breaking news
Keralites
-
Lok sabha elections 2024: పోటీ కేరళలో.. ప్రచారం గల్ఫ్‌లో!
– ఓ సినిమాలో హీరో చెప్పే డైలాగిది. కేరళ కాంగ్రెస్ నేత షఫి పరంబిల్ దీన్నే గుర్తు చేస్తున్నారు. వడకర లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్–యూడీఎఫ్ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన గల్ఫ్ దేశాల్లో ఓట్లను అభ్యరి్థస్తున్నారు. యూఏఈ, ఖతార్ తదితర గల్ఫ్ దేశాల్లో భారీగా స్థిరపడిన కేరళీయులను కలిసి భారత్‌కు వచ్చి ఓటేయాలని కోరుతున్నారు. షార్జాలో, ఖతార్‌లో తాజాగా కేరళీయులతో సమావేశాలు నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందులు లేకపోతే దయచేసి వచ్చి ఓటేయాలని కోరారు. అలాగే కేరళ నుంచి విదేశాలకు వెళ్తున్న వారు కూడా పోలింగ్ దాకా ప్రయాణం వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. కేరళ ఎన్నారైలు గతంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దాంతో ఈసారి వారి మద్దతు కోసం పరంబిల్ ఇలా గల్ఫ్ యాత్ర చేపట్టారు. కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 26న రెండో విడతలో పోలింగ్ జరగనుంది. పరంబిల్ ప్రస్తుతం పాలక్కాడ్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మెట్రోమ్యాన్‌గా పేరొందిన ఇ.శ్రీధరన్‌పై 3,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం సీపీఎం ఎమ్మెల్యే కేకే శైలజ, బీజేపీ అభ్యర్థి ప్రఫుల్ కృష్ణన్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. దాంతో ప్రచార నిమిత్తం ఇలా గల్ఫ్ బాట పట్టారు. -
నిజమైన భారతీయులు ఆ రాష్ట్రం వారే!
ప్రెస్ కౌన్సిల్ మాజీచైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ తాజాగా ఫేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్టు బాగా హల్ చల్ చేస్తోంది. కేరళ వాసులే 'నిజమైన భారతీయుల'ని కీర్తిస్తూ ఆయన ఈ పోస్టులో ప్రశంసల వర్షం కురిపించారు. 'నిజమైన భారతీయులు' టైటిల్ కు కేరళ వాసులు ఎందుకు అర్హులో వివరిస్తూ.. భారతీయులకు ఉండాల్సిన సహజ లక్షణాలెన్నో వారిలో ఉన్నాయని, ఒకరితో ఒకరి కలిసిమెలిసి సామరస్యంతో జీవించే గొప్ప భారతీయ గుణం కేరళ వాసుల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. వివిధ మతాలు, కులాలు, జాతులకు చెందిన ప్రజలు కేరళలో కలిసిమెలిసి జీవించడం గమనించవచ్చునని, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ ముందుకుసాగుతున్న వారి విశాల దృక్పథాన్ని మిగతా దేశం కూడా అవలంబించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్టుతో కేరళ వాసులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కట్జూ వ్యాఖ్యలను స్వాగతిస్తూ.. లైకులు, షేరింగులతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే కట్జూ పోస్టుకు 21వేల లైకులు, 14,400 షేరింగులు రాగా.. అందులో అత్యధికంగా కేరళ మిత్రుల నుంచే ఉన్నాయని అంటున్నారు. అయితే, ఈ పోస్టులో ఈశాన్య రాష్ట్రాల గురించి జస్టిస్ కట్జూ మాటమాత్రమైన ప్రస్తావించకపోవడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
మా నర్సులను వెనక్కి రప్పించండి..
తిరువనంతపురం: యెమెన్‌లో చిక్కుకుపోయిన కేరళ నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని తిరిగి స్వదేశానికి రప్పించాలని కేరళ సీఎం ఊమెన్ చాందీ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై తక్షణమే స్పందించి , తగిన చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రధానికి ఆయనో లేఖ రాశారు. తమను వెనక్కి రప్పించాలని కోరుతూ అనేకమంది నర్సులు భయంతో వణికిపోతూ ఫోన్లు చేస్తున్నారనీ... కన్నీళ్లతో వేడుకుంటున్నారని చాందీ చెప్పారు. సానా మిలిటరీ ఆసుపత్రి యాజమాన్యం సహా కొన్ని ఆసుపత్రులు తమ దేశాన్ని వీడిచి వెళ్లేందుకు నర్సులకు, ఇతర సిబ్బందికి అనుమతి నిరాకరిస్తున్నారని తెలిపారు. వారి పాస్‌పోర్టులను తమ దగ్గర పెట్టుకొని నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించి భారత రాయబార కార్యాలయం ఆయా ఆసుపత్రులతో మాట్లాడి, తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కోరారు. కేరళ ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 600 మంది కేరళీయులు సానా విమానాశ్రయంలో ఎదురుతెన్నులు చూస్తున్నట్టు సమాచారం. యెమన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారతీయులను ఇండియాకు రప్పించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. వీలైన అన్ని మార్గాల ద్వారా స్వదేశానికి వచ్చేయాలని కూడా భారత ప్రభుత్వం అక్కడున్న మనవారికి అడ్వైజరీ ఇచ్చింది. -
ఓనమ్ము... భోజనమ్ము..!
పుస్తెలు అమ్ముకునైనా పులసల్ని వండుకుతినాలని మన దగ్గర సామెత. కేరళలో కూడా ఇలాంటిదే ఒక సామెత ఉంది! ‘కనం విట్టుం ఓనమ్ ఉన్ననం’ అంటారు వాళ్లు. ఆస్తుల్ని అమ్ముకునైనా ‘తిరుఓనం’ విందును ఆరగించాల్సిందేనట!! ఎల్లుండే కేరళీయుల ఓనం పండుగ! పదో రోజు వచ్చేది తిరు ఓనమ్ పండుగ. అప్పుడు చూడాలి... అదో ఫుడ్ ఫెస్టివల్‌లా ఉంటుంది. అవియల్, అడై ప్రదమన్, ఇడియప్పమ్... పరిప్పు, వళైక్కళ్ తోరణ్... ఏతక్కప్పమ్... ఒకటా రెండా! పక్కన తెలుగువాళ్లుంటే... ఇరుగుదేవోభవ, పొరుగుదేవోభవ అనుకుంటూ... క్యారేజీలు కూడా వచ్చేస్తాయి! అందరి ఇళ్లూ కేరళ వాళ్ల పక్కన ఉండవు కదా... మరెలా? అందుకే కదా... ఈ రుచుల మేళా! పుస్తెలు, ఆస్తులు ఏవీ అమ్ముకోకుండానే... తృప్తిగా తిని త్రేన్చండి! హ్యాపీ ఓనం. హ్యాపీ తిరు ఓనం. అవియల్ కావలసినవి: కూరగాయ ముక్కలు - మూడు కప్పులు (క్యారట్, బీన్స్, ఆలు, మునగకాడలు, పొట్లకాయ, అరటికాయ, తీపి గుమ్మడికాయ, సొరకాయ, కంద...); గట్టి పెరుగు - అర కప్పు; పసుపు - పావు టీ స్పూను; ఉప్పు - రుచికి తగినంత; కొబ్బరి తురుము - కప్పు; పచ్చిమిర్చి - 10; కొత్తిమీర - కప్పు; ఉల్లితరుగు - పావు కప్పు; కొబ్బరినూనె - చిన్నగిన్నెడు; కరివేపాకు - చిన్న కట్ట; జీలకర్ర - అర టీ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; ఎండుమిర్చి - 2 (చిన్నగా ముక్కలు చేయాలి) తయారి: ఒక పాన్‌లో తరిగి ఉంచుకున్న కూరముక్కలు, పసుపు, తగినంత నీరు వేసి ముక్కలు బాగా మెత్తబడేవరకు ఉడికించాలి మిక్సీలో కొబ్బరితురుము, ఉల్లితరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పెరుగు, ఉప్పు వేసి పేస్ట్‌లా చేయాలి చిలకరించిన పెరుగు వేసి మరోమారు కలిపి దించేయాలి బాణలిలో టేబుల్ స్పూను కొబ్బరినూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి కరివేపాకు వేసి ఒకసారి కలిపి దించేయాలి కూరలో ఈ పోపు వేసి కలపాలి చివరగా కొబ్బరినూనె వేసి బాగా కలిపి దించేయాలి ఇది రోటీలలోకి, అన్నంలోకి బాగుంటుంది. ఏతక్క అప్పం కావలసినవి: అరటిపళ్లు - 5; మైదా - కప్పు; బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు; పంచదార - 3 టేబుల్ స్పూన్లు; పసుపు - చిటికెడు; నీరు - కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; వంటసోడా - చిటికెడు; ఉప్పు - చిటికెడు; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా తయారి: అరటిపండు తొక్క తీసి పండును పొడవు (నిలువు)గా కట్ చేయాలి ఒక గిన్నెలో మైదాపిండి, బియ్యప్పిండి, పంచదార, పసుపు, ఉప్పు, వంటసోడా వేసి కలపాలి కొద్దికొద్దిగా నీరు జత చేస్తూ, పిండిని బజ్జీలపిండి మాదిరిగా చేసుకోవాలి బాణలిలో నూనెపోసి కాగాక, కట్ చేసి ఉంచుకున్న అరటిపండు ముక్కలను పిండిలో ముంచి బజ్జీలు వేసుకోవాలి గోధుమవర్ణంలోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదికి తీసుకోవాలి వేడివేడి టీతో స్నాక్‌గా సర్వ్ చేయాలి. అడై ప్రదమన్ కావలసినవి: శనగపప్పు - కప్పు (ఉడికించి మెత్తగా చేయాలి); కొబ్బరితురుము - ఒకటిన్నర కప్పులు; బెల్లంతురుము - కప్పు; ఏలకులపొడి - టీ స్పూను; నెయ్యి - పావు కప్పు; జీడిపప్పు పలుకులు - 10; కిస్మిస్ - టేబుల్ స్పూన్; కొబ్బరి ముక్కలు - రెండు టేబుల్ స్పూన్లు తయారి: బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు పలుకులు, కిస్మిస్, కొబ్బరిముక్కలు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి పక్కన ఉంచాలి చల్లటి నీటిలో కొబ్బరితురుము వేసి రెండుమూడు నిముషాలు ఉంచి, ఆ తరవాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి కొబ్బరిని గట్టిగా పిండితే కొబ్బరి పాలు వస్తాయి. వాటిని పక్కన ఉంచాలి (మొదటిసారి తీసినప్పుడు చిక్కటిపాలు వస్తాయి. మళ్లీ నీరుపోసి బాగా కలిపితే వచ్చేవి పల్చగా ఉంటాయి. రెండిటినీ విడివిడిగా ఉంచాలి) ఒక పెద్ద పాత్రలో చిక్కటి కొబ్బరిపాలు, నీరు, మెత్తగా చేసిన శనగపప్పు, సగం నెయ్యి వేసి బాగా కలిపి పొయ్యి మీద ఉంచి ఐదు నిముషాలు ఉడికించాలి కొబ్బరితురుము జత చేసి ఆపకుండా కలుపుతుండాలి మిగిలిన నెయ్యి, ఏలకుల పొడి వేసి కలపాలి చివరగా పల్చటి కొబ్బరిపాలు వేసి రెండు నిముషాలు ఉడికించి దించాలి డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేయాలి. వజైక్కల్ తోరణ్ కావలసినవి: అరటికాయలు - 2; కొబ్బరితురుము - అర కప్పు; పచ్చిమిర్చి - 4; సాంబారు ఉల్లిపాయలు - 6; జీలకర్ర - అర