breaking news
Kesari : Chapter 2 Movie
-
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీ ఒక్కటీ రిలీజ్ కాలేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం ఏకంగా 22 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో తొమ్మిది వరకు తెలుగు సినిమాలు ఉండటం విశేషం. వీటిలో ఏస్, ఎలెవన్, శుభం, జింఖానా తదితర చిత్రాలతో పాటు రానా నాయుడు 2 సిరీస్ ఉండటం విశేషం. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?(ఇదీ చదవండి: ‘దేవికా అండ్ డానీ’ రివ్యూ : ఆత్మలతో మాట్లాడే టీచరమ్మ!)ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (జూన్ 13)అమెజాన్ ప్రైమ్బ్లైండ్ స్పాట్ - తెలుగు సినిమాఏస్ - తెలుగు డబ్బింగ్ మూవీఎలెవన్ - తెలుగు సినిమాఇన్ ట్రాన్సిట్ - హిందీ సిరీస్అమెరికన్ థండర్ - ఇంగ్లీష్ సినిమాద ట్రైటర్స్ - హిందీ రియాలిటీ షోడీప్ కవర్ - ఇంగ్లీష్ సినిమానెట్ఫ్లిక్స్కింగ్స్ ఆఫ్ జోబర్గ్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్రానా నాయుడు 2 - తెలుగు సిరీస్ఫ్యూబర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ఫ్లాట్ గర్ల్స్ - థాయ్ మూవీగ్రేస్ అనాటమీ సీజన్ 21 - ఇంగ్లీష్ సిరీస్ (జూన్ 14)హాట్స్టార్కేసరి ఛాప్టర్ 2 - హిందీ సినిమాశుభం - తెలుగు మూవీఅండర్ డాగ్స్ - ఇంగ్లీష్ సిరీస్ (జూన్ 15)సోనీ లివ్అలప్పుళా జింఖానా - తెలుగు డబ్బింగ్ మూవీఆహాసిన్ - తెలుగు సినిమాసన్ నెక్స్ట్డియర్ ఉమ - తెలుగు మూవీజీ5డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్ - తెలుగు డబ్బింగ్ సినిమాఆపిల్ ప్లస్ టీవీఎకో వ్యాలీ - ఇంగ్లీష్ మూవీనాట్ ఏ బాక్స్ - ఇంగ్లీష్ సిరీస్మనోరమ మ్యాక్స్‌సూపర్ గర్ల్స్ - మలయాళ సిరీస్(ఇదీ చదవండి: లైఫ్ అంతా అల్లు అర్జున్‌కు కాపలా కాయడమే సరిపోయింది: బన్నీ వాసు) -
ఓటీటీలో 'కేసరి చాప్టర్ 2' స్ట్రీమింగ్
‘కేసరి చాప్టర్ 2’ (Kesari Chapter 2) సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. జలియన్ వాలాబాగ్ విషాదం నేపథ్యంలో అక్షయ్ కుమార్(Akshay Kumar) హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 18న బాలీవుడ్లో విడుదలైంది. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ అనే ట్యాగ్‌లైన్‌ను చేర్చారు. మాధవన్, అనన్యపాండే, రెజీనా కీలక పాత్రలు పోషించారు. కరణ్ జోహార్ నిర్మించారు. 1919 ఏప్రిల్ 13న అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో ఎంతో మందిప్రాణాలు కోల్పోయారు. ఆ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. చరిత్ర గురించి తెలుసుకోవాలనే కోరిక ఉన్న వారికి ఈ మూవీ మంచి అవకాశం అని చెప్పవచ్చు. జియో హాట్‌స్టార్ (JioHotstar) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు వర్షన్ మరో వారంలోపు విడుదల కావచ్చు.కథేంటంటే..స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఏప్రిల్ 13, 1919లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు సమీపంలో ఉన్న జలియన్‌వాలా బాగ్‌లో సమావేశం అయిన భారతీయులపై అప్పటి పంజాబ్ జనరల్ డయ్యర్ విచక్షణారహితంగా కాల్పులు జరుపుతాడు. తనకున్న అధికార బలంతో ఈ మారణకాండ గురించి స్థానిక వార్తా పత్రికల్లో రాకుండా చేస్తాడు. ఈ ఘటనపై అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఓ కమిషన్ ఏర్పాటు చేస్తుంది.అందులో బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న భారత న్యాయవాది శంకరన్ నాయర్(అక్షయ్ కుమార్) కూడా ఉంటాడు. తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని శంకరన్‌పై ఒత్తిడి తెస్తారు. కానీ జలియన్‌వాలా బాగ్ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని శంకరన్‌కు అర్థమవ్వడంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. యువ అడ్వకేట్ దిల్రీత్ సింగ్(అనన్య పాండే)తో జనరల్ డయ్యర్‌పై కోర్ట్‌లో కేసు వేయిస్తాడు. బాధితుల తరపున ఆయన వాధిస్తాడు.డయ్యర్ తరపున వాధించేందుకు ఇండో బ్రిటన్ న్యాయవాది నెవిల్లే మెక్కిన్లే (ఆర్.మాధవన్) రంగంలోకి దిగుతాడు. ఎలాంటి సాక్ష్యాలే లేని ఈ కేసును శంకరన్ ఎలా డీల్ చేశాడు? డయ్యర్ చేసిన కుట్రను ప్రపంచానికి తెలియజేసేక్రమంలో శంకరన్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? యువ అడ్వకేట్ దిల్రీత్ సింగ్ ఆయనకు ఎలాంటి సహాయం చేసింది? చివరకు డయ్యర్ చేసిన తప్పులను సాక్ష్యాలతో సహా ఎలా బయటపెట్టాడు? అనేదే మిగతా కథ. -
ఓటీటీలో లేటెస్ట్ హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?
