breaking news
khairatabad fly over
-
తెలుగు తల్లి ఫ్లైఓవర్ పునఃప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : సచివాలయ కూల్చివేతలో భాగంగా దాదాపు 40 రోజుల పాటు మూసివేసి ఉంచిన తెలుగుతల్లి, ఖైరతాబాద్ ప్లైఓవర్లపై మంగళవారం రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేటి నుంచి సింగిల్ వేలో వాహనదారులకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. జూలై 7న ప్రారంభమైన సచివాలయ కూల్చివేత 40 రోజుల పాటు జరిగింది. భవనాలు కూల్చివేసే సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతోనే ఫ్లై ఓవర్లతో పాటు పరిసర ప్రాంతాల రహదారులను మూసివేశామని అధికారులు పేర్కొన్నారు. అయితే సచివాలయ కూల్చివేతకు సంబంధించి మీడియాతో పాటు ఇతరులెవ్వరిని తెలంగాణ ప్రభుత్వం అనుమతించలేదు. సచివాలయ భవనం కింద గుప్త నిధులు ఉన్నాయని, అందుకే అనుమతి ఇవ్వలేదని కొందరు చేసిన ప్రచారం అలజడి రేపింది. ఇదే విషయమై ఒక మీడియా సంస్థ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టు కూడా ప్రభుత్వ తీరుపై అభ్యంతరాలు తెలపడంతో మీడియాను అనుమతిచ్చారు. -
ఖైరతాబాద్‌లో కారు బీభత్సం
సాక్షి, హైదరాబాద్ : నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ సిగ్నల్స్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎర్రమంజిల్ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ ఎక్కుతుండగా అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ని బలంగా ఢీకొట్టి అవతలివైపు పడిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో అటువైపుగా వాహనాలేవీ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు, మార్నింగ్ వాక్కు వచ్చిన వారు వెంటనే స్పందించి క్షతగాత్రులను కారు నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నారు. ఈ ఘటనతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
ఫ్లై ఓవర్‌పై ప్రమాదం.. ట్రాఫిక్ జామ్
-
ఫ్లై ఓవర్‌పై ప్రమాదం.. ట్రాఫిక్ జామ్
ఉమ్మడి రాజధాని నగరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీద ఒక వాహనం అదుపు తప్పింది. అది డివైడర్ మీదకు ఎక్కడంతో ఆ ప్రాంతంలో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అర్ధరాత్రి సమయంలో ఈ వాహనం ప్రమాదానికి గురైనట్లు సమాచారం. సినిమా షూటింగులకు, ప్రైవేటు ఫంక్షన్లకు విద్యుత్ సరఫరా కోసం ఉపయోగించే మొబైల్ జనరేటర్ వాహనం అదుపుతప్పి, డివైడర్ మీదకు ఎక్కి.. దాని మీద ఉన్న మొత్తం పూలకుండీలన్నింటినీ ధ్వంసం చేసింది. ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవర్ నిద్ర మత్తే అని అంటున్నారు. ఈ ప్రమాదం వల్ల ఇంటర్ పరీక్షకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బంది ఏర్పడింది. ఈ వ్యాన్ బీభత్సం తెల్లవారుజామున జరగడంతో వాకింగ్ కి వెళ్లేవారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో డివైడర్ మీద ఉన్న విద్యుత్ స్తంభం విరిగి నేల మట్టం అయింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని అక్కడినుంచి తొలగించేందుకు భారీ క్రేన్ ఒకదాన్ని తెప్పించి, దాని సాయంతో బస్సును అక్కడినుంచి తీశారు. రోడ్డు మధ్యలో డివైడర్ మీద బస్సు ఉండటం, దాన్ని తొలగించేందుకు క్రేన్‌ను ఫ్లై ఓవర్‌కు ఒకవైపు అడ్డంగా పెట్టడంతో అటు నుంచి ఇటు వచ్చే వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. -
కాలం మారింది.. కల చెదిరింది..
‘మీరు అద్భుతమైన ఉద్యానవనాన్ని అభివృద్ధి చేశారు... బాగుంది. పక్కనే ఉన్న పేదల గృహ సముదాయం చూడండి.. ఎంత దారుణంగా ఉందో. సరైన మరమ్మతులు లేవు. చెట్లు చేమలకు కోట్లు ఖర్చు చేసి మమ్మల్ని పట్టించుకోకపోవడం దారుణం కాదా అని ఆ పేదలు అనుకోరా?’ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఫ్లైఓవర్ కింద లేక్‌వ్యూ ఉద్యానవనాన్ని ప్రారంభించిన సమయంలో నాటి ముఖ్యమంతి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారులతో అన్న మాటలివి. పేదలు నివసించే ప్రాంతాలు జీవనం గడపటానికి యోగ్యంగా ఉండేలా మార్చాలని ఆయన తపన పడేవారు. ‘మురికివాడలు’ అని సంబోధించటాన్ని ఏమాత్రమూ ఇష్టపడని ఆయన బీదల బస్తీ/పేదల వాడ అని పేర్కొనాలని చెప్పేవారు. వారి జీవనం కూడా ఉన్నతంగా ఉండాలని ఆశించి, వారందరికీ సొంతగూడు కల్పించాలన్న లక్ష్యంతో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఇళ్లను నిర్మించిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆయన సీఎంగా ఉన్న ఐదున్నరేళ్లలో ఏకంగా 56 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. స్వప్నం.. సాకారం పేదలందరికీ సొంత గూడు ఉండాలన్న ఆలోచన కొత్తది కానప్పటికీ, సొంతిల్లు లేని కుటుంబం ఒక్కటి కూడా రాష్ట్రంలో ఉండరాదనే సంకల్పంతో సాచ్యురేషన్ పద్ధతిలో పూర్తి చేయటం ప్రారంభించింది మాత్రం రాజశేఖరరెడ్డి హయాంలోనే. ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో చేపట్టిన పాదయాత్రలో పేదల కష్టాలను కళ్లారా చూసి... వాటిని దూరం చేయాలన్న తపనతో వారికి ఏంచేస్తే బాగుంటుందన్న కోణంలో అప్పుడే ప్రారంభమైన ఆలోచనలో పుట్టుకొచ్చిందే... ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలన్న తపన. 2004లో అధికారంలోకి వచ్చిన కొత్తలో అంతకు ముందు కొనసాగిన ఇళ్ల నిర్మాణ పథకాన్ని మామూలుగానే కొనసాగించారు. అంతకుముందు మంజూరై నత్తనడక నడుస్తున్న కొన్ని ఇళ్లు కలుపుకొని మొత్తం నాలుగు లక్షల ఇళ్లను పూర్తి చేశారు. విప్లవాత్మక మార్పులు తెస్తేగాని పేదలందరికీ సొంత గూడు లభించదన్న ఉద్దేశంతో ‘ఇందిరమ్మ’ పథకానికి శ్రీకారం చుట్టారు. కేవలం మూడేళ్ల కాలంలో వీలైనంతమంది పేదలకు ఇంటి వసతి కల్పించాలన్న లక్ష్యంతో ఓ యజ్ఞంలా దాన్ని ప్రారంభించి కొనసాగించారు. 2006-07, ఇందిరమ్మ మొదటి దశ: కనీవినీ ఎరుగని రీతిలో కేవలం ఒక్క ఏడాదిలోనే 20,22,801 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. దేశం మొత్తం రాష్ట్రం వైపు చూడసాగింది. ఇంతటి భారీ సంఖ్యలో ఇళ్లను ప్రారంభించి, పూర్తి చేయటం సాధ్యమా అని ముఖ్యమంత్రులంతా విస్తుపోయారు. కానీ రాజశేఖరరెడ్డి దాన్ని చేసి చూపారు. 2007-08,ఇందిరమ్మ రెండో దశ: అంతకుముందు సంవత్సరం రికార్డును బద్దలు కొడుతూ 20,95,110 ఇళ్లను ప్రారంభించారు. 