల్, కిరణ్, మమత ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ భాగం కిషన్‌రావు పాల్గొన్నారు. -
ఖమ్మంఅర్బన్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్:ఓ కేసు విషయంలో అదుపులోకి తీసుకున్న తమ కుటుంబ సభ్యులను తక్షణమే వదిలిపెట్టాలని ఖమ్మం అర్బన్ పోలీస్‌స్టేషన్ ఎదుట వైరా - ఖమ్మం ప్రధాన రహదారిపై గురువారం పలువురు మహిళలు రాస్తారోకో చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంనగరంలోని ముస్తఫానగర్ సెంటర్లో ఐదు రోజుల క్రితం ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. అనంతరం ఆటోవాలాలు శ్రీరామ్‌హిల్స్ కాలనీకి వెళ్లి ద్విచక్ర వాహనదారులను తీవ్రంగా కొట్టారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అందుకు బాధ్యులుగా భావిస్తూ 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో సంబంధం లేని పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లు మార్చి తిప్పుతూ హింసిస్తున్నారని ముస్తఫానగర్‌కు చెందిన పలువురు మహిళలు బుధవారం రాత్రి స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో ఎస్సై గణేష్ వారికి సర్ధిచెప్పి గురువారం ఉదయం 10 గంటల వరకు విడిచిపెడతామని హామీ ఇచ్చారు. కానీ వారిని వదలకపోవడంతో గురువారం పలువురు మహిళలు స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ వారిని చూపించాలని వైరా - ఖమ్మం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఎస్సై గణేష్ అక్కడికి చేరుకుని సాయంత్రానికి వారిని వదిలిపెడతామని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు.