తిప్పాయిగూడలో కేరళ అధికారుల పర్యటన
                  
	మంచాల, న్యూస్‌లైన్:  మండలంలోని తిప్పాయిగూడలో చేపట్టిన ఉపాధి హామీ పనులను శనివారం కేరళ ఐఏఎస్ అధికారుల బృందం పరిశీలించింది. పండ్ల తోటలు, పశుగ్రాసం, పొలం గట్లపై  టేకు మొక్కల పెంపకం, వాటి ఉపయోగాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అంతర్ పంటలను సాగు చేయడం వల్ల రైతులకు  రెండు రకాలుగా లాభాలు కలుగుతాయని ఏపీడీ వెంకటేశ్వర్లు,  టీఏ తిరుపతాచారి వారికి వివరించారు.
	ఉపాధి హామీ పనుల వివరాలను కంప్యూటర్లలో ఎలా నమోదు చేస్తారు. రికార్డుల నమోదు వంటి  పక్రియ గురించి అధికారుల బృందం తెలుసుకున్నారు. ఇక్కడ జరుగుతున్న పనులను తమ రాష్ట్రం లోనూ అమలు చేసేందుకు కృషి చే స్తామని వారు తెలిపారు.  కార్యక్రమంలో  కేరళ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ కె. కౌశి కన్, ఈజీఎస్ మిషన్ జా యింట్ డెరైక్టర్లు  ఎ.జయ కుమార్,  జ యంత్, ఈజీఎస్ కమిషనర్ విజయ్, సా ంకేతిక  అధికారి వి.అజిత్,  డ్వామా పీడీ చంద్రకాంత్‌రెడ్డి, ఏపీడీ వెంకటేశ్వర్లు, టీఏ తిరుపతాచారి పాల్గొన్నారు.
	 ‘ఉపాధి’ కార్యాలయం సందర్శన
	 యాచారం:  కేరళకు చెందిన ఉన్నతస్థాయి అధికారుల బృందం శనివారం స్థానిక ఈజీఎస్ కార్యాలయాన్ని సందర్శించింది. కేరళ రాష్ట్రానికి చెందిన ఈజీఎస్ మిషన్ డెరైక్టర్ కౌషికన్, జాయింట్ డెరైక్టర్  జయకుమార్తో పాటు పలువురు అధికారులు యాచారంలోని ఈజీఎస్  కార్యాలయాన్ని సందర్శించారు.  ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులతో  కూలీలు, రైతులు లబ్ధిపొందుతున్న తీరు, పనుల నమోదు, బిల్లుల చెల్లింపు తదితర విషయాలను  డ్వామా పీడీ చంద్రకాంత్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కూలీలకు సంబంధించి వివరాలను కంప్యూటర్లో నమోదు చేసే పద్ధతిని వారు అధ్యయనం చేశారు.  జాబ్‌కార్డుల నమోదు, పథకం వల్ల లబ్ధిపొందిన రైతుల వివరాలు తెలుసుకున్నారు.