2008-09, ఇందిరమ్మ మూడో దశ: 15,44,889 ఇళ్ల నిర్మాణం మొదలైంది. ఇలా ఈ మూడేళ్ల కాలంలో సింహభాగం పేదలకు ఇళ్లు అందాయి. మరోసారి ప్రజల్లోకి వెళ్లి ఇంకా పేదల ఇంటి పరిస్థితిని కళ్లారా చూసి, వారి నోటివెంటే వారి పరిస్థితిని తెలుసుకోవాలనుకున్నారు. ఈలోపు ఎన్నికలు ముంచుకొచ్చాయి. పేదల వెన్నంటి ఉన్నందున రాజశేఖరరెడ్డిని ప్రజలు మళ్లీ ఆశీర్వదించారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన భావించారు. ప్రజల్లోకి వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకోవాలన్న ఆయన ఆకాంక్షను ఆచరణలో పెట్టేందుకు సిద్ధపడ్డారు. అదే ’రచ్చబండ‘ కార్యకమం... ఆ కార్యకమానికి వెళ్లే క్రమంలోనే ఆయన హెలీకాప్టర్ ప్రమాదంలో మనందరికీ దూరమయ్యారు. ‘‘సొంత గూడు లేక లక్షల మంది దుర్భర జీవితం గడుపుతున్నారు. వారందరికీ యోగ్యమైన సొంతింటి అవసరముంది. వారి కలను నిజం చేసి చూపిస్తా. ‘మాకు సొంతిల్లు లేదు’ అని ఎవరూ చెయ్యెత్తి చూపే పరిస్థితి లేకుండా చేస్తా. ఏటా 10 లక్షల చొప్పున ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు నిర్మిస్తా. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పేదలకు సొంత గూడు కల్పించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పనితీరు స్ఫూర్తిగా దీన్ని సాధ్యం చేసి చూపుతా...’’ - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబుతున్న మాట ఇది. గౌరీభట్ల నరసింహమూర్తి- హైదరాబాద్ ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లను నిర్మించడమంటే మాటలా? కానీ దృఢ సంకల్పముంటే ఇది చిన్న విషయమనేది ఇటీవలే మనం చూసిన వాస్తవం. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో ఏకంగా 56 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించి దేశంమొత్తం ఆశ్చర్యపడేలా చేశారు. ఇప్పుడూ అలాం టి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సిన నేత అవసరముంది. రాజశేఖరెడ్డి మరణానంతరం పేదల ఇళ్ల నిర్మాణం అటకెక్కింది. గత నాలుగేళ్లలో మూడు విడతలుగా 26.65 లక్షల ఇళ్లు మంజూరైతే, వాటిలో కనీసం నాలుగు లక్షల ఇళ్లు కూడా పూర్తి కాలేదు. చేతల ప్రభుత్వానికి, మాటల ప్రభుత్వానికి ఉన్న తేడా ఇక్కడే అర్థమవుతుంది. ఇంకా కొన్ని లక్షల కుటుంబాలు గుడిసెల్లో మగ్గుతున్న ప్రస్తుత తరుణంలో వైఎస్ తరహా పనితీరు అవసరముంది. తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి, పేదలకు కావాల్సిందేమిటో గుర్తించలేని చంద్రబాబు జమానాకు, చెప్పింది చేసి చూపిన రాజశేఖరరెడ్డి పాలనా కాలానికి ఉన్న తేడాను గమనిస్తే ఈ విషయం సులభంగానే అర్థమవుతుంది. నిధుల ఖర్చు ఇలా.. 2004-06 మధ్య.. ఇందిరమ్మ పథకం కంటే ముందు ఇళ్ల కోసం చేసిన వ్యయం: రూ.580 కోట్లు ఇందిరమ్మ మొదటి దశ నుంచి ఇప్పటి వరకు మొత్తం ఖర్చు రూ.6000 కోట్లు. ఇందులో వైఎస్ హయాంలో మూడేళ్లలో రూ.4000 కోట్లు ఖర్చు చేస్తే, ఆయన చనిపోయిన తర్వాత నాలుగేళ్లలో వ్యయం చేసింది రూ.2000 కోట్లే. ఇందిరమ్మ రెండో దశను వైఎస్ 2007-08లో ప్రారంభించి రెండేళ్లలో రూ.3583 కోట్లు ఖర్చు చేశారు. ఆయన మరణం తర్వాత ఈ నాలుగేళ్లలో వ్యయం చేసింది రూ.2000 కోట్లు మాత్రమే. విజ్ఞాపనలు బుట్టదాఖలు