ఓటీటీలోకి మరో మంచి సినిమా రాబోతుంది. అక్షయ్ కుమార్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుని, రూ.150 కోట్ల మేర వసూళ్లు సాధించింది. చాన్నాళ్ల హిట్ లేక ఇబ్బంది పడుతున్న అక్షయ్ కుమార్.. కాస్త బూస్టప్ ఇచ్చింది. తర్వాత తెలుగులోనూ రిలీజ్ చేశారు. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు స్ట్రీమింగ్ డేట్ వైరల్ అవుతోంది.జలియన్ వాలాబాగ్ ఉదంతం బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన సినిమా 'కేసరి చాప్టర్ 2'. అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. కోర్టు రూమ్ డ్రామాగా తీసిన ఈ మూవీని తొలుత హిందీలో ఏప్రిల్ 18న రిలీజ్ చేయగా మంచి టాక్ వచ్చింది. నెల తర్వాత అంటే మే 23న తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేయగా ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో జూన్ 13 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. త్వరలో ఈ విషయమై ప్రకటన రావొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)కేసరి 2 విషయానికొస్తే.. 1919లో జలియన్ వాలా బాగ్ మరణకాండ జరిగింది. దీనికి కారకుడు అప్పటి పంజాబ్ జనరల్ మైకేల్ డయ్యర్. తన అధికారం ఉపయోగించి ఈ సంఘటన గురించి వార్తాపత్రికల్లో ఎక్కడా రాకుండా మేనేజ్ చేస్తాడు. అలానే బ్రిటీష్ వైస్రాయ్ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉన్న భారత న్యాయవాది శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్)తో ఓ కమిషన్ ఏర్పాటు చేసి, తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని జనరల్ డయ్యర్ కోరాడు.కానీ జలియన్ వాలా బాగ్ ఘటన గురించి అర్థం చేసుకున్న శంకరన్.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి జనరల్ డయ్యర్‌పై కేసు వేస్తాడు. దీంతో మైకేల్ డయ్యర్ తనని తాను కాపాడుకునేందుకు లాయర్ నెవిల్లే మెక్ కిన్లే (మాధవన్)ని అపాయింట్ చేసుకుంటాడు. మరి జలియన్ వాలా బాగ్ కేసులో శంకరన్ ఎలాంటి వాదనలు వినిపించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: అందుకే నేను 'కన్నప్ప'లో నటించలేదు: మంచు లక్ష్మీ) -
‘కేసరి: చాఫ్టర్ 2(తెలుగు వెర్షన్)’ మూవీ రివ్యూ
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా దేశభక్తి చిత్రం ‘కేసరి: చాప్టర్ 2’. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 18న బాలీవుడ్లో రిలీజై మంచి టాక్ని సంపాదించుకుంది. ఇప్పుడీ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై నేడు(మే 23) ఇది తెలుగులో రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ షో వేశారు. 1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్ మారణకాండ ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఏప్రిల్ 13, 1919లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు సమీపంలో ఉన్న జలియన్‌వాలా బాగ్‌లో సమావేశం అయిన భారతీయులపై అప్పటి పంజాబ్ జనరల్ డయ్యర్ విచక్షణారహితంగా కాల్పులు జరుపుతాడు. తనకున్న అధికార బలంతో ఈ మారణకాండ గురించి స్థానిక వార్తా పత్రికల్లో రాకుండా చేస్తాడు. ఈ ఘటనపై అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఓ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. అందులో బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న భారత న్యాయవాది శంకరన్ నాయర్(అక్షయ్ కుమార్) కూడా ఉంటాడు. తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని శంకరన్‌పై ఒత్తిడి తెస్తారు. కానీ జలియన్‌వాలా బాగ్ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని శంకరన్‌కు అర్థమవ్వడంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. యువ అడ్వకేట్ దిల్రీత్ సింగ్(అనన్య పాండే)తో జనరల్ డయ్యర్‌పై కోర్ట్‌లో కేసు వేయిస్తాడు. బాధితుల తరపున ఆయన వాధిస్తాడు. డయ్యర్ తరపున వాధించేందుకు ఇండో బ్రిటన్ న్యాయవాది నెవిల్లే మెక్కిన్లే (ఆర్.