టీ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; పసుపు - చిటికెడు; కరివేపాకు - రెండు రెమ్మలు; ఎండుమిర్చి - 1; ఉప్పు - తగినంత; కొబ్బరినూనె - టేబుల్ స్పూను తయారి: అరటికాయలను శుభ్రంగా కడిగి, తొక్క తీసి, ముక్కలు కట్ చేయాలి బాణలిలో అరటికాయముక్కలు, పసుపు, ఉప్పు, తగినంత నీరు వేసి ముక్కలు మెత్తబడేవరకు ఉడికించి నీరు ఒంపేయాలి ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి మిక్సీలో వేసి మిక్సీ పట్టి పక్కన ఉంచాలి (మరీ మెత్తగా ఉండకూడదు) బాణలిలో కొబ్బరినూనె వేసి కాగాక, ఆవాలు కరివేపాకు, ఎండుమిర్చి వేసి రెండు నిముషాలు వేయించాలి కొబ్బరితురుము జత చేసి బాగా కలపాలి ఉడికించిన అరటికాయ ముక్కలు వేసి కలిపి రెండు నిముషాలు ఉంచి దించేయాలి వేడివేడి అన్నంతో సర్వ్ చేయాలి. ఇడియప్పమ్ కావలసినవి: బియ్యప్పిండి - 2 కప్పులు; నీరు - రెండు కప్పులు (అవసరమనుకుంటే మరికాస్త నీరు కలుపుకోవచ్చు); కొబ్బరితురుము - అర కప్పు; ఉప్పు - తగినంత: నూనె - అర టీ స్పూను తయారి: బియ్యప్పిండి పాన్‌లో వేసి రెండు నిముషాలు వేయించాలి (నూనె వాడకూడదు) పెద్దపాత్రలో నీరు పోసి మరిగించాలి ఉప్పు జత చేసి బాగా కలిపి దించేయాలి వేయించి ఉంచిన బియ్యప్పిండిని వేడినీటిలో కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి చల్లారాక జంతికల పిండి మాదిరిగా కలపాలి ఇడ్లీ రేకులకు నూనె లేదా నెయ్యి రాయాలి అన్ని గుంటలలోనూ కొబ్బరితురుము చల్లాలి పిండిని తీసుకుని జంతికల గొట్టంలో వేసి (కారప్పూస ప్లేట్ ఉపయోగించాలి) ఇడ్లీ రేకుల మీద జంతికల మాదిరిగా చుట్టాలి అన్ని ప్లేట్లను కుకర్‌లో ఉంచి మూతపెట్టి,పదిహేను నిముషాలు ఉడికించాలి (విజిల్ పెట్టకూడదు) సాంబార్‌తో సర్వ్ చేయాలి. పరిప్పు కర్రీ కావలసినవి: పెసరపప్పు - అరకప్పు; పసుపు - చిటికెడు; నీరు - రెండు కప్పులు; ఉప్పు - తగినంత; కొబ్బరితురుము - అరకప్పు; ఉల్లి తరుగు - పావుకప్పు; పచ్చిమిర్చి - 4; జీలకర్ర - అర టీ స్పూను; కొబ్బరినూనె - 2 టీ స్పూన్లు; ఆవాలు - పావు టీ స్పూను; ఉల్లితరుగు - టేబుల్ స్పూను; ఎండుమిర్చి - 2 తయారి: బాణలిలో పెసరపప్పు వేసి వేయించాలి (నూనె వేయకూడదు) ఒక గిన్నెలో పెసరపప్పు, పసుపు, రెండు కప్పుల నీరు వేసి కుకర్‌లో ఉంచి మూడు విజిల్స్ వచ్చాక దించేయాలి కొబ్బరి తురుము, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా నీరు కలిపి మిక్సీలో వేసి పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి విజిల్ తీసి పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసుకుని మాష్ చేసి, కొబ్బరి మిశ్రమం, ఉప్పు జత చేయాలి ఐదు నిముషాలు స్టౌ మీద ఉంచాలి బాణలిలో కొబ్బరినూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక, కరివేపాకు, ఉల్లితరుగు, ఎండుమిర్చి వేసి వేయించి దించేయాలి పెసరపప్పు మిశ్రమంలో పోపు వేసి కలపాలి వేడివేడి అన్నం, నేతితో సర్వ్ చేయాలి. సేకరణ : డా. వైజయంతి కర్టెసీ : ఇండియన్ క్విజైన్