తొమ్మిదేళ్ల సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం దక్కినా కనీసం మూడో వంతు కుటుంబాలకు ఇళ్లను నిర్మించి ఇవ్వలేకపోయారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మితమైన ఇళ్లు 20 లక్షల లోపే. నియోజకవర్గానికి ఏడాదికి వేయి ఇళ్లు చొప్పున నిర్మిస్తున్నట్టు అప్పట్లో చెప్పిన ఆయన వాటి నిర్మాణంలో ఎమ్మెల్యేల పెత్తనాన్ని పెంచారు. వారు చెప్పినవారికే ఇళ్లు కేటాయించే పద్ధతిని కొనసాగించి, వాటిలో అనర్హులు పాగావేసేలా చేశారు. జన్మభూమి పేరుతో అట్టహాసంగా నిర్వహించిన కార్యకమాల్లో... ఇళ్లు కావాలంటూ పేదలు లక్షల సంఖ్యలో అందజేసిన విజ్ఞాపనలను బుట్టదాఖలు చేశారు. ‘వాంబే’ పేర కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లనే తన ఘనతగా చెప్పుకొంటూ కాలం వెళ్లదీశారు. మళ్లీ పాత రోజులే! రాజశేఖరరెడ్డి మృతితో మొదలైంది ‘ఆయన తర్వాతి‘శకం. మళ్లీ బాబు జమానా రోజులొచ్చాయి. పేదలకు ఏం కావాలో సరిగ్గా గుర్తిం చి పనులు చేపట్టే పరిస్థితి వైఎస్‌తోనే దూరమైంది. తొలు త రోశయ్య పేదల ఇళ్లను పూర్తిగా విస్మరించారు. ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా కొందరు పేదలు అధికారికంగా మంజూరీ లేకున్నా నిర్మాణానికి పూనుకున్న ఇళ్లకు నిధులు కేటాయించేందుకు 171 జీవో జారీ చేశారు. రాజశేఖరరెడ్డిపై ఉన్న విశ్వాసంతో ప్రజలు ప్రారంభించుకున్న ఇళ్లవి. అనర్హులంటూ కొందరి పేర్లు తొలగించిన రోశయ్య పభుత్వం తుదకు 3.75 లక్షల మందికి నిధులు కేటాయించింది. కిరణ్ రచ్చబండ-1 కింద 6 లక్ష లు, రచ్చబండ-2 కింద 7 లక్షల ఇళ్లను మంజూరు చేసినా.. ఎక్కువ శాతం ప్రారంభానికి నోచుకోలేదు. ఆయన హయాంలో వాస్తవంగా పూర్తయిన ఇళ్ల సంఖ్య మూడున్నర లక్షలకు మించలేదు. రచ్చబండల్లో వచ్చిన దరఖాస్తులు 22 లక్షలు. వాటిలో ఆరు నెలల క్రితం వరకు 13.65 లక్షలు పెండింగులోనే ఉంచారు. ఆ తర్వాత ఎన్నికల దృష్టితో హడావుడిగా అందరికీ ఇళ్లను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అడగకుండానే వరం నా భర్త, నేను టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. వచ్చే డబ్బు ఇల్లు గడవడానికే సరిపోదు. సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే మా వల్ల కాదు. చంద్రబాబు ఉన్నప్పుడు ఇంటి కోసం జన్మభూమి సభల్లో అనేకసార్లు దరఖాస్తులు చేశాం. ఆయన ఉన్నంత కాలం మాకు ఇల్లు రాలేదు. అప్పట్లో ఊరికి పదో, పన్నెండో ఇళ్లు ఇచ్చేవారు. అవి మా వరకు వచ్చేవి కావు. వైఎస్ సీఎం అయిన తర్వాత మేము దరఖాస్తే చేయలేదు. అధికారులే మా దగ్గరకు వచ్చి గుడిసెలు ఉన్నవారంతా పక్కా ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని చెప్పారు. మాతో పాటు మా పేటలో ఉన్న వాళ్లందరికీ ఇళ్లు వచ్చాయి. ఇప్పుడది ఒక కాలనీగా మారిపోయింది. ప్రజల కష్టాలు తెలిసి, అడగకుండానే అన్నీ ఇచ్చే వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఇప్పుడు కావాలి. - ఖండిపల్లి వరలక్ష్మి, చౌడువాడ, కె.కోటపాడు మండలం(విశాఖ జిల్లా)