మాధవన్) రంగంలోకి దిగుతాడు. ఎలాంటి సాక్ష్యాలే లేని ఈ కేసును శంకరన్ ఎలా డీల్ చేశాడు? డయ్యర్ చేసిన కుట్రను ప్రపంచానికి తెలియజేసేక్రమంలో శంకరన్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? యువ అడ్వకేట్ దిల్రీత్ సింగ్ ఆయనకు ఎలాంటి సహాయం చేసింది? చివరకు డయ్యర్ చేసిన తప్పులను సాక్ష్యాలతో సహా ఎలా బయటపెట్టాడు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే?శతాబ్దం క్రితం భారత్‌లో చోటుచేసుకున్న జలియన్ వాలాబాగ్ దురంతాన్ని ఇప్పటికీ మర్చిపోలేం. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న భారతీయులపై నాటి బ్రిటిష్ పాలకులు జరిపిన మారణకాండ గురించి పుస్తకాలల్లో చదివాం. భారతీయ న్యాయవాది శంకరన్ చేసిన న్యాయ పోరాటం గురించి కూడా విన్నాం. ఈ రెండిటికి దృశ్యరూపం ఇస్తే.. అది ‘కేసరి: ఛాప్టర్ 2’ చిత్రం అవుతుంది. జలియన్ వాలాబాగ్ దురంతాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే..శంకరన్ చేసిన న్యాయ పోరుని హైలెట్ చేశారు. నిజంగా అప్పట్లో బ్రిటీష్ ఉన్నతాధికారిపై కేసు వేయడం అనేది ఆషామాషీ వ్యవహరం కాదు. కానీ బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న శంకరన్ ఆ సాహసం చేశాడు. దేశ స్వాతంత్రం కోసం ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదో దర్శకుడు కరణ్ సింగ్ మరోసారి తన సినిమా ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. ఈ హిస్టారికల్ కోర్ట్‌రూమ్ డ్రామాని అత్యంత సహజంగా తీర్చిదిద్దాడు. కోర్ట్ సన్నివేశాలే ఈ సినిమాకు కీలకం. శంకరన్, మెక్కిన్లే మధ్య జరిగే వాదనలు ఉత్కంఠను రేకిస్తూనే.. మధ్యలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. జలియన్‌వాలాబాగ్ ఘటన సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది . ఆ తర్వాత శంకరన్ నేపథ్యం, కమీషన్ ఏర్పాటు వరకు కథనం నెమ్మదిగా సాగుతుంది. శంకరన్ డయ్యర్‌కు వ్యతిరేకంగా వాదించడం మొదలు పెట్టినప్పటి నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. తొలి ట్రయల్‌లో శంకరన్ వాదనలు ఆకట్టుకుంటాయి. శంకరన్‌కి పోటీగా డయ్యర్ తరపున మెక్కిన్లే రంగంలోకి దిగడంతో కథనం మలుపు తిరుగుతుంది. సెకండాఫ్ మొత్తం కోర్ట్‌లో జరిగే వాదనల చుట్టూనే కథనం సాగుతుంది. క్లైమాక్స్ అదిరిపోతుంది. మొత్తంగా మనల్ని రెండున్నర గంటల పాటు ఆ కాలం నాటి పరిస్థితులను తీసుకెళ్లి.. బ్రిటీష్ పాలకులు చేసిన అరచకాలను చూపిస్తూనే స్వాతంత్రం కోసం మనవాళ్లు చేసిన పోరాటాలను గుర్తు చేసే చిత్రమిది. డోంట్ మిస్ ఇట్. ఎవరెలా చేశారంటే.. సర్ శంకరన్ నాయర్‌గా అక్షయ్ కుమార్ ఒదిగిపోయాడు. నిజమైన న్యాయవాదిలా ఆయన వాదనలు ఉంటాయి. క్లైమాక్స్‌లో ఆయన చేప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. నెగెటివ్ షేడ్స్ ఉన్న మెక్ కిన్లేగా ఆర్ మాధవన్ ఒదిగిపోయాడు. యువ న్యాయవాది దిల్రీత్ గిల్‌గా అనన్య పాండే తనదైన నటనతో ఆకట్టుకుంది. శంకరన్ భార్యగా రేజీనా ఉన్నంతలో చక్కగానే నటించింది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. సాష్వత్ సచ్దేవ్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు భావోద్వేగాన్ని రగిలించేలా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ డిపార్ట్ మెంట్ పనితీరు అద్భుతం. 1919 నాటి పరిస్థితుల్ని